ప్రధాన మంత్రి కార్యాలయం

ఘనమైన ఆసియా సింహాల సంఖ్య పెరుగుతున్నందుకు ప్రధానమంత్రి సంతోషం వ్యక్తం చేశారు

Posted On: 10 JUN 2020 8:05PM by PIB Hyderabad

గుజరాత్ రాష్ట్రం లోని గిర్ అడవిలో నివసిస్తున్న ఘనమైన ఆసియా సింహాల సంఖ్య పెరుగుతున్నందుకు, ప్రధానమంత్రి  శ్రీ నరేంద్ర మోడీ సంతోషం వ్యక్తం చేశారు.

ప్రధానమంత్రి ఈ విషయాన్ని ట్వీట్ చేస్తూ, "రెండు మంచి వార్తలు: గుజరాత్ రాష్ట్రంలోని గిర్ అడవిలో నివసిస్తున్న ఘనమైన ఆసియా సింహాల సంఖ్య దాదాపు 29 శాతం పెరిగింది.  భౌగోళికంగా, పంపిణీ ప్రాంతం 36 శాతం పెరిగింది.

గుజరాత్ ప్రజలకు మరియు ఈ అద్భుతమైన ఘనతకు దోహదపడిన వారందరి కృషికీ అభినందనలు. 

గత అనేక సంవత్సరాలుగా,  గుజరాత్‌లో  సింహాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

సమాజ భాగస్వామ్యం, సాంకేతిక పరిజ్ఞానం, వన్యప్రాణుల ఆరోగ్య సంరక్షణ, సరైన నివాస నిర్వహణ మరియు మానవులు-సింహాల మధ్య సంఘర్షణను తగ్గించే చర్యల ద్వారా ఇది సాధ్యమయ్యింది. ఈ సానుకూల ధోరణి కొనసాగుతుందని ఆశిస్తున్నాను! " అని పేర్కొన్నారు. 
 

*****(Release ID: 1630803) Visitor Counter : 174