ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ మరియు కంబోడియా ప్రధానమంత్రి గౌరవనీయులు సండెక్ అక్క మోహ సేన పడేయ్ టెకో హున్ సేన్ మధ్య టెలిఫోన్ సంభాషణ.
Posted On:
10 JUN 2020 8:01PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు కంబోడియా ప్రధానమంత్రి గౌరవనీయులు సండెక్ అక్క మోహ సేన పడేయ్ టెకో హున్ సేన్ తో టెలిఫోన్ లో మాట్లాడారు.
కోవిడ్-19 మహమ్మారి గురించి ఇరువురు నాయకులు చర్చించారు. ఒకరి దేశంలో చిక్కుకున్న మరొకరి దేశస్థులను వారి స్వదేశాలకు తరలించే ప్రక్రియలో పరస్పరం సహకారాన్ని కొనసాగించాలని వారు అంగీకరించారు.
భారతదేశంతో నాగరిక మరియు సాంస్కృతిక సంబంధాలను పంచుకుంటూ, ఆసియాన్ లో ముఖ్య సభ్యదేశమైన కంబోడియాతో తన సంబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలన్న భారతదేశ నిబద్ధతను ప్రధానమంత్రి వ్యక్తం చేశారు.
ఐ.టి.ఈ.సి. పధకం కింద సామర్ధ్య నిర్మాణం, మెకాంగ్-గంగా సహకార ఫ్రేమ్ వర్క్ కింద క్విక్ ఇంపాక్ట్ ప్రాజెక్టులతో సహా ఇరు దేశాల మధ్య నెలకొన్న బలమైన అభివృద్ధి భాగస్వామ్యాన్ని ఇరువురు నాయకులు సమీక్షించారు
భారతదేశంతో తమ దేశానికి ఉన్న సంబంధాల ప్రాముఖ్యతను కంబోడియా ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. కంబోడియా వ్యక్తం చేసిన మనోభావాలకు ప్రతిస్పందిస్తూ, భారతదేశం అవలింబిస్తున్న "యాక్ట్ ఈస్ట్ విధానం" లో కంబోడియా పోషిస్తున్న విలువైన పాత్రను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశంసించారు.
*****
(Release ID: 1630801)
Visitor Counter : 240
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam