పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
పట్టణ అటవీ పథకం కింద వచ్చే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 200 ‘నగర వనాలను' అభివృద్ధి చేయనున్నారు.
పట్టణ అటవీ పధకం నగరాల్లో గ్రామ అటవీ సంప్రదాయాన్ని పునరుద్ధరిస్తుంది : శ్రీ ప్రకాష్ జవదేకర్
Posted On:
05 JUN 2020 1:27PM by PIB Hyderabad
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా, అటవీ శాఖ, మునిసిపల్ సంస్థలు, ప్రభుత్వేతర సంస్థలు, కార్పొరేట్ సంస్థలు మరియు స్థానిక ప్రజల మధ్య ప్రజల భాగస్వామ్యం మరియు సహకారంపై నూతన దృష్టితో వచ్చే ఐదేళ్ళలో దేశవ్యాప్తంగా 200 పట్టణ అడవులను అభివృద్ధి చేయడానికి నగర వనాలు పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి సంవత్సరం జూన్ నెల 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం (డబ్ల్యూ.ఈ.డి.) ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీన జరుపుకుంటారు. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (యు.ఎన్.ఈ.పి.) ప్రకటించిన ఇతివృత్తంపై దృష్టి సారించి, పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఈ సంవత్సరం ‘జీవవైవిధ్యం’ ఇతివృత్తంగా నిర్ణయించారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా, మంత్రిత్వ శాఖ ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలను, ఈ ఏడాది ఇతి వృత్తం కింద "నగర్ వన్" (పట్టణ అడవులు) పై దృష్టి పెట్టింది.
పట్టణ అడవుల పెంపకంలో ఉత్తమ పద్ధతులపై ఒక బ్రోచర్‌ను విడుదల చేసిన అనంతరం కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి శ్రీ ప్రకాష్ జవదేకర్, పట్టణ అటవీ పధకాన్ని ప్రారంభించారు. ఇవి నగరాలకు ఊపిరి తిత్తులుగా పనిచేస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ అడవులను ప్రధానంగా నగరాల్లోని అటవీ భూముల్లోనూ లేదా స్థానిక పట్టణ సంస్థలు చూపించిన ఇతర ఖాళీ స్థలాల్లో పెంచుతారు. జీవవైవిధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి ఈ సంవత్సరం ఇతివృత్తం "ప్రకృతి కోసం సమయం" గురించి శ్రీ జవదేకర్ నొక్కి చెబుతూ, "మనం ప్రకృతిని రక్షిస్తే, ప్రకృతి మనలను రక్షిస్తుంది. అనేది ప్రధాన సూత్రం", అని పేర్కొన్నారు.
https://twitter.com/PrakashJavdekar/status/1268808470976843778?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1268808470976843778&ref_url=https%3A%2F%2Fpib.gov.in%2FPressReleasePage.aspx%3FPRID%3D1629563
ఈ రోజు పర్యావరణ దినోత్సవ వేడుకల సందర్భంగా ఒక చిత్రాన్ని ప్రదర్శించడం జరిగింది. ఇది అటవీ శాఖ మరియు స్థానిక సంస్థతో కలిసి పునైకర్లు 16.8 హెక్టార్ల బంజరు కొండను పచ్చని అటవీ ప్రాంతంగా మార్చడం జరిగింది. ఈ రోజున, ఆ అడవి 23 మొక్కల జాతులు, 29 పక్షి జాతులు, 15 సీతాకోకచిలుక జాతులు, 10 సరీసృపాలు మరియు 3 క్షీరద జాతులతో కళ కళ లాడుతోంది. ఈ పట్టణ అటవీ ప్రాజెక్టు ఇప్పుడు పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి సహాయపడుతోంది, పర్యావరణ మరియు సామాజిక అవసరాలకు ఉపయోగపడుతోంది. వార్జే పట్టణ అటవీ ప్రాంతం ఇప్పుడు దేశంలోని మిగిలిన ప్రాంతాలకు ఆదర్శంగా నిలిచింది.
ఈ సంవత్సరం జీవవైవిధ్యంపై దృష్టి సారించిన విషయం గురించి పర్యావరణ శాఖ మంత్రి మాట్లాడుతూ, “భారతదేశంలో ప్రపంచ జీవవైవిధ్యంలో 8 శాతం ఉంది. ప్రపంచ భూభాగంలో 2.5% లో మాత్రమే, 16% మానవ మరియు పశువుల జనాభాను, మరియు కేవలం 4 శాతం మాత్రమే మంచి నీటి వనరులు ఉన్నాయి. ప్రకృతితో మమేకమైన భారతీయ సంస్కృతి ఫలితమే, మనం అనుభవిస్తున్న ఈ జీవవైవిధ్యానికి మూలంగా ఉంది." అని వివరించారు.
https://twitter.com/PrakashJavdekar/status/1268807207996407808?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1268807207996407808&ref_url=https%3A%2F%2Fpib.gov.in%2FPressReleasePage.aspx%3FPRID%3D1629563
భారతీయ సంస్కృతి గురించి శ్రీ జవదేకర్ మాట్లాడుతూ “చెట్లను పూజించే ఏకైక దేశం భారతదేశం, ఇక్కడ జంతువులు, పక్షులు మరియు సరీసృపాలు పూజించబడుతున్నాయి. మరియు పర్యావరణానికి భారతీయ సమాజం ఇస్తున్న గౌరవం ఇదే." అని పేర్కొన్నారు. యుగాల నుండి మనకు గ్రామ అటవీప్రాంతం చాలా ముఖ్యమైన సంప్రదాయంగా ఉంది. ఇప్పుడు పట్టణ అటవీప్రాంతం యొక్క ఈ కొత్త పథకం ఆ అంతరాన్ని పూరిస్తుంది. ఎందుకంటే పట్టణ ప్రాంతాలలో ఉద్యానవనాలు ఉన్నాయి, కానీ చాలా అరుదుగా అడవులు ఉన్నాయి; పట్టణ అడవిని సృష్టించే ఈ చర్యతో మనం అదనపు కార్బన్ సింక్‌ను కూడా సృష్టిస్తాము అని కేంద్ర మంత్రి చెప్పారు.
ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి శ్రీ బాబుల్ సుప్రియో మాట్లాడుతూ, చెట్ల పెంపకం మరియు దేశంలోని జీవవైవిధ్య పరిరక్షణకు ప్రధాన వ్యూహంగా నేల తేమ పరిరక్షణ పనుల గురించి నొక్కి చెప్పారు. నేల క్షీణత, మృత్తికా నిక్షేపాలు, సిల్టేషన్ మరియు నదీ పరీవాహక ప్రాంతాలలో నీటి ప్రవాహాన్ని తగ్గించడం వంటి సమస్యలను పరిష్కరించడానికి మరియు ప్రతి ఒక్కరూ సమిష్టిగా పనిచేయాలని ఆయన ఉద్ఘాటించారు.
ఈ కార్యక్రమంలో యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ టూ కంబాట్ డెసెర్టిఫికేషన్ (యు.ఎన్.సి.సి.డి.) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ ఇబ్రహీం థావ్ మరియు ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (యు.ఎన్.ఈ.పి.), ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీమతి ఇంజెర్ అండర్సన్ వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా పాల్గొన్నారు.
యు.ఎన్.సి.సి.డి. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఇబ్రహీం థావ్ మాట్లాడుతూ “ప్రకృతి మనకు అవసరమయ్యే దానికంటే మనకే ప్రకృతి అవసరమని మనం గ్రహించిన సమయం ఇది కాదా. అదేవిధంగా, ప్రకృతితో మన సంబంధాన్ని పునరాలోచించుకోవడానికి, పునః నిర్వచించటానికి ఇది సమయం కాదా. బహుశా, ప్రకృతి కోసం మానవాళి కొత్త సామాజిక ఒప్పందం కుదుర్చుకోడానికి ఇదే మంచి సమయం. ” అని పేర్కొన్నారు.
ఈ సంవత్సరం ఇతివృత్తంపై శ్రీమతి ఆండర్సన్ మాట్లాడుతూ, ప్రకృతి కోసం చర్యలు అంటే, భవిష్యత్తులో మహమ్మారికి తక్కువ ప్రమాదం, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాన్ని సాధించడం, వాతావరణ మార్పులను మందగించడం, ఆరోగ్యకరమైన జీవితాలు, మెరుగైన ఆర్థిక వ్యవస్థలు, ఆ తాజా గాలిని పీల్చుకోగలగండం, లేదా అడవుల్లో నడవగలగడమే, జీవితాలను కాపాడుకోవడంగా భావించాలని వివరించారు. కోవిడ్ అనంతర ప్రపంచంలో, మనం మంచిగా తిరిగి నిర్మించాల్సిన అవసరం ఉంది, మనల్ని మనం రక్షించుకోవడానికిగాను, మనం భూగ్రహాన్ని రక్షించుకోవాలి.
ఈ కార్యక్రమంలో - మాహారాష్ట్ర ప్రభుత్వ అటవీ శాఖ మంత్రి శ్రీ సంజయ్ రాథోడ్; పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా నూతనంగా నియమితులైన శ్రీ ఆర్.పి. గుప్త; అటవీ శాఖ డైరెక్టర్ జనరల్ మరియు ప్రత్యేక కార్యదర్శి శ్రీ సంజయ్ కుమార్; పెర్సిస్టెంట్ సిస్టమ్ కు చెందిన ఆనంద్ దేశ్ పాండే; పూణే లోని టి.ఈ.ఆర్.ఆర్.ఈ. పాలసీ సెంటర్ డైరెక్టర్, డాక్టర్ వినీతా ఆప్టే ప్రభృతులు పాల్గొని, తమ అభిప్రాయాలను, అనుభవాలను పంచుకున్నారు.
భారతదేశం గొప్ప జీవవైవిధ్యంతో అనేక జాతుల జంతువులు మరియు మొక్కలను కలిగి ఉంది. 35 స్థానిక జీవవైవిధ్య హాట్‌స్పాట్లలకు గాను నాలుగింటిలో అనేక స్థానిక జాతులు ఉన్నాయి. అయినప్పటికీ, పెరుగుతున్న జనాభా, అటవీ నిర్మూలన, పట్టణీకరణ మరియు పారిశ్రామికీకరణ మన సహజ వనరులను తీవ్ర ఒత్తిడికి గురిచేసి జీవవైవిధ్యాన్ని కోల్పోయే పరిస్థితికి దారితీస్తున్నాయి. ఈ భూగోళం మీద అన్ని జీవుల మనుగడకు జీవవైవిధ్యం చాలా ముఖ్యమైనది. వివిధ పర్యావరణ సేవలను అందించడంలో అదే కీలకం. జీవవైవిధ్య పరిరక్షణ సాంప్రదాయకంగా మారుమూల అటవీ ప్రాంతాలకు మాత్రమే పరిమితం చేయబడింది, అయితే పెరుగుతున్న పట్టణీకరణతో పట్టణ ప్రాంతాల్లో కూడా జీవవైవిధ్యాన్ని కాపాడటానికి, పరిరక్షించడానికీ అవసరం ఏర్పడింది. ఈ అంతరాన్ని తగ్గించడానికి పట్టణాల్లో అడవులను పెంచడం ఒక్కటే ఉత్తమ మార్గం. పట్టణ ప్రకృతి దృశ్యాలలో జీవవైవిధ్యాన్ని ప్రోత్సహించడానికి మరియు పరిరక్షించడంకోసం, పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, 2020 ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలకు "నగరాల్లో వనాలు" అనే ఇతివృత్తంగా ఎంపిక చేయడం ఎంతో సముచితంగా ఉంది.
*****
(Release ID: 1629666)
Visitor Counter : 595
Read this release in:
Marathi
,
Bengali
,
English
,
Urdu
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam