ఆర్థిక మంత్రిత్వ శాఖ

ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ - ఇంతవరకు సాధించిన ప్రగతి

ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ కింద సుమారు 42 కోట్ల మంది పేద ప్రజలకు దాదాపు 53,248 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం లభించింది.

Posted On: 03 JUN 2020 9:09AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీలో భాగంగా 1.70 కోట్ల రూపాయలతో మహిళలు, పేద వయో వృద్దులు, రైతులకు ఉచిత ఆహార ధాన్యాలు, నగదు చెల్లింపును ప్రభుత్వం ప్రకటించింది.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  ప్యాకేజీ యొక్క వేగవంతమైన అమలును నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి.  ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ (పి.ఎమ్.జి.కే.పి.)  కింద సుమారు 42 కోట్ల మంది పేద ప్రజలు దాదాపు 53,248 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని స్వీకరించారు.  

పి.ఎమ్.జి.కే.పి. లోని వివిధ విభాగాల క్రింద ఇప్పటివరకు సాధించిన పురోగతి వివరాలు వవ విధంగా ఉన్నాయి :

*     పి.ఎం.-కిసాన్ పధకం మొదటి విడత చెల్లింపుల కింద ‌ను 8.19 కోట్ల మంది లబ్ధిదారులకు చెల్లించడానికి 16,394 కోట్ల రూపాయలు ఫ్రంట్ లోడ్ చేయబడింది.

*           మొదటి విడతగా 20.05 కోట్ల (98.33%) మహిళా జన ధన్ ఖాతాదారులకు 10,029 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది.  1వ వాయిదా కింద కస్టమర్ ప్రేరిత లావాదేవీల ద్వారా డెబిట్ చేయబడిన మహిళల పి.ఎమ్.‌జె.డి.వై.  ఖాతాదారుల సంఖ్య  8.72 కోట్లు (44%).  2వ వాయిదా కింద 20.62 కోట్ల (100%) మహిళా ధన్ ఖాతాదారులకు 10,315 కోట్ల రూపాయలు  జమ అయ్యాయి.  2 వ విడత కింద కస్టమర్ ప్రేరిత లావాదేవీల ద్వారా డెబిట్ చేయబడిన మహిళల పి.ఎమ్.‌జె.డి.వై. ఖాతాదారుల సంఖ్య 9.7 కోట్లు (47%).

*          మొత్తం 2,814.5 కోట్ల రూపాయలను రెండు విడతలుగా సుమారు 2.81 కోట్ల మంది  వృద్ధులు, వితంతువులు మరియు వికలాంగులకు పంపిణీ చేశారు. మొత్తం 2.81 కోట్ల మంది లబ్ధిదారులందరికీ రెండు వాయిదాలలో ఈ ప్రయోజనాలను  బదిలీ చేయడం జరిగింది. 

*          2.3 కోట్ల మంది భవన మరియు నిర్మాణ కార్మికులు 4,312.82 కోట్ల రూపాయల మేర ఆర్థిక సహాయం స్వీకరించారు. 

*          ఇంతవరకు, 101 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను 36 రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు స్వీకరించాయి.    2020 ఏప్రిల్ నెలకు గాను 36 రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాలు 73.86 కోట్ల లబ్ధిదారులకు 36.93 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను పంపిణీ చేశాయి.  2020 మే నెలకు గాను 35 రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాలు 65.85 కోట్ల లబ్ధిదారులకు 32.92 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను పంపిణీ చేశాయి. 2020 జూన్ నెలకు గాను 17 రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాలు 7.16 కోట్ల లబ్ధిదారులకు 3.58 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను పంపిణీ చేశాయి.  వివిధ రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాలకు 5.06 లక్షల మెట్రిక్ టన్నుల పప్పులు రవాణా చేయడం జరిగింది.  మొత్తం 19.4 కోట్ల మంది లబ్దిదారులలో ఇంతవరకు 17.9 కోట్ల మంది లబ్దిదారులకు మొత్తం 1.91 లక్షల మెట్రిక్ టన్నుల పప్పులు అందజేయడం జరిగింది. 

*         పి.ఎం.యు.వై. పథకం కింద ఇప్పటివరకు మొత్తం 9.25 కోట్ల సిలిండర్లను బుక్ చేయగా, వీటిలో ఇప్పటి వరకు 8.58 కోట్ల పి.ఎం.యు.వై. ఉచిత సిలిండర్ ల‌ను లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. 

*          16.1 లక్షల మంది ఈ.పి.ఎఫ్.ఓ. సభ్యులు తమ ఈ.పి.ఎఫ్. ఖాతాల నుండి 4,725 కోట్ల రూపాయల మేర తిరిగి చెల్లించనవసరం లేని అడ్వాన్స్‌ను ఆన్‌లైన్ ద్వారా తీసుకుని ప్రయోజనం పొందారు. 

*        పెరిగిన రేటు  01-04-2020 తేదీ నుండి తెలియజేయబడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, 48.13 కోట్ల వ్యక్తి యొక్క పనిదినాలు సృష్టించబడ్డాయి.  ఇంకా, వేతనాలు మరియు సామగ్రి రెండింటిలో పెండింగ్ లో ఉన్న బకాయిలను చెల్లించడానికి 28,729 కోట్ల రూపాయలను రాష్ట్రాలకు విడుదల చేశారు.

*     24% ఈ.పి.ఎఫ్. చందా  59.23 లక్షల ఉద్యోగుల ఖాతాలకు 895.09 కోట్ల రూపాయలు బదిలీ చేయడం జరిగింది. 

ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ 

2020-06-02 తేదీ వరకు మొత్తం ప్రత్యక్ష ప్రయోజన బదిలీ వివరాలు 

 

పధకం
పేరు 
   లబ్ధిదారుల
      సంఖ్య   
మొత్తం 
(రూపాయలు) 

పి.ఎమ్.జే.డి.వై. కి మద్దతుగా మహిళా 

ఖాతాదారులు 

1వ వాయిదా - 

  20.05 కోట్లు (98.3%)

2వ వాయిదా –

              20.63 కోట్లు. 

1వ వాయిదా - 

             10029 కోట్లు. 

2వ వాయిదా -

              10315 కోట్లు. 

ఎన్.ఎస్.ఏ.పి. కి మద్దతుగా

(వృద్దులైన వితంతువులు, దివ్యాంగులు, వయోవృద్దులు)

 

2.81 కోట్లు  (100%)

1వ వాయిదా -

                1407 కోట్లు

2వ వాయిదా – 

                1407 కోట్లు.

పి.ఎమ్.-కిసాన్ కింద

రైతులకు ఫ్రంట్ లోడెడ్

చెల్లింపులు 

 

       8.19 కోట్లు 

 

      16394 కోట్లు. 

భవన మరియు ఇతర

నిర్మాణ కార్మికులకు

మద్దతుగా 

 

         2.3 కోట్లు 

 

        4313 కోట్లు.

ఈ.పి.ఎఫ్.ఓ. కు 

24 శాతం చందా 

       0.59 కోట్లు 

       895 కోట్లు.     

ఉజ్వల 

1వ వాయిదా – 7.48 

2వ వాయిదా – 4.48

8488 కోట్లు 

మొత్తం 

42 కోట్లు 

53248 కోట్లు 

 

 *****


(Release ID: 1628940) Visitor Counter : 442