ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 పై తాజా సమాచారం

Posted On: 26 MAY 2020 5:26PM by PIB Hyderabad

దేశంలో కోవిడ్-19 నివారణనియంత్రణ మరియు నిర్వహణ కోసం భారత ప్రభుత్వం వివిధ రాష్ట్రాలు  / కేంద్రపాలిత ప్రాంతాలతో కలిసి అనేక చర్యలు చేపట్టింది.   వీటిని క్రమం తప్పకుండా ఉన్నత స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు

సంక్రమణ వ్యాప్తిని పరిమితం చేయడానికి పరిపాలన యొక్క దృష్టి నివారణ మరియు నియంత్రణ చర్యలపై కొనసాగుతోంది.  చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం,  శ్వాసకోశ పరిశుభ్రత మరియు తరచుగా తాకిన ఉపరితలాల యొక్క పరిశుభ్రత సంక్రమణను నివారించడానికి చాలా ముఖ్యమైనవి.  ఈ సంక్షోభం నుండి బయటపడటానికి  కోవిడ్  వ్యాప్తి నివారణకు నిర్ధారించిన విధి, విధానాలను ఖచ్చితంగా అనుసరించవలసిన  అవసరం ఉంది.  మాస్కులు, ఫేస్ కవర్లను క్రమం తప్పకుండా ఉపయోగించడం, వృద్ధులను మరియు ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారిని రక్షించే పని కూడా ఇందులో ఉంది.  భౌతిక దూరం పాటించడం ఒక్కటే ప్రస్తుతం నోవెల్  కరోనావైరస్ కు వ్యతిరేకంగా ప్రపంచం వ్యాప్తంగా ప్రజల దగ్గర ప్రస్తుతం ఉన్న సామాజిక వ్యాక్సిన్. 

రోజు రోజుకూ పెరుగుతున్న అవసరాలను తీర్చడానికి చేస్తున్న కృషిలో భాగంగా భారతదేశం దాని పరీక్ష సామర్థ్యాన్ని వేగంగా పెంచింది.   భారతదేశం ప్రస్తుతం రోజుకు సుమారు 1.1 లక్షల నమూనాలను పరీక్షిస్తోంది.  ప్రయోగశాలలు, షిఫ్టులు, ఆర్.టి.-పి.సి.ఆర్. యంత్రాలు మరియు సిబ్బందిని పెంచడం ద్వారా సామర్థ్యాన్ని పెంచడం జరిగింది.  ఈ రోజున,  భారతదేశంలో జనాభాకు కోవిడ్-19 సంక్రమణ పరీక్షలు నిర్వహించడానికి మొత్తం 612 ప్రయోగశాలలు ఉన్నాయి. వీటిలో  430 ప్రయోగశాలలను  ఐ.సి.ఎం.ఆర్. నడుపుతుండగా, ప్రైవేటు రంగంలో 182 ప్రయోగశాలలు నడుస్తున్నాయి.   రోగ లక్షణాలు ఉన్న వారికి తక్షణమే పరీక్ష చేయడానికీ, రోగ లక్షణాలు లేని కార్మికులకు స్వీయ నిర్బంధం సిఫార్సు చేయడానికీ  అనుసరించవలసిన మార్గదర్శకాలను రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాలకు జారీ చేయడం జరిగింది.   కోవిడ్-19 పరీక్ష కోసం ట్రూనాట్ యంత్రాలను అమర్చడానికి చాలా రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాలు జాతీయ క్షయ నివారణ కార్యక్రమం  (ఎన్.టి.ఇ.పి.) తో కలిసి పనిచేస్తున్నాయి.  ఆర్.టి.-పి.సి.ఆర్. పరికరాలు,  వి.టి.ఎం., స్వాబ్ లు & ఆర్.ఎన్.ఎ.  వెలికితీత పరికరాలను మన దేశంలోనే తయారుచేసే ఉత్పత్తి దారులను గుర్తించి, గత కొన్ని నెలలుగా వాటి ఉత్పత్తిని ప్రారంభించడం జరిగింది. 

దేశంలో రికవరీ రేటు మెరుగుపడుతూనే ఉంది,  ప్రస్తుతం ఇది 41.61 శాతంగా ఉంది.   కోవిడ్-19 నుండి ఇప్పటివరకు మొత్తం 60,490 మంది రోగులు కోలుకున్నారు.  దేశంలో కేసుల మరణాల రేటు కూడా బాగా తగ్గుతోంది.   ఏప్రిల్ 15వ తేదీన ఇది 3.30 శాతం ఉండగా, ప్రస్తుతం ఇది మొత్తం ప్రపంచంలోనే అత్యల్పంగా 2.87 శాతంగా ఉంది.   ప్రపంచంలో ప్రస్తుతం సగటు మరణాల రేటు 6.45 శాతంగా ఉంది. 

లక్ష జనాభాకు కేసుల మరణాల విశ్లేషణ  గమనిస్తే, భారతదేశంలో లక్ష జనాభాకు 0.3 మరణాలు ఉన్నాయని సూచిస్తోంది.   కాగా, ప్రపంచంలో  లక్ష జనాభాకు 4.4 మరణాలు సంభవిస్తున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ప్రపంచ గణాంకాలతో పోలిస్తే భారతదేశ పరిస్థితి అత్యల్పంగా ఉంది.  లక్ష జనాభాకు మరణాలు మరియు మొత్తం కేసుల్లో మరణాల రేటు పరంగా, గమనిస్తే, సకాలంలో కేసుల  గుర్తింపు మరియు కేసుల సమర్ధవంతమైన క్లినికల్ నిర్వహణ వల్ల సాపేక్షంగా మరణాలు తక్కువ సంఖ్యలో ఉన్నాయి. 

కోవిడ్-19 కు సంబంధించిన సాంకేతిక సమస్యలుమార్గదర్శకాలుసలహాలుసూచనలపై ప్రామాణికమైనతాజా సమాచారం కోసం  వెబ్ సైట్ ను క్రమం తప్పకుండా సందర్శించండి : 

https://www.mohfw.gov.in/        మరియు       @MoHFW_INDIA .

కోవిడ్-19 కు సంబంధించిన సాంకేతిక సమస్యలకు పరిష్కారాలను దిగువ పేర్కొన్న  మెయిల్ ను సంప్రదించడం  ద్వారా పొందవచ్చు : 
                    technicalquery.covid19[at]gov[dot]in 

ఇతర సందేహాలుఅనుమానాలకు పరిష్కారాలను దిగువ పేర్కొన్న  మెయిల్ ను సంప్రదించడం  ద్వారా పొందవచ్చు  :  

                    ncov2019[at]gov[dot]in     మరియు    @CovidIndiaSeva. 

కోవిడ్-19 పై ఎటువంటి అనుమానాలుసమస్యలుసమాచారానికైనాఆరోగ్యంకుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన ఉచిత  హెల్ప్ లైన్ నెంబర్ :    +91-11-23978046  లేదా  1075  (టోల్ ఫ్రీ)  ను సంప్రదించవచ్చు

వివిధ రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల కు చెందిన కోవిడ్-19 హెల్ప్ లైన్ నెంబర్ల జాబితా కోసం  వెబ్ సైట్ ని చూడండి : 
https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf .

****


(Release ID: 1627086) Visitor Counter : 318