హోం మంత్రిత్వ శాఖ

తుఫాను ప్ర‌భావిత ప్రాంతాల‌లో సేవ‌ల నిమిత్తం పశ్చిమ బెంగాల్‌కు మ‌రో 10 అద‌న‌పు ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు

Posted On: 23 MAY 2020 4:28PM by PIB Hyderabad

ఇటీవ‌ల‌ ఆంఫన్ తుఫాను ప‌శ్చిమ బెంగాల్ రాష్ర్ట్రాన్ని అత‌లాకుత‌లం చేసిన నేప‌థ్యంలో త‌మ‌కు అద‌నంగా ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలను పంపించాల‌ని ఆ రాష్ట్రం కేంద్రాన్ని కోరింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వపు విప‌త్తుల నిర్వ‌హ‌ణ మ‌రియు పౌర ర‌క్ష‌ణ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి ఈ మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వానికి ఒక వ్రాతపూర్వక అభ్యర్థనను పంపారు. ఈ అభ్యర్థన స్వీకరించిన కేంద్ర ప్ర‌భుత్వం
పది అదనపు ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలను సమీకరించి ఆ రాష్ట్రానికి త‌ర‌లించే ప‌నుల‌ను మొద‌లు పెట్టింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం వెలుపల వివిధ ప్ర‌దేశాల‌లో ఉన్న ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాల‌ను స‌మీక‌రించి వేగంగా అక్క‌డ‌కు తరలిస్తున్నారు. అద‌న‌పు ఎన్‌డీఆర్ఎఫ్‌ బృందాలు ఈ రోజు రాత్రికి కోల్‌క‌తా చేరుకునే అవాకాశం ఉంది. ఆంఫ‌న్ తుఫాను అనంత‌ర పునరుద్ధరణ పనుల కోసం పశ్చిమ బెంగాల్‌లోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రస్తుతం మొత్తం 26 ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు  మొహ‌రించ‌బ‌డ్డాయి. తాజాగా మ‌రో 10 ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు వీరితో జ‌త కూడనున్నాయి.
దీంతో ఈ రాష్ట్రంలో తుఫాను పున‌రుద్ధ‌ర‌ణ ప‌ను‌ల‌లో మొత్తం 36 ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు నిమ‌గ్నం కానున్నాయి. ఆంఫ‌న్ తుఫానుకు ప‌‌శ్చిమ బెంగాల్‌లో ప్ర‌భావితమైన ఆరు జిల్లాల‌లో ఈ ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు సేవ‌లందింస్తున్నాయి.



(Release ID: 1626441) Visitor Counter : 178