ప్రధాన మంత్రి కార్యాలయం

ఒడిషాలో ఏరియ‌ల్ స‌ర్వే త‌ర్వా ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ వ్యాఖ్య‌లు

Posted On: 22 MAY 2020 7:52PM by PIB Hyderabad

ఒక వైపు ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి వైర‌స్ పై పోరాటం జ‌రుగుతోంది. ఇలాంటి సంక్షోభ ప‌రిస్థితుల్లో కేంద్ర ప్ర‌భుత్వం, రాష్ట్రాల ప్ర‌భుత్వాలు ఇంకా అన్ని ప్ర‌భుత్వ విభాగాలు, దేశ ప్ర‌జ‌లంద‌రూ క‌లిసి గ‌త రెండు రెండున్న‌ర నెల‌లుగా అలుపెర‌గ‌ని యుద్ధం చేస్తున్నారు. 
ఇలాంటి స‌మ‌యంలో మ‌రో ప్ర‌ధాన సంక్షోభం పెను తుపాను రూపంలో ముంచుకొచ్చింది. ఇది అంద‌రినీ తీవ్ర ఆందోళ‌న‌కు గురి చేసింది. తుపాను ఒడిషానుంచి బెంగాల్ వైపు వెళ్లిన స‌మ‌యంలో ఒడిషా రాష్ట్రం ఎంత‌మేర‌కు ప్ర‌భావిత‌మైంద‌నే విష‌యం ఆందోళ‌న క‌లిగిస్తోంది. వ్య‌వ‌స్థీకృతంగా వున్న స‌దుపాయాల కార‌ణంగాను, తుపాను ప‌రిస్థితుల్లో ఏం చేయాల‌నేదానిపై గ్రామీణ ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న వుండ‌డంవ‌ల్ల ఒడిషాలో ప్రాణ న‌ష్టం చాలా త‌క్కువ‌గా వుంది. ఈ విష‌యంలో త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకున్నందుకు ఒడిషా ముఖ్య‌మంత్రికి, ప్ర‌భుత్వ అధికారుల‌కు నా హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాను. 
ఇలాంటి పెను తుపాను వ‌చ్చిన‌ప్పుడు ఆస్తి న‌ష్టం అపారంగా వుంటుంది. అయితే ప‌శ్చిమ బెంగాల్ తో పోల్చుకున్న‌ప్పుడు ఒడిషాలో ఆస్తి న‌ష్టం త‌క్కువ‌గానే వుంది. కానీ తుపాను ఒడిషాను దాటి వెళ్లిపోతున్న స‌మ‌యంలో త‌న ప్ర‌తాపాన్ని తీవ్రంగానే చూపింది. ఇది రాష్ట్రానికి సంక్షోభాన్ని మిగిల్చింది. ఇళ్ల‌కు, వ్య‌వ‌సాయానికి, విద్యుత్ రంగానికి, క‌మ్యూనికేష‌న్ వ్య‌వ‌స్థ‌ల‌కు, మౌలిక స‌దుపాయాల‌కు జ‌రిగిన న‌ష్టం గురించి పూర్తి స్థాయిలో స‌మీక్ష చేయ‌డం జ‌రిగింది. అలాగే రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా త‌న ద‌గ్గ‌ర వున్న ప్రాధ‌మిక స‌మాచారాన్నంతా నాకు ఇచ్చింది. 
త్వ‌ర‌లోనే రాష్ట్ర ప్ర‌భుత్వం కేంద్ర ప్ర‌భుత్వానికి తుది నివేదిక పంపుతుంది. కేంద్ర ప్ర‌భుత్వ టీమ్ త్వ‌ర‌లోనే రాష్ట్రంలో పర్య‌ట‌న చేస్తుంది. మొత్తం ప‌రిస్థితిని స‌మీక్షిస్తుంది. ఆ త‌ర్వాత పునరావాస‌, దీర్ఘ‌కాలిక స‌హాయ చ‌ర్య‌ల‌ను చేప‌ట్ట‌డం జ‌రుగుతుంది. ఇలాంటి అన్ని విష‌యాల‌కు ప్రాధాన్య‌త ఇస్తూ ప‌నుల‌ను కొన‌సాగించ‌డం జ‌రుగుతుంది. 
 త‌క్ష‌ణ అవ‌స‌రాల‌కోసం రాష్ట్రానికి కేంద్ర ప్ర‌భుత్వం ఐదు వంద‌ల కోట్ల రూపాయాల ముంద‌స్తు సహాయం అందించ‌డం జ‌రుగుతోంది. రాష్ట్రానికి కావ‌ల‌సిన అవ‌స‌రాల మేర‌కు, స‌హాయ‌క చ‌ర్య‌లకు సంబంధించి సంపూర్ణ‌మైన ప్ర‌ణాళిక‌లు త‌యారు చేసుకున్న త‌ర్వాత రాష్ట్రంతో క‌లిసి కేంద్రం అన్ని విధాలా స‌హాయం చేస్తుంది. తుపాను సంక్షోభాన్నించి రాష్ట్రాన్ని బైట‌ప‌డేయ‌డానికి అన్ని విధాలా స‌హ‌క‌రిస్తుంది. 
 థ్యాంక్స్ ఎలాట్‌!

 



(Release ID: 1626307) Visitor Counter : 173