ప్రధాన మంత్రి కార్యాలయం

‘అమ్ఫాన్’ తుఫాను ను ఎదుర్కోవడం కోసం ఉద్దేశించిన సన్నాహాల పై సమీక్ష ను నిర్వహించిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 18 MAY 2020 5:39PM by PIB Hyderabad

స్థితి ని సంబాళించడం కోసం 25 ఎన్ డిఆర్ఎఫ్ బృందాల ను రంగం లోకి దించడమైంది

 


బంగాళాఖాతం లో రూపుదాల్చుతున్న ‘అమ్ఫాన్’ తుఫాను ను ఎదుర్కోవడం కోసం ఉద్దేశించిన ప్రతి క్రియ లను సమీక్షించడం కోసం ఈ రోజు న నిర్వహించిన ఒక ఉన్నత స్థాయి సమావేశాని కి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.

 

 

పరిస్థితి ని ప్రధాన మంత్రి సాకల్యం గా గమనించడం తో పాటు అందుకు ప్రతి క్రియ గా సాగుతున్న సన్నద్ధత ను, అలాగే ప్రజల ను సురక్షిత ప్రాంతాల కు తరలించేందుకు సంబంధించి నేశనల్ డిజాస్టర్ రిస్ పాన్స్ ఫోర్స్ (ఎన్ డిఆర్ఎఫ్) సమర్పించిన ప్రణాళిక ను కూడా సమీక్షించారు.    25 ఎన్ డిఆర్ఎఫ్ బృందాల ను రంగం లోకి దించడమైందని, మరో 12 బృందాల ను సైతం ఇదే తరహా విధుల నిర్వహణ కై ప్రత్యేకించడం జరిగిందని ఎన్ డిఆర్ఎఫ్ డిజి ప్రతి క్రియ ల ప్రణాళిక ను సమర్పించే క్రమం లో సమావేశం దృష్టి కి తీసుకు వచ్చారు.  ఎన్ డిఆర్ఎఫ్ కు చెందిన 24 బృందాలు దేశం లోని వివిధ ప్రాంతాల లో సహకారాన్ని అందించడం కోసం తయారు గా ఉన్నాయి.

ఈ సమావేశాని కి కేంద్ర దేశీయ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ అమిత్ శాహ్, ప్రధాన మంత్రి కి ప్రిన్సిపల్ అడ్వయిజర్ శ్రీ పి.కె. సిన్హా, కేబినెట్ సెక్రటరి శ్రీ రాజీవ్ గౌబా లతో పాటు భారత ప్రభుత్వం లోని ఇతర ఉన్నతాధికారులు కూడా హాజరు అయ్యారు.


**



(Release ID: 1625029) Visitor Counter : 194