ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 పై తాజా సమాచారం

Posted On: 18 MAY 2020 5:53PM by PIB Hyderabad

ప్రస్తుత పరిస్థితి :

దేశంలో కోవిడ్-19 నివారణనియంత్రణ మరియు నిర్వహణ కోసం భారత ప్రభుత్వం వివిధ రాష్ట్రాలు  / కేంద్రపాలిత ప్రాంతాలతో కలిసి క్రియాశీల విధానం ద్వారా అనేక చర్యలు చేపడుతోంది.   వీటిని క్రమం తప్పకుండా ఉన్నత స్థాయిలో పర్యవేక్షిస్తోంది.   

భారతదేశంలో ప్రస్తుతం 56,316 కేసులు యాక్టీవ్ గా ఉన్నాయి ఇంతవరకు మొత్తం 36,824 కోవిడ్-19 నుండి కోలుకున్నారు.  గత 24 గంటల్లో మొత్తం 2,715 మంది రోగులు కోలుకున్నట్లు నమోదయ్యంది.  ప్రస్తుతం కోలుకుంటున్నవారి రేటు 38.29 శాతంగా ఉంది

ప్రతి లక్ష మంది జనాభాలో వైరస్ సోకినట్లు ధ్రువపడినవారి సంఖ్య పరంగా చూస్తే, భారతదేశంలో ప్రతి లక్ష మంది జనాభాకు 7.1 కేసులు వచ్చినట్లు నమోదయ్యింది.  మొత్తం ప్రపంచంలో ప్రతి లక్ష జనాభాకు 60 కేసులు ధృవపడినట్లు నమోదయ్యింది.  ప్రపంచంలో ప్రతి లక్ష మంది జనాభాకు ఎక్కువ మంది రోగులు నమోదయిన దేశాల పరిస్థితిని గమనిస్తే డబ్ల్యూ.హెచ్.ఓ. నివేదిక ప్రకారం 118 దేశాల్లో ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి : 

 

 

 

దేశాలు 

 

ధృవీకరించబడిన మొత్తం కేసులు 

 

లక్ష జనాభాలో

సుమారు కేసులు 

ప్రపంచంలోని

అన్ని దేశాలు కలిసి 

45,25,497

60

అమెరికా 

1,409,452

431

రష్యా 

281,752

195

యు.కే.

240,165

361

స్పెయిన్ 

230,698

494

ఇటలీ 

224,760

372

బ్రెజిల్ 

218,223

104

జర్మనీ 

174,355

210

టర్కీ 

148,067

180

ఫ్రాన్స్ 

140,008

209

ఇరాన్ 

118,392

145

భారతదేశం 

96,169*

7.1

                                  * తాజాగా 2020 మే 18వ తేదీ వరకు సేకరించిన వివరాల ప్రకారం. 
 
వేగంగా తీసుకున్న ముందస్తు చర్యల వలన ఇప్పటి వరకు ప్రోత్సాహకరమైన ఫలితాలు వచ్చాయి
ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీ చేసిన నూతన మార్గదర్శకాలు :
 
రెడ్ / ఆరంజ్ / గ్రీన్ జోన్ల వర్గీకరణకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ 2020 మే నెల 17వ తేదీన రాష్ట్రాలకు నూతన మార్గదర్శకాలను జారీ చేసింది.  ఈ మార్గదర్శకాల ప్రకారం జిల్లా / మునిసిపల్ కార్పొరేషన్లను లేదా  వారి క్షేత్ర స్థాయి అంచనా ప్రకారం అవసరమైతే సబ్ డివిజన్ / వార్డ్ లేదా మరే ఇతర పరిపాలనాపరమైన యూనిట్‌ను ఎరుపు / నారింజ / గ్రీన్ జోన్‌గా  వర్గీకరించమని రాష్ట్రాలను కోరింది. 
 
ఎమ్.ఓ.హెచ్.ఎఫ్.డబ్ల్యూ. నిర్ణయించిన ప్రకారం, మొత్తం క్రియాశీల కేసులు, లక్ష జనాభాకు క్రియాశీల కేసులు, రెట్టింపు రేటు (7 రోజుల వ్యవధిలో లెక్కించబడతాయి), మరణాల రేటు, పరీక్ష నిష్పత్తి మరియు పరీక్ష నిర్ధారణ రేటు వంటి  వివిధ అంశాలపై నిర్వహించిన విశ్లేషణ ఆధారంగా ఇది జరగాలి. 
 
క్షేత్రస్థాయి చర్యల పరంగా, కంటైన్మెంట్ మరియు  బఫర్ జోన్ ‌లను సూక్ష్మంగా వివరించాలని  రాష్ట్రాలను కోరడం జరిగింది.   ఈ కంటైన్మెంట్  జోన్లలో కంటైన్మెంట్  ప్రణాళికలను కఠినంగా అమలు చేయాలని రాష్ట్రాలకు సూచించారు
 
కంటెమెంట్ జోన్లలో, ప్రత్యేక బృందాల ద్వారా ప్రతి ఇంటిని నిఘా పరిధిలోకి తీసుకురావాలి, చురుకుగా శోధించడం, నమూనా మార్గదర్శకాల ప్రకారం అన్ని కేసులను పరీక్షించడం, కాంటాక్ట్ ట్రేసింగ్, క్లినికల్ మేనేజ్మెంట్నిర్వహించి, అన్ని ధృవీకరించబడిన కేసుల ప్రాధాన్యత పనుల వంటి అన్ని అంశాలను నిఘా పరిధిలోకి  తీసుకోవాలి.  ఈ విషయంలో సంఘం, సమాజం  చురుకుగా పాల్గొనాలి.
 
దీనితో పాటు, ప్రతి కంటైన్మెంట్ జోన్ చుట్టూ, బఫర్ జోన్ ను స్పష్టంగా నిర్ణయించాలి.  తద్వారా చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాధి  వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.  బఫర్ జోన్లలోఆరోగ్య సదుపాయాలలో ఐ.ఎల్.ఐ. / ఎస్.ఐ.ఆర్.ఐ. కేసులను పర్యవేక్షించడం ద్వారా కేసుల కోసం విస్తృతమైన నిఘాను  సమన్వయ పరచాలి
 
వ్యక్తిగత పరిశుభ్రత, చేతి పరిశుభ్రత పాటించడం, శ్వాసకోశ సంబంధ సమస్యల గురించి ఎప్పటికప్పుడు తెలియజేయడం, మెరుగైన ఐ.ఈ.సి.  కార్యకలాపాల ద్వారా ఫేస్ కవర్ వినియోగాన్ని ప్రోత్సహించడం,  సామాజిక దూరం పాటించడం వంటి నివారణ చర్యలపై సమర్థవంతమైన సమాజ అవగాహనను నిర్ధారించడం చాలా ముఖ్యం

*****


(Release ID: 1624984) Visitor Counter : 254