ఆర్థిక మంత్రిత్వ శాఖ

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామన్ వ్యవసాయ, మత్స్య, ఆహార ప్రాసెసింగ్ రంగాలకు వ్యవసాయ మౌలిక సదుపాయాల లాజిస్టిక్స్, సామర్థ్యం పెంపొందించడం, పాలన , పరిపాలనా సంస్కరణలను బలోపేతం చేసే చర్యలను ఆర్థిక మంత్రి ప్రకటించారు.

-- రైతుల‌కు ఫామ్‌-గేట్ మౌలిక స‌దుపాయాల కోసం రూ 1 ల‌క్ష కోట్ల తో వ్య‌వ‌సాయ మౌలిక‌స‌దుపాయాల ఫండ్‌
--మైక్రో ఫుడ్ ఎంట‌ర్‌ప్రైజెస్‌(ఎం.ఎఫ్‌.ఇ)ల ఫార్మ‌లైజేష‌న్‌కు రూ 10 ,000 కోట్ల రూపాయ‌లు
---ప్ర‌ధాన‌మంత్రి మ‌త్స్య సంప‌ద యోజ‌న (పిఎంఎంఎస్‌వై) ద్వారా మ‌త్స్య‌కారుల‌కు రూ 20,000 కోట్లు
--జాతీయ ప‌శు వ్యాధుల నియంత్ర‌ణ కార్యక్ర‌మం
---ప‌శుగ‌ణ మౌలిక స‌దుపాయాల అభివృద్ధి నిధి ఏర్పాటు-15,000 కోట్లు
--మూలిక‌ల సాగును ప్రోత్స‌హించేందుకు : రూ 4,000 కోట్ల కేటాయింపు
---తేనేటీగ‌ల సాగు కార్య‌క‌లాపాల‌కు - రూ 500 కోట్లు
--- టాప్ నుంచి టోట‌ల్ కు- 500 కోట్లు
--- వ్య‌వ‌సాయ రంగం కోసం పాల‌నాప‌ర‌మైన‌చ‌ర్య‌లు, ప‌రిపాల‌నా సంస్క‌ర‌ణ‌లు
---రైతుల‌కు మంచి ధ‌ర ల‌భించేందుకు వీలుగా నిత్యావ‌స‌ర స‌ర‌కుల చ‌ట్టానికి స‌వ‌ర‌ణ‌లు
-- రైతుల‌కు మార్కెటెంగ్ ఎంపిక‌కు వీలుగా వ్య‌వ‌సాయ మార్కెటింగ్ లో సంస్క‌ర‌ణ‌లు.
---వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల ధ‌ర , నాణ్య‌త‌కు హామీ

Posted On: 15 MAY 2020 7:42PM by PIB Hyderabad

గౌర‌వ‌నీయ ప్ర‌ధాన‌మంత్రి 2020 మే 12న 20 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల విలువ గ‌ల అంటే భార‌త దేశ జిడిపిలో ప‌దిశాతంతో స‌మాన‌మైన ప్ర‌త్యేక , ఆర్థిక స‌మ‌గ్ర ప్యాకేజ్‌ని ప్ర‌క‌టించారు. స్వావ‌లంబిత భార‌త్ ఉద్య‌మానికి అంటే ఆత్మ‌నిర్భ‌ర భార‌త్ అభియాన్‌కు ప్ర‌ధాన‌మంత్రి శంఖం పూరించారు. ఇందుకు ప్ర‌ధాన‌మంత్రి ఐదు ప్ర‌ధాన స్తంభాల గురించి ప్ర‌ముఖంగా ప్ర‌స్తావించారు. అవి, ఆర్థికం, మౌలిక‌స‌దుపాయాలు, వ్య‌వ‌స్థ‌, ఉత్సాహ‌పూరితులైన జ‌నం, డిమాండ్‌
 కేంద్ర ఆర్థిక‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఈరోజు నిర్వ‌హించిన విలేఖ‌రుల స‌మావేశంలో వ్య‌వ‌సాయ రంగానికి సంబంధించి ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ లాజిస్టిక్స్‌, సామ‌ర్ధ్యాల నిర్మాణం, పాల‌న‌,ప‌రిపాల‌నా సంస్క‌ర‌ణ‌లను బ‌లోపేతం చేసేందుకు 3 వ విడ‌త చ‌ర్య‌ల‌ను ప్ర‌క‌టించారు.
ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను వెల్ల‌డిస్తూ శ్రీ మతి సీతారామ‌న్, ప్ర‌స్తుతం ప్ర‌క‌టించిన 11 చ‌ర్య‌ల‌లో 8 చ‌ర్య‌లు వ్య‌వ‌సాయ మౌలిక‌స‌దుపాయాల‌ను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన‌వ‌ని, మిగిలిన 3 చ‌ర్య‌లు పాల‌నా ప‌ర‌మైన‌, ప‌రిపాల‌న‌  సంస్క‌ర‌ణ‌ల‌కు సంబంధించిన‌వని అన్నారు. ఇందులో వ్య‌వ‌సాయు ఉత్ప‌త్తుల అమ్మ‌కాలు,స్టాక్ ప‌రిమితుల‌పై ఆంక్ష‌ల తొల‌గింపు కూడా ఉన్నాయ‌న్నారు.
ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను తెలియ‌జేస్తూ ఆర్థిక‌మంత్రి, నిన్న ప్ర‌క‌టించిన చ‌ర్య‌ల‌లో రైతుకు మ‌ద్ద‌తునిచ్చేందుకు రెండు వ్య‌వ‌సాయ సంబంధ ప్ర‌ముఖ నిర్ణ‌యాలు ఉన్నాయ‌న్నారు. ఇందులో ఒక‌టి  30,000 కోట్ల రూపాయ‌ల‌తో నాబార్డు ద్వారా అద‌న‌పు అత్య‌వ‌స‌ర వ‌ర్కింగ్ కేపిట‌ల్ స‌దుపాయం. ఇది ఆర్‌.ఆర్‌.బిలు, కో ఆప‌రేటివ్‌బ్యాంకులు ర‌బీ పంట కోత అనంత‌ర ఖ‌ర్చులు, ఖ‌రీఫ్ ఖ‌ర్చుల‌కు రుణాలు ఇవ్వ‌డానికి వీలు క‌ల్పిస్తుంది. ఇక రెండ‌వ‌ది 2.5 కోట్ల‌మంది పి.ఎం -కిసాన్ ల‌బ్ధిదారుల‌కు కిసాన్ క్రెడిట్ కార్డ్ ప‌థ‌కం కింద 2020 డిసెంబ‌ర్ నాటాకి  మిష‌న్ మోడ్ లో రూ 2 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల మేర‌కు  రుణం అందుబాటులోకి తెచ్చేందుకు చ‌ర్య‌లు.
గ‌త రెండు నెల‌లుగా ప్ర‌భుత్వం ఏం చేసిందో తెలియ‌జేస్తూ ఆర్థిక మంత్రి, లాక్ డౌన్ స‌మ‌యంలో సుమారు రూ74,300 కోట్ల రూపాయ‌ల మేర‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర కొనుగోళ్ళు చేయ‌డం జ‌రిగిందన్నారు. పిఎం కిసాన్ ఫండ్ బ‌దిలీ రూ 18,700 కోట్లు, పిఎం ఫ‌స‌ల్ బీమా యోజ‌న క్లెయిమ్  కింద రూ 6,400 కోట్లు  చెల్లించ‌డం జ‌రిగింద‌న్నారు.
దీనికితోడు లాక్‌డౌన్ స‌మ‌యంలో , పాల డిమాండ్ 20 నుంచి 25 శాతం త‌గ్గింది.దీనితో య రోజుకు 560 ల‌క్ష‌ల లీట‌ర్ల పాలను కోఆప‌రేటివ్ సంస్థ‌లు సేక‌రించాయి.  రోజువారి అమ్మే పాలు 360 ల‌క్ష‌లు లీట‌ర్లు. మొత్తం 111 కోట్ల లీట‌ర్ల పాలు అదనంగా సేక‌రించ‌డంతో వీటికి రూ 4,100 కోట్ల రూపాయ‌లు చెల్లించ‌డం జ‌రిగింది.
దీనికితోడు, 2020-21 సంవత్సరానికి పాడి సహకార సంస్థలకు సంవత్సరానికి 2శాతం వడ్డీ ఉపసంహరణను అందించే కొత్త పథకం ప్రారంభించడం జ‌రిగింది. స‌కాలంలో చెల్లింపు , వడ్డీ సర్వీసింగ్‌పై రెండు శాతం అద‌న‌పు  వడ్డీ స‌బ్‌వెన్ష‌న్‌ కూడా అందిస్తుంది. ఈ పథకం రూ .5 వేల కోట్ల అదనపు లిక్విడిటీ కి అవ‌కాశం క‌ల్పిస్తుంది , దీనివల్ల 2 కోట్ల మంది రైతులకు ప్రయోజనం క‌లుగుతుంది.
ఇక మ‌త్స్య‌రంగానికి వ‌స్తే, మార్ఇ 24 వ‌తేదీన మ‌త్స్య రంగానికి సంబంధించి ప్ర‌క‌టించిన 4 కోవిడ్ సంబంధిత ప్ర‌క‌ట‌న‌లు అమ‌లు  చేయ‌డం జ‌రిగింది. దీనికితోడు, 31.03.2020 తో గ‌డువు తీరే 242 రిజిస్ట‌ర్డ్ రొయ్య‌ల హేచ‌రీల రిజిస్ట్రేష‌న్‌,  నౌప్లి రీరింగ్ హేచ‌రీల గ‌డువును మ‌రో 3 నెల‌లు పొడిగించ‌డం జ‌రిగింది.  ఇన్లాండ్ ఫిష‌రీస్‌ను క‌వ‌ర్ చేసేందుకు, మెరైన్ కాప్చ‌ర్ ఫిష‌రీలు, ఆక్వాక‌ల్చ‌ర్ ల‌కార్య‌క‌లాపాల‌ను మిన‌హాయించారు.
 కేంద్ర ఆర్థిక‌మంత్రి నిర్మ‌లా సీతారామన్ మాట్లాడుతూ,ఈరోజు ప్ర‌క‌టించిన నిర్ణ‌యాలు రైతులు , మ‌త్స్య‌కారులు, ఫుడ్ ప్రాసెసింగ్ మైక్రో ఎంట‌ర్‌ప్రైజెస్ రంగాల‌కు చెందిన వారిపై దీర్ఘ‌కాలిక‌, సుస్థిర ప్ర‌భావాన్ని చూప‌నున్నాయ‌ని  తెలిపారు.
వ్యవసాయం, మత్స్య, ఆహార ప్రాసెసింగ్ రంగాల మౌలిక సదుపాయాల లాజిస్టిక్స్ , సామర్థ్యం పెంపొందించడానికి ఆర్థిక మంత్రి ఈ క్రింది చర్యలను ప్రకటించారు: -

 

రైతులకు ఫార్మ్ గేట్ మౌలిక సదుపాయాల కోసం 1 లక్ష కోట్ల రూపాయల వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి

· ఫార్మ్ గేట్ కు సంబంధించి తగినంత కోల్డ్ చైన్ మరియు పోస్ట్ హార్వెస్ట్ నిర్వహణ మౌలిక సదుపాయాలు లేకపోవడం విలువల గొలుసులో అంతరాలకు కారణం అవుతోంది.

· స్వల్పకాలిక పంట రుణాలపై దృష్టి కేంద్రీకరిస్తున్న నేపథ్యంలో, దీర్ఘకాలిక వ్యవసాయ మౌలిక సదుపాయాల కోసం పెట్టుబడులు తరచుగా సరిపోవడం లేదు.

· 1000 కోట్ల రూపాయల ఫైనాన్సింగ్ సౌకర్యం ఫార్మ్ గేట్ మరియు అగ్రిగేషన్ పాయింట్ల వద్ద వ్యవసాయ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడానికి లక్ష కోట్లు ఇవ్వడం జరుగుతుంది. ( ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, రైతు ఉత్పత్తి సంస్థలు, వ్యవసాయ వ్యవస్థాపకులు, స్టార్టప్ లు మొదలైనవి)

· ఫార్మ్ గేట్ మరియు అగ్రిగేషన్ పాయింట్, సరసమైన మరియు ఆర్థికంగా లాభదాయకమైన పోస్ట్ హార్వెస్ట్ నిర్వహణ మౌలిక సదుపాయల అభివృద్ధికి ప్రేరణగా నిలుస్తుంది.

· ఈ ఫండ్ వెంటనే సృష్టించబడుతుంది.

 

సూక్ష్మ ఆహార సంస్థలకు (ఎం.ఎఫ్..) క్రమబద్దీకరణకు 10000 కోట్ల రూపాయల పథకం.

* ప్రధానమంత్రి "స్థానిక ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు" ఆలోచనకు ఈ పథకం ప్రోత్సహిస్తుంది.

* ఎఫ్.ఎస్.ఎస్... ప్రమాణాలు, బ్రాండ్స్ నిర్మాణం, మార్కెటింగ్ పొందడానికి అసంఘటిత ఎం.ఎఫ్.. యూనిట్లు  సాంకేతికతను పెంపొందిచుకోవలసిన అవసరం ఉంది.

* పైన పేర్కొన్న లక్ష్యాలు సాధించడానికి గాను 2 లక్షల ఎం.ఎఫ్.. లకు సహకరించడానికి ఒక పథకం ప్రారంభిస్తారు

* ప్రస్తుతం ఉన్న సూక్ష్మ ఆహార సంస్థలు, రైతు ఉత్పత్తుల సంస్థలు, స్వయం సహాయ బృందాలు, సహకార సంస్థలకు మద్దతు ఇస్తారు

* క్లస్టర్ ఆధారిత విధానం (ఉదాహరణకు ఉత్తర ప్రదేశ్ లో మామిడి, జమ్మూ కశ్మీర్ లో కేసర్, ఈశాన్య ప్రాంతం లో వెదురు రెమ్మలు, ఆంధ్ర ప్రదేశ్ లో మిర్చి, తమిళనాడు లో కర్రపెండలం మొదలైనవి)

* అంచనా ఉపయోగాలు: ఆరోగ్యం, భద్రతా ప్రమాణాలు మెరుగవుతాయి, చిల్లర మార్కెట్లు తో అనుసంధానం, ఆదాయం పెంపొందుతుంది.

* ఆరోగ్యం పై అవగాహన పెరగడంతో కొత్త ఎగుమతుల మార్కెట్లు చేరుకోడానికి కూడా ఇది సహాయపడుతుతుంది.

ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్ వై) ద్వారా మత్స్యకారులకు రూ.20,000 కోట్లు

  • మత్స్య రంగం విలువ ఆధారిత చర్యలలో కీలకమైన లోపాల గుర్తింపు
  • సముద్రంలో చేపలు పట్టడం, అంతర్గతంగా మత్స్య సంపదను ఉత్పత్తి చేయడంలో సమగ్ర, సుస్థిరమైన, సమ్మిళిత అభివృద్ధికి పీఎంఎంఎస్ వై పథకం త్వరలో ప్రారంభం
  • మత్స్య రంగం అభివృద్ధి కార్యకలాపాలకు రూ.11,000 కోట్లు
  • ఫిషింగ్ హార్బర్లు, శీతల గిడ్డంగులు, మార్కెట్లు వంటి మౌలిక సదుపాయాలకు రూ. 9,000 కోట్లు
  • మత్స్య ఉత్పత్తుల పెంపకంలో ఆధునిక పద్ధతులు, అలంకార చేపలు, ప్రయోగశాలల నెట్ వర్క్ వంటి కార్యకలాపాలకు పెద్దపీట
  • చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు, పడవలకు బీమా సౌకర్యం, ఆర్ధిక తోడ్పాటు
  • 5 ఏళ్లలో అదనంగా 70 లక్షల టన్నుల చేపల ఉత్పత్తికి ఈ చర్యల వల్ల అవకాశం
  • 55 లక్షల మందికి ఉపాధి; రెట్టింపు ఎగుమతులు సుమారు రూ.1 లక్ష కోట్లు
  • దీవులు, హిమాలయ ప్రాంత రాష్ట్రాలు, ఈశాన్య ప్రాంతాలు, ఆపేక్షిత జిల్లాలపై ప్రత్యేక దృష్టి

 

జాతీయ పశు వ్యాధుల నియంత్రణ కార్యక్రమం

· నేషనల్ యానిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ ఫర్ ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ (ఎఫ్.ఎం.డి) మరియు బ్రూసెల్లోని మొత్తం 13,343 కోట్లతో ప్రారంభించడం జరుగుతుంది.

· ఇది 100 సాతం పశువులు, గేదెలు, మేకలు, గొర్రెలు మరియు పందుల (మొత్తం 53 కోట్ల పశువులు) పాదం మరియు నోటి వ్యాధులు (ఎఫ్.ఎం.డి) మరియు బ్రూసెల్లోసిస్ కొరకు వ్యాక్సినేషన్ ను నిర్ధారిస్తుంది.

· ఈ రోజు వరకూ 1.5 కోట్ల ఆవులు మరియు గేదెలను ట్యాగ్ చేసి, టీకాలు వేయడం జరిగింది.

పశుసంవర్ధక రంగం మౌలిక సదుపాయాల అభివృద్ధి

నిధి - 15000 కోట్ల రూపాయలు

* దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ స్థాయిలో పాల ఉత్పత్తికి ఎక్కువ సామర్థ్యం ఉండడంతో ప్రైవేటు పెట్టుబడులకు ఎక్కువ అవకాశం

 

* డైరీ ప్రాసెసింగ్ లో ప్రైవేటు పెట్టుబడులకు మద్దతు లక్ష్యంగా అదనపు విలువ జోడింపు మరియు పశువుల మేతకు మౌలిక సదుపాయాల కల్పన

 

* 15000 కోట్ల రూపాయల తో పశుసంవర్ధక రంగం మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి ఏర్పాటు

 

* ఉత్పత్తుల ఎగుమతులకు వీలుగా ప్లాంట్లు నెలకొల్పుకోడానికి ప్రోత్సాహకాలు.

ఔషధ మొక్కలు మూలిక సాగుకు ప్రోత్సాహం: రూ.4000 కోట్లు

  • జాతీయ ఔషధ మొక్కల బోర్డు (ఎన్ఎంపిబి) 2.25 లక్షల హెక్టార్లలో ఔషధ మొక్కల పెంపకానికి తోడ్పాటు
  • రూ.4,000 కోట్లతో రాబోయే 2 ఏళ్లలో 10 లక్షల హెక్టార్లలో ఔషధ మొక్కల సాగు
  • రైతులకు రూ.5,000 కోట్ల ఆదాయం పెరిగే అవకాశం
  • ఔషధ మొక్కలకు ప్రాంతీయ మండీల తో అనుసంధానం
  • ఎన్ఎంపిబి కింద గంగా నది తీర ప్రాంతాలలో ఔషధ మొక్కల పెంపకం ద్వారా 800 హెక్టార్ల అభివృద్ధి
  • తేనెటీగల పెంపకం కార్యక్రమాలు 500 కోట్ల రూపాయలు
  • · తేనెటీగల పెంపకం గ్రామీణ ప్రాంతాలకు జీవనోపాధి సహాయక చర్య
  • · పరాగ సంపర్కం ద్వారా పంటల దిగుబడి మరియు నాణ్యతను పెంచుతుంది.
  • · తేనె, మైనం వంటి ఇతర తేనెటీగ ఉత్పత్తులను అందిస్తుంది.
  • ప్రభుత్వం దీని కోసం ఒక పథకాన్ని అమలు చేస్తుంది :
  • · సమగ్ర తేనెటీగల పెంపకం అభివృద్ధి కేంద్రాలకు సంబధించి మౌలిక సదుపాటాల అభివృద్ధి, సేకరణ, మార్కెటింగ్ మరియు నిల్వ కేంద్రాలు, పోస్ట్ హార్వెస్ట్ మరియు విలువ జతచేసే సౌకర్యాలు మొదలైనవి.
  • · ప్రమాణాల అమలు మరియు గుర్తించదగిన వ్యవస్థను అభివృద్ధి చేయడం
  • · మహిళల సహకారంతో సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం
  • · నాణ్యమైన సరకు మరియు తేనెటీగ పెంపకం దారుల అభివృద్ధి
  • 2 లక్షల మంది తేనెటీగల పెంపకం దారుల ఆధాయాన్ని పెంచే దిశగా ఇది సహాయపడుతుంది. అంతే గాకుండా వినియోగ దారులకు నాణ్యమైన తేనె లభిస్తుంది.

 

"టి..పి."(టమాట, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు) నుండి

అన్ని పండ్లు, కూరగాయలు (టోటల్ ) వరకు - 500 కోట్ల రూపాయలు

* సరఫరా చైన్లు దెబ్బతిన్నాయి, రైతులు తమ ఉత్పత్తులను

విక్రయించుకోలేక పోతున్నారు.

* పాడైపోయే పండ్లు, కూరగాయలను నిరాశా నిస్పృహలతో

తక్కువ ధరకు తమ పొలాల వద్ద విక్రయించుకోవడాన్ని అరికట్టాలి

* ఆపరేషన్ గ్రీన్స్ పథకాన్ని టమాట, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు ( టి..పి.)

నుండి అన్ని పండ్లు, కూరగాయలకు(టోటల్) విస్తరిస్తారు

* పథకం వివరాలు ఇలా ఉన్నాయి:

* మిగులు నుండి లోటు మార్కెట్లకు రవాణాపై 50% రాయితీ

* శీతల గిడ్డంగులతో సహా గిడ్డంగులపై 50% రాయితీ

* ముందుగా 6 నెలలు - ఆ తరువాత పొడిగించి విస్తరిస్తారు

* అంచనా ఫలితాలు : రైతులకు ఉత్తమ ధరలు, వ్యర్థాల తగ్గింపు,

వినియోగదారులకు తక్కువ ధరలలో ఉత్పత్తులు

 

రైతులకు గిట్టుబాటు అయ్యేలా మేలయిన ధరలు వచ్చేలా నిత్యావసర వస్తువుల చట్ట సవరణ

  • తీవ్ర కరువు కాలంలో అమలులోకి వచ్చిన ఈసీ చట్టం,1955
  • ఆకర్షణీయ పెట్టుబడులు, వ్యవసాయ రంగంలో పోటీతత్వం ద్వారా రైతులకు మేలయిన గిట్టుబాటు ధరలు
  • తృణ ధాన్యాలు, వంట నూనెలు, నూనె గింజలు, పప్పు ధాన్యాలు, ఉల్లి, ఆలుగడ్డలు వంటి వ్యవసాయ ఉత్పత్తులపై నియంత్రణల ఎత్తివేత
  • జాతీయ విపత్తులు, కరువు సందర్భంలో ధరల ఒక్క సారిగా పెరగడం విషయంలో అప్రమత్తం; నిల్వల పరిమితి విధింపు
  • ఈ నిల్వల పరిమితి ఆహార పరిశ్రమలు, వ్యవస్థాపిత సామర్థ్యం ఆధారంగా ఎగుమతిదారుల విషయంలో వర్తించదు

నిత్యావసర చట్ట సవరణ చేయనున్న ప్రభుత్వం

రైతులకు మార్కెంటిగ్ ఎంపికలు అందించడం కోసం వ్యవసాయ మార్కెటింగ్ సంస్కరణలు

· .పి.ఎం.సి.ల్లో లైసెన్స్ కలిగి ఉన్న వారికి మాత్రమే వ్యవసాయ ఉత్పత్తులను అమ్మడానిక రైతులు కట్టుబడి ఉన్నారు.

· ఏ పారిశ్రామిక ఉత్పత్తి అమ్మకానికి అలాంటి పరిమితి లేదు.

· ఫలితంగా వ్యవసాయ ఉత్పత్తి సాఫీ ప్రవాహం అంతరాలు

ఏర్పడుతున్నాయి మరియు మార్కెట్, సరఫరా గొలుసు విషయంలో విభజన ఏర్పడుతోంది.

· రైతులకు తక్కువ ధర లభిస్తోంది.

వారికి ఈ క్రిందివి అందిచడం కోసం కేంద్ర చట్టం రూపొందిస్తుంది.

· మంచి ధరలకు ఉత్పత్తులను విక్రయించేందుకు రైతుకు ఎంపిక చేసుకునే అవకాసం

· అవరోధాలు లేని అంతరాష్ట్ర వ్యాపారం

· వ్యవసాయ ఉత్పత్తుల ఈ ట్రేడింగ్ కోసం ఫ్రేమ్ వర్క్.

వ్యవసాయ ఉత్పత్తి ధర మరియు నాణ్యత హామీ

· పంట వేసే సమయంలో పంటల ధరలను అంచనా వేయడానికి రైతులకు అమలు చేయగల ప్రామాణిక విధానం లేదు.

· వ్యవసాయం రంగంలో కావలసిన అందిచేందుకు మరియు తెలుసుకోవడానికి ప్రైవేట్ రంగ పెట్టుబడులు అడ్డుపడుతూ వస్తున్నాయి.

· రైతులను ప్రాసెసర్స్, అగ్రిగేటర్స్, పెద్ద రిటైలర్స్, ఎగుమతి దారులతో నిమగ్నం చేయడానికి వీలుగా న్యాయమైన మరియు పారదర్శక పద్ధతిలో సౌకర్యవంతమైన చట్టం ఏర్పాటు.

· రైతులకు రిస్క్ తగ్గించడం, హామీ రాబడి మరియు నాణ్యతా ప్రమాణీకరణ ప్రేమ్ వర్క్ లో సమగ్ర అంతర్భాగంగా ఉంటాయి.

****


(Release ID: 1624197) Visitor Counter : 570