రైల్వే మంత్రిత్వ శాఖ

ఢిల్లీ నుండి నేడు మూడు ప్రత్యేక రైళ్లను పునరుద్ధరించిన రైల్వేస్

న్యూ ఢిల్లీ - బిలాస్పూర్ ప్రత్యేక రైలులో బుక్ చేసుకున్న మొత్తం 1177 ప్రయాణికులు, న్యూ ఢిల్లీ-డిబ్రుగర్లో 1122 ప్రయాణీకులు, న్యూ ఢిల్లీ-బెంగళూరు ప్రత్యేక రైలులో మొత్తం 1162 మంది ప్రయాణీకులు బుకింగ్

న్యూ ఢిల్లీ నుండి నేడు బయల్దేరుతున్న మొత్తం 3461 మంది ప్రయాణీకులు

ట్రైన్ నెంబర్. 02442 న్యూ ఢిల్లీ నుండి బిలాస్పూర్ కి నేడు బయల్దేరిన మొదటి ప్రత్యేక రైలు

ఈ రైలు నేడు బయల్దేరడంతో శ్రేణుల వారీగా పాసెంజర్ రైళ్ల పునరుద్ధరణయినట్టు

ఈ ప్రత్యేక రైళ్లు, శ్రామిక రైళ్లకు అదనం

Posted On: 12 MAY 2020 3:24PM by PIB Hyderabad

రైలు నెంబర్ 02442 న్యూ ఢిల్లీ నుండి బిలాస్‌పూర్ కు ప్రత్యేక రైలు ఈ రోజు తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది, అంటే 2020 మే 12, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుండి కోవిడ్ 19 కారణంగా ప్రయాణీకుల రైలు సేవలను నిలిపివేసిన తరువాత పునరుద్ధరించబడిన మొదటి ప్రత్యేక రైలు. ఈ రైలు బయలుదేరడంతో, భారతీయ రైల్వేలో ప్రయాణీకుల రైలు సేవలను పునరుద్ధరించడం గ్రేడెడ్ పద్ధతిలో ప్రారంభమైంది. మొత్తం 03 ప్రత్యేక రైళ్లు ఈ రోజు న్యూ ఢిల్లీ నుండి బయలుదేరుతాయి, మొత్తం 05 ప్రత్యేక రైళ్లు ఇతర నగరాల నుండి న్యూ ఢిల్లీ వైపు బయలుదేరుతాయి. ఈ ప్రత్యేక రైలు సేవలు భారత రైల్వే నడుపుతున్న శ్రామిక స్పెషల్స్ తో పాటుగా అదనంగా నడుస్తున్నవి. 

మొత్తం 03 రైళ్లు ఈ రోజు న్యూ ఢిల్లీ నుండి వివిధ గమ్యస్థానాలకు బయలుదేరుతున్నాయి. రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి: 

 

వరుస సంఖ్య

ట్రైన్ నెంబర్ 

బయల్దేరు స్టేషన్  

గమ్యస్థానం  

1

02692

న్యూ ఢిల్లీ 

బెంగళూరు 

2

02424

న్యూ ఢిల్లీ 

డిబ్రుగర్ 

3

02442

న్యూ ఢిల్లీ 

బిలాస్పూర్ 

 

న్యూ ఢిల్లీ నుండి బిలాస్‌పూర్ ప్రత్యేక రైలులో ప్రయాణిస్తున్న 1177 మంది ప్రయాణికుల కోసం మొత్తం 741 పిఎన్‌ఆర్‌లను విడుదల చేసారు; న్యూ ఢిల్లీ డిబ్రుగర్  ప్రత్యేక రైలులో ప్రయాణిస్తున్న 1122 మంది ప్రయాణికుల కోసం మొత్తం 442 పిఎన్‌ఆర్‌లు,  న్యూ ఢిల్లీ - బెంగళూరు ప్రత్యేక రైలులో 1162 మంది ప్రయాణికుల కోసం మొత్తం 804 పిఎన్‌ఆర్‌లను విడుదల చేశారు.

 ఈ రోజు మొత్తం 08 రైళ్లు న్యూ ఢిల్లీ  సహా వివిధ నగరాల నుండి బయలుదేరుతున్నాయి. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి: 

 

వరుస సంఖ్య

ట్రైన్ నెంబర్ 

బయల్దేరు స్టేషన్ 

చేరుకునే గమ్యం 

1

02301

హౌరా 

న్యూ ఢిల్లీ 

2

02951

ముంబై సెంట్రల్ 

న్యూ ఢిల్లీ 

3

02957

అహ్మదాబాద్ 

న్యూ ఢిల్లీ 

4

02309

రాజేంద్రనగర్ (టి)

న్యూ ఢిల్లీ 

5

02691

బెంగళూరు 

న్యూ ఢిల్లీ 

6

02692

న్యూ ఢిల్లీ 

బెంగళూరు 

7

02424

న్యూ ఢిల్లీ 

డిబ్రుగర్ 

8

02442

న్యూ ఢిల్లీ 

బిలాస్పూర్ 

 

 

.

****



(Release ID: 1623312) Visitor Counter : 233