ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 అప్‌డేట్స్

ఇప్ప‌టివ‌ర‌కు 20,917 మందికి వ్యాదిన‌య‌మైంది. రిక‌వ‌రీ రేటు 31.15 శాతానికి పెరిగింది.

Posted On: 11 MAY 2020 5:27PM by PIB Hyderabad

ఇప్ప‌టివ‌ర‌కూ మొత్తం 20,917 మంది కి వ్యాధి న‌య‌మైంది. దీనితో మొత్తం రిక‌వ‌రీ ర‌టు 31.15 శాతానికి చేరింది. మొత్తం నిర్ధారిత కేసుల సంఖ్య 67,152కు చేరింది. నిన్న‌టి నుంచి దేశ‌వ్యాప్తంగా 4,213 నిర్ధారిత కేసులు పెరిగిన‌ట్టు గుర్తించారు
వివిధ వైద్యరంగ నిపుణుల కృషిని ప్రశంసించిన  కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్, కోవిడ్ -19 తో వ్యవహరించడంలో, ముఖ్యంగా గత మూడు నెలల్లో వైద్య నిపుణులు చూపిన స‌మ‌ర్ధ‌త‌, కృషి పట్ల దేశం గర్విస్తున్న‌ద‌ని అన్నారు. వైద్యులు , ఆరోగ్య సంరక్షణ కార్య‌క‌ర్త‌ల‌ప‌ట్ల వివ‌క్ష ప్ర‌ద‌ర్శించ‌డం లేదా వారిని టార్గెట్ చేయ‌డం వంటివి స‌రికాద‌న్నారు.; ఇందుకు బ‌దులుగా ప్రజలకు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌డంలో వారు చేసిన కృషికి  వారిని ప్ర‌శంసించాల‌న్నారు. కోవిడ్ -19 పై పోరాటం కొనసాగించడానికి వైద్యులు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు మ‌న నుంచి గౌర‌వం పొంద‌డానికి, మద్దతు , సహకారం పొంద‌డానికి అర్హులని ఆయన అన్నారు.
కోవిడ్ -19 కోసం జిల్లా స్థాయి స‌దుపాయాల‌ ఆధారిత నిఘా వ్య‌వ‌స్థ‌ కోసం ఆరోగ్య , కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ రోజు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మార్గ‌ద‌ర్శ‌కాలు ఈ లింక్‌లో చూడ‌వ‌చ్చు.
https://www.mohfw.gov.in/pdf/DistrictlevelFacilitybasedsurveillanceforCOVID19.pdf

కోవిడ్ -19 కి సంబంధించి తాజా , అధీకృత స‌మాచారం , దీనికి సంబంధించిన సాంకేతిక అంశాలు, మార్గ‌ద‌ర్శ‌కాలు, ఇత‌ర సూచ‌న‌ల కోసం క్ర‌మం త‌ప్ప‌కుండా గ‌మ‌నించండి : https://www.mohfw.gov.in/
కోవిడ్ -19 కి సంబంధించి సాంకేతిక అంశాల‌పై త‌మ ప్ర‌శ్న‌ల‌ను technicalquery.covid19[at]gov[dot]in  ఈమెయిల్‌కు పంపవ‌చ్చు. ఇత‌ర ప్ర‌శ్న‌ల‌ను ncov2019[at]gov[dot]in .కు ట్వీట్స్ @CovidIndiaSeva .
కోవిడ్ -19పై ఏవైనా ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాల కోసం కేంద్ర ఆరోగ్య‌,కుటుంబ సంక్షేమ మంత్రిత్వ‌శాఖ హెల్ప్‌లైన్ నెంబ‌ర్ :  +91-11-23978046 లేదా 1075 (టోల్ ఫ్రీ) కు ఫోన్ చేయ‌వ‌చ్చు. కోవిడ్ -19 పై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల హెల్ప్‌లైన్ ల జాబితా కోసం కింది లింక్‌ను గ‌మ‌నించ‌వ‌చ్చు.https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf .


 

*****


(Release ID: 1623078) Visitor Counter : 223