హోం మంత్రిత్వ శాఖ
లాక్ డౌన్ తర్వాత ఉత్పాదక పరిశ్రమలు పునఃప్రారంభానికి మార్గదర్శకాలు జారీ చేసిన ఎన్డీఎంఏ(ఎంహెచ్ఏ)
మార్గదర్శకాలు కఠినతరంగా అమలు చేసేలా క్షేత్ర స్థాయి విధులు నిర్వహించేవారు పర్యవేక్షణ
Posted On:
11 MAY 2020 12:46PM by PIB Hyderabad
లాక్ డౌన్ వ్యవధి తరువాత ఉత్పాదక పరిశ్రమలను పునఃప్రారంభించడంపై విపత్తు నిర్వహణ చట్టం 2005 ప్రకారం కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) వివరణాత్మక మార్గదర్శకాలను జారీ చేసింది. కోవిడ్-19కు ఎదుర్కోడానికి ముందస్తు చర్యగా మార్చి 25 నుండి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఆదేశాలు జారీ అయ్యాయి. కొన్ని జోన్లలో లాక్ డౌన్ నిబంధనలు క్రమంగా సడలిస్తుండడం వల్ల మే 1, 2020 నాటి ఎన్డిఎంఏ ఆదేశాలు: 1-29 / 2020-పిపి, ఎంహెచ్ఏ ఆర్డర్ నెం. 40- 3/2020-డిఎం-I (A) ప్రకారం కొన్ని ఆర్థిక కార్యకలాపాలకు అనుమతిస్తున్నారు.
అనేక వారాల పటు లాక్ డౌన్ కారణంగా పరిశ్రమలకు సంబంధించిన వివిధ యూనిట్లలో పనిని నిలుపుదల చేయడంలో కొన్ని విధానాలు పాటించకుండా ఉండే అవకాశం ఉంది. దీని వల్ల ఉత్పత్తి అయ్యే ప్రాంగణాలు, పైప్ లైన్లు, వాల్వులు మొదలైన వాటిలో కొన్ని రసాయనాల అవశేషాలు ఉండవచ్చు. ఇవి ప్రమాద హేతువులుగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే పరిశ్రమల విషయంలో ఇటువంటి ప్రమాదాల నివారరణకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ మార్గదర్శకాలు ఉన్నాయి.
లాకౌట్/టాగ్అవుట్ పరిస్థితుల్లో అనుసరించాల్సిన ప్రక్రియల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే వాటిని ఆపరేట్ చేసే సూపర్వైజర్లకు ప్రమాదకరంగా మారుతాయి.
మండే ద్రవాలు, వాయు పదార్ధాలు, ఓపెన్ వైర్లు, కన్వేయర్ బెల్టులు, ఆటోమేటెడ్ వాహనాలు తయారీ కేంద్రాలు అధిక-ప్రమాదకర పరిస్థితులు తలెత్తవచ్చు. భద్రతా నియమావళి సక్రమంగా అమలు చేయకపోవడం, సరిగా లేబుల్ చేయని రసాయనాలు ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తాయి.
అనూహ్య సంఘటన జరిగినప్పుడు, వేగవంతంగా స్పందించడం సవాలుగా మారుతుంది. ప్రమాదాన్ని తగ్గించడానికి, పారిశ్రామిక యూనిట్ల పునఃప్రారంభం ఫలవంతం అవ్వడానికి , మార్గదర్శకాలు జారీ అయ్యాయి. విపత్తు నిర్వహణ నియమాలు, విధులను తాజాగా విడుదల చేసే ఆదేశాలను గట్టిగ, సమర్థవంతంగా అమలు చేయాలి.
వివరణాత్మక మార్గదర్శకాలను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి
*****
(Release ID: 1622927)
Visitor Counter : 270
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam