హోం మంత్రిత్వ శాఖ

కోవిడ్ మరియు కోవిడ్ కానీ అత్యవసర పరిస్థితులను పరిష్కరించడానికి వైద్య నిపుణులు, పారామెడికల్ సిబ్బంది కదలికలుమరియు ప్రైవేట్ క్లినిక్ లు, నర్సింగ్ హోమ్ లు, ప్రయోగశాలల ప్రారంభం సజావుగా సాగేలా చూడాలి : రాష్ట్రాలకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆదేశాలు.

Posted On: 11 MAY 2020 12:10PM by PIB Hyderabad

2020 మే నెల 10వ తేదీన జరిగిన వీడియో కాన్ఫరెన్సు కు కాబినెట్ కార్యదర్శి అధ్యక్షత వహించారు. వైద్య నిపుణులు, పారా మెడికల్ సిబ్బంది కదలికలపై కొన్ని రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంత్రాలు విధించిన నిబంధనలపై ఈ సమావేశంలో చర్చించారు

ఈ సమావేశానికి అనుగుణంగా, ప్రజారోగ్య అవసరాలను తీర్చడానికీ, విలువైన మానవ జీవితాలను కాపాడటానికీ, వైద్య నిపుణులు ఎటువంటి అవరోధాలు లేకుండా తిరిగేందుకు వీలు కల్పించడం ఎంతైనా అవసరమని హోంమంత్రిత్వశాఖ అన్ని రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాతాలకు వ్రాసింది.  వైద్య నిపుణులు, పారామెడికల్ సిబ్బంది కదలికలపై ఏవైనా నిబంధనలు విధిస్తే అవి కోవిడ్, మరియు కోవిడ్ కాని వైద్య సేవలు అందించడంలో తీవ్రమైన అవరోధాలకు దారితీస్తాయని, మంత్రిత్వశాఖ పేర్కొంది. 

ఈ నేపథ్యంలో, వైద్య నిపుణులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది, అంబులెన్సుల కదలికలు సజావుగా సాగేటట్లు  అన్ని రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాల ప్రభుత్వాలు చూడాలని మంత్రిత్వశాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.  దీనివల్ల కోవిడ్ మరియు కోవిడ్ కాని రోగులకు ఎటువంటి అడ్డంకులు లేకుండా వైద్య సేవలు అందించడానికి అవకాశం ఉంటుంది. పైన పేర్కొన్న అన్ని నిపుణుల యొక్క అంతర్-రాష్ట్ర ఉద్యమం రాష్ట్రాలు / యుటిలచే సులభతరం చేయబడుతుందని కూడా చెప్పబడింది.  ఈ విధానం ద్వారా, ఇంతకు ముందు పేర్కొన్న వైద్య నిపుణులందరూ, రాష్ట్రాల మధ్య సేవలందించడానికి కూడా వెసులుబాటు కలిగేలా రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాలు చొరవ తీసుకోవాలని ఆ ప్రకటన పేర్కొంది

ప్రైవేట్ క్లినిక్‌లు, నర్సింగ్‌హోమ్‌లు, ప్రయోగశాలలు, వారి వైద్య నిపుణులు, సిబ్బందితో సహా తెరవడానికి అనుమతించాలని కూడా హోంమంత్రిత్వశాఖ నొక్కి చెప్పింది.  కోవిడ్ మరియు కోవిడ్ కాని అత్యవసర పరిస్థితుల్లో, రోగులు ఎటువంటి ఆటంకాలు లేకుండా వైద్య సేవలు పొందడానికీ, ఆసుపత్రులపై భారాన్ని తగ్గించడానికీ, ఇది దోహదపడుతుంది.

వైద్య నిపుణుల కదలికలకు సంబంధించిన అధికారిక ప్రకటన కోసం దిగువ లింకు పై క్లిక్ చేయండి. 



(Release ID: 1622908) Visitor Counter : 217