ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 అప్‌డేట్స్
Posted On:
08 MAY 2020 5:55PM by PIB Hyderabad
భారత ప్రభుత్వం, కోవిడ్ -19 సంక్షోభ తీవ్రతకు అనుగుణంగా , ముందస్తు చర్యలు, సానుకూల వైఖరి ద్వారా రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలతో కలసి సమిష్టి కృషితో వైరస్ నివారణ, నియంత్రణ, నిర్వహణ కోసం అనేక చర్యలు తీసుకుంటోంది. వీటిని క్రమం తప్పకుండా ఉన్నత స్థాయిలో సమీక్షిస్తున్నారు
కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ ఈ రోజు, తమిళనాడు, కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలఆరోగ్య మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కోవిడ్ -19 సన్నద్ధతకు సంబంధించిన ప్రయత్నాలు నియంత్రణ చర్యలను సమీక్షించారు. ఇతర రాష్ట్రాల నుండి తిరిగి వచ్చే వలస కార్మికులకు సరైన ఐసొలేషన్ ఏర్పాట్లతో పాటు, ఎస్.ఎ.ఆర్.ఐ, ఐ.ఎల్.ఐ కేసుల నమూనా పరీక్షలను పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
ఐసిఎంఆర్ సంస్థ, ప్లాసిడ్ ట్రయల్ అనే మల్టీ-సెంటర్ క్లినికల్ ట్రయల్‌ను ప్రారంభించింది, ఒక మాదిరి కేసులలో కోవిడ్ -19 అనుబంధ సమస్యలను పరిమితం చేయడంలో కన్వలేసెంట్ ప్లాస్మా భద్రత, సామర్థ్యాన్ని అంచనా వేయడానికి “ఫేజ్- II ఓపెన్-లేబుల్, రాండమైజ్డ్ కంట్రోల్డ్ ట్రయల్, ”ను ప్రారంభించింది.
ఈ అధ్యయనానికి ఏప్రిల్ 29 న కోవిడ్ -19 నేషనల్ ఎథిక్స్ కమిటీ (CONEC) నుండి అనుమతి లభించింది. ప్లాసిడ్ ట్రయల్ కోసం ఐసిఎంఆర్ , 21 సంస్థలను షార్ట్ లిస్ట్ చేసింది. వీటిలో మహారాష్ట్రలోని 5 ఆసుపత్రులు ఉన్నాయి; గుజరాత్‌లో 4; రాజస్థాన్, తమిళనాడు, మధ్యప్రదేశ్ ఉత్తర ప్రదేశ్‌లో 2 వంతున ; పంజాబ్, కర్ణాటక, తెలంగాణ చండీగఢ్‌లలో 1 వంతున ఉన్నాయి.
దేశంలో 216 జిల్లాలో ఇప్పటివరకు ఒక్క కేసుకూడా నమోదు కాలేదు.. గత 28 రోజుల్లో 42 జిల్లాల్లో తాజా కేసులు లేవు, గత 21 రోజుల్లో 29 జిల్లాల్లో తాజా రాలేదు. గత 14 రోజుల్లో మొత్తం 36 జిల్లాల్లో తాజా కేసులు లేవు, 46 జిల్లాల్లో గత 7 రోజులలో కోవిడ్ కేసులు నమోదు కాలేదు.
విదేశాల నుండి తిరిగి వచ్చినవారికి , కాంటాక్టులు ,అనుమానితులను వేరుచేయడం లేదా ధృవీకరించబడిన కేసుల కోసం ప్రభుత్వ క్వారంటైన్ సదుపాయం, హోటళ్ళు, సర్వీస్ అపార్టమెంట్లు, లాడ్జీలు మొదలైన వాటిలో ఐసొలేషన్ సదుపాయం కల్పించడానికి సంబంధించి ఆరోగ్య మంత్రిత్వ శాఖ అదనపు మార్గదర్శకాలను జారీ చేసింది. మరిన్ని వివరాల కోసం మార్గదర్శకాలను ఇక్కడ చూడవచ్చు:
https://www.mohfw.gov.in/pdf/Additionalguidelinesforquarantineofreturneesfromabroadcontactsisolationofsuspectorconfirmedcaseinprivatefacilities.pdf
ఇప్పటివరకు మొత్తం 16,540 మందికి వ్యాధినయమైంది. గత 24 గంటల్లో 1273 మంది రోగులు వ్యాధి నయమై ఆస్పత్రులనుంచి డిశ్చార్జి అయ్యారు. ఇది మొత్తం రికవరీ రేటును 29.36శాతానికి చేరుస్తుంది. ఈ రికవరీ రేటు నిరంతరం పెరుగుతోంది, ప్రస్తుతం ఆసుపత్రిలో చేరిన ప్రతి ముగ్గురు రోగులలో ఒకరు కోలుకున్నారు, లేదా వ్యాధి నయమై ఇంటికి వెల్ళారు
దేశవ్యాప్తంగా ధృవీకరించబడిన మొత్తం కేసుల సంఖ్య ఇప్పుడు 56,342 కు చేరింది. నిన్నటి నుండి, దేశంలో కోవిడ్ -19 ధృవీకృత కేసుల సంఖ్య 3390 పెరిగింది. సగటున, 3.2శాతం మంది రోగులు ఆక్సిజన్ మద్దతుతో, 4.7శాతం మంది రోగులు ఐసియులో, 1.1శాతం మంది రోగులు వెంటిలేటర్ పైన ఉన్నారు.
కోవిడ్ -19 కి సంబంధించి తాజా , అధీకృత సమాచారం , దీనికి సంబంధించిన సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, ఇతర సూచనల కోసం క్రమం తప్పకుండా గమనించండి : https://www.mohfw.gov.in/.
కోవిడ్ -19 కి సంబంధించి సాంకేతిక అంశాలపై తమ ప్రశ్నలను technicalquery.covid19[at]gov[dot]in ఈమెయిల్‌కు పంపవచ్చు. ఇతర ప్రశ్నలను ncov2019[at]gov[dot]in .కు పంపవచ్చు.
కోవిడ్ -19పై ఏవైనా ప్రశ్నలకు సమాధానాల కోసం కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్‌లైన్ నెంబర్ : +91-11-23978046 లేదా 1075 (టోల్ ఫ్రీ) కు ఫోన్ చేయవచ్చు. కోవిడ్ -19 పై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల హెల్ప్‌లైన్ ల జాబితా కోసం కింది లింక్‌ను గమనించవచ్చు.https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf .
*****
(Release ID: 1622245)
Visitor Counter : 235
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam