ప్రధాన మంత్రి కార్యాలయం
వేసక్ బుద్ధ పూర్ణిమ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Posted On:
07 MAY 2020 12:34PM by PIB Hyderabad
నమస్కార్!!!
ఎ వెరీ హ్యాపీ బుద్ధ పూర్ణిమ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బుద్ధ భగవానుడి అనుచరులూ అలాగే , మీరందరూ సంతోషదాయకమైన మరిన్ని వేసక్ ఉత్సవాలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.
ఈ పవిత్రదినాన నేను మిమ్మల్ని కలుసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను మిమ్మలను కలుసకున్న సందర్భంగా నేను మీ ఆశీస్సులు కోరుకుంటున్నాను. గతంలోకూడా నేను ఇలాంటి ఎన్నో అవకాశాలను పొందాను. 2015,2018 లలోఢిల్లీలో 2017 కొలంబోలో జరిగిన ఉత్సవాలలో మీతో కలసి పాల్గొన్నాను.
అయితే ఈసారి పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి అందువల్ల మనం ఈ సారి ముఖాముకి కలుసుకోలేకపోతున్నాం.
మిత్రులారా, బుద్ధభగవానుడు ఇలా అన్నాడు-
मनो पुब्बं-गमा धम्मा,
मनोसेट्ठा मनोमया,
అంటే దీని అర్ధం, ధమ్మ మనసులో ఉంటుంది. మనసు మహోన్నతమైనది. అన్ని చర్యలకు ఇదే కారణం.ఈ మనసే నన్ను మీతో అనసంధానం చేస్తుంది. అందువల్ల భౌతికంగా అందరం దగ్గరగా లేకపోవడం అనేది అనిపించడం లేదు. మీఅందరి మధ్య ఉండడం ఎంతో ఆనందాన్నిస్తుంది. అయితే పరిస్థితులు ఇప్పుడు అనుకూలంగా లేవు.
అందువల్ల, ఎక్కడో దూరం నుంచి , సాంకేతికత సాయంతో మనం ఒకరితో ఒకరు మాట్లాడుకునే అవకాశం లభించింది. ఇది ఎంతో సంతృప్తి కలిగిస్తోంది.
మిత్రులారా, ప్రస్తుత లాక్‌డౌన్ క్లిష్టపరిస్థితుల కాలంలోనూ అంతర్జాతీయ బుద్దిస్ట్ ఆర్గనైజేషన్ , వర్చువల్ వేసక్ బుద్ధపూర్ణిమ దినోత్సవాన్ని నిర్వహించడం అభినందించదగినది. మీ వినూత్న కృషికారణంగా, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అనుయాయులు ఒకరికొకరు కలుసుకుని ఈ ఈవెంట్‌లో పాలుపంచుకోగలుగుతున్నారు
లుంబిని, బోధ్‌గయ, సారనాథ్, కుషినగర్‌తోపాటు ఈ ఉత్సవాలు శ్రీలంకలోని అనురాధపుర స్తూప, వసకదువ ఆలయంలోనూ అత్యంత అద్భుతంగా జరుగుతున్నాయి.
ఈ ప్రార్థనలకు సంబంధించిన కార్యక్రమాల ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్రతిచోటా జరుగుతుండడం దానికదే అద్బుత అనుభవం. మీరు, కరోనామహమ్మారిపై ప్రపంచవ్యాప్తంగా ముందుండి పోరాడుతున్న వారికోసం దీనిని ప్రార్థనల వారంగా నిర్వహించడానికి ప్రతిన బూనారు. మీరు చేపట్టిన ఈ ప్రేమ పూర్వక చర్యను అభినందిస్తున్నాను.
ఇటువంటి సంస్థాగత ప్రయత్నాలతో, ఈ కష్టమైన సవాలు నుండి మానవాళి బయటపడగలదని, ప్రజల కష్టాలను తగ్గించగలమని నాకు పూర్తి నమ్మకం ఉంది. మిత్రులారా, ప్రతి వ్యక్తి కష్టాలను తొలగించే సందేశం , సంకల్పం భారతదేశ నాగరికత, సంస్కృతికి ఎల్లప్పుడూ దిశను చూపించాయి. భగవాన్ బుద్ధుడు భారతదేశపు ఈ సంస్కృతిని మరింత సుసంపన్నం చేశారు.
భగవాన్ గౌతమ బుద్ధుడు తన జీవితంలో జ్ఞానోదయం తరువాత ,చాలా మంది జీవితాలను కూడా సుసంపన్నం చేశారు. వారి సందేశం ఏ ఒక్క పరిస్థితికి లేదా ఏదైనా ఒక అంశానికి ఎంతమాత్రం పరిమితం కాదు
అనేక శతాబ్దాలుగా, సిద్ధార్థుడి పుట్టుకకు ముందు , తరువాత, అలాగే సిద్ధార్థుడు గౌతముడిగా మారిన తరువాత, కాల చక్రం అనేకానేక పరిస్థితుల చుట్టూ మనల్ని తిప్పుతూనే ఉంది.
కాలం మారిపోయింది, పరిస్థితి మారిపోయింది, సమాజం క పనితీరూ మారిపోయింది, కాని బుద్ధుని సందేశం మన జీవితాల్లో నిరంతరం ప్రవహిస్తూనే ఉంది. బుద్ధుడు కేవలం పేరు మాత్రమే కాదు కాబట్టి ఇది సాధ్యమైంది, బుద్దుడు ఒక పవిత్రమైన ఆలోచన, ప్రతి మానవ హృదయంలో కొట్టుకునే గుండె చప్పుడు. ఈ ఆలోచన మానవాళికి మార్గనిర్దేశం చేస్తున్నది . బుద్ధుడు పరిత్యాగానికి, ప్రాయశ్చిత్తానికి అంతిమ హద్దు.
బుద్ధుడు సేవ , అంకితభావానికి పర్యాయపదంగా నిలుస్తాడు. బుద్ధుడు, బలమైన సంకల్ప శక్తితో, సామాజిక మార్పు సాధకుడు. . పట్టుదల, ఆత్మబలిదానం , ప్రపంచమంతా ఆనందాన్ని వ్యాప్తి చేస్తున్నమహానుభావుడు బుద్ధుడు.
ఇంకా చెప్పాలంటే, మన అదృష్టం చూడండి, ఈ సమయంలో మన చుట్టూ ఉన్న చాలా మందిని, ఇతరులకు సేవ చేసేవారు, రోగికి చికిత్స చేసేవారు, పేదవాడికి ఆహారం అందించే వారు, ఆసుపత్రిని శుభ్రపరిచేవారు, రహదారిపై శాంతిభద్రతలు కాపాడే వారు ఇలా ఎందరినో చూస్తున్నాం.వీరంతా నిరంతరం పనిచేస్తున్నారు. భారతదేశంలో, భారతదేశం వెలుపల, ఇలా పనిచేస్తున్న ప్రతి వ్యక్తికి వందనం, వీరందరికీ అభినందనలు.
మిత్రులారా, ప్రపంచంలో గందరగోళం నెలకొనిఉన్న సమయంలో, చాలా సార్లు విచారం, నిరాశ , నిస్పృహ భావన చాలా ఎక్కువగా కనిపిస్తుంది, అలాంటి సమయంలో బుద్ధుడిగురించి మరింతగా తెలుసుకోవడం ఎంతో సందర్భోచితంగా ఉంటుంది.
క్లిష్ట పరిస్థితులను అధిగమించడానికి, వాటి నుండి బయటపడటానికి మానవులు నిరంతరం కృషి చేయాలని ఆయన చెప్పేవారు. అలసిపోవడం , అలుపు ఒకఆప్షన్ కాదు. ఈ రోజు, మనమందరం కూడా క్లిష్టపరిస్థితి నుండి బయటపడటానికి నిరంతరం కలిసి శ్రమిస్తున్నాం
బుద్ధ భగవానుడు ప్రవచించిన నాలుగు సత్యాలు-
క్షమ, దయ, సంతోషంలోను, దుఃఖంలోనూ చలించకపోవడం, అన్ని సద్గుణాలు,లోపాలతో ఒకరిని అంగీకరించడం-
ఈ నాలుగు సత్యాలు భరతభూమికి ప్రేరణనిస్తూ ఉన్నాయి.
భారతదేశం నిస్వార్థతతో, ఎలాంటి తేడాలు లేకుండా, దేశంలోను, ప్రపంచవ్యాప్తంగా ఇబ్బందులలో ఉన్న వారివైపు, గట్టిగా నిలబడి ఉండడాన్ని ప్రస్తుతం మీరు గమనిస్తున్నారు.
లాభనష్టాలకు ఆవల, ఇది సాధ్యమా, సాధ్యంకాదా అన్నదానితో సంబంధం లేకుండా ఈసంక్షోభ సమయలో సాధ్యమైనంత వరకు ఇతరులకు సహాయం చేయడం, ఆపన్న హస్తం అందించడం చేస్తున్నాం.
అందుకే ఇవాళ చాలా దేశాలు ఈ క్లిష్టపరిస్థితులలో ఇండియాను గుర్తుపెట్టుకుంటున్నాయి. ఇండియాకూడా అవసరమున్నవారికి చేరువ కావడానికి ఏ అవకాశాన్నీ విడిచిపెట్టడం లేదు.
ఇవాళ, ప్రతి భారతీయుడి ప్రాణాలను కాపాడటానికి భారతదేశం అన్నివిధాలుగా ప్రయత్నాలు చేస్తోంది , అలాగే దానితోపాటు ప్రపంచ బాధ్యతలనూ సమానంగా నెరవేరుస్తోంది.
మిత్రులారా, ప్రతి పదం, భగవాన్ బుద్ధుని ప్రతి బోధ మానవాళికి సేవ చేయాలనే భారతదేశ నిబద్ధతను మరింత బలోపేతం చేస్తుంది. భారత జ్ఞానోదయం భారతదే స్వీయ-సాక్షాత్కారం రెండింటికీ బుద్ధుడు గుర్తుగా నిలుస్తాడు. ఈ స్వీయ-సాక్షాత్కారంతో, మొత్తం మానవాళి, మొత్తం ప్రపంచం ప్రయోజనాలు కాపాడడం కోసం భారతదేశం పనిచేస్తూనే ఉంటుంది. భారతదేశ పురోగతి ప్రపంచ ప్రగతికి ఎల్లవేళలా దోహదపడుతుంది.
మిత్రులారా, మన కొలమానాలు, లక్ష్యాలు కాలగమనంలో మారుతుంటాయి. అయితే, మనం మన పనిని నిరంతర సేవాభావంతో కొనసాగించాలన్నది మన మనసులో ఉంచుకోవాలి.
ఇతరులపట్ల దయ, కరుణ , సేవా భావం ఉన్నప్పుడు, ఈ భావాలు మమ్మల్ని చాలా బలంగా చేస్తాయి, మీరు ఎంతటి పెద్ద సవాలునైనా ఎదుర్కోగలరు.
सुप्प बुद्धं पबुज्झन्ति, सदा गोतम सावका, అంటే, రాత్రింబగళ్లు , సర్వ వేళల్లో మానవాళి సేవలో నిమగ్నమైన వారు బుద్ధుని నిజమైన అనుచరులు. ఈ ప్రేరణ మన జీవితాలను ప్రకాశవంతం చేస్తుంది, మనల్ని ముందుకు తీసుకువెళుతుంది..
ఈ శుభాకాంక్షలతో మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ క్లిష్ట పరిస్థితిలో, మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీరు నివసించే దేశాన్ని జాగ్రత్తగా చూసుకోండి, మిమ్మల్ని మీరు రక్షించుకోండి , ఇతరులకు సాధ్యమైనంతవరకు సహాయం చేయండి.
ప్రతి ఒక్కరి ఆరోగ్యం బాగుండాలన్న ఆకాంక్షతో నేను నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.
ధన్యవాదాలు!! సర్వ్ మంగళం !!!
***
(Release ID: 1621782)
Visitor Counter : 465
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam