ప్రధాన మంత్రి కార్యాలయం

బుద్ధ‌పూర్ణిమ సంద‌ర్భంగా 2020 మే 7న వ‌ర్చువ‌ల్ వేస‌క్‌ అంత‌ర్జాతీయ ఉత్స‌వాల‌లో పాల్గొన‌నున్న ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ. ఈ సంద‌ర్భంగా కీల‌కోప‌న్యాసం చేయ‌నున్న ప్ర‌ధాన‌మంత్రి శ్రీ నరేంద్ర‌మోదీ

Posted On: 06 MAY 2020 8:45PM by PIB Hyderabad

 

ప్ర‌ధాన‌మంత్రి  శ్రీ న‌రేంద్ర మోదీ రేపు  2020 మే 7 వ తేదీన బుద్ధ‌పూర్ణిమ ఉత్స‌వాల‌లో పాల్గొన‌నున్నారు.
భార‌త ప్ర‌భుత్వ సాంస్కృతిక వ్య‌వ‌హారాల శాఖ , అంత‌ర్జాతీయ బుద్ధిస్ట్ సంస్థ‌ల‌కు చెందిన‌ ఇంట‌ర్నేష‌న‌ల్ బుద్ధిస్ట్ కాన్ఫెడ‌రేష‌న్ (ఐబిసి) తో క‌ల‌సి ఒక వ‌ర్చ‌వ‌ల్ ప్రార్థ‌న కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తోంది. ఇందులో ప్ర‌పంచ‌వ్యాప్తంగాగ‌ల అన్ని  బౌద్ద‌సంఘాల స‌ర్వోన్న‌త అధిప‌తులు పాల్గొంటున్నారు.

ఉద‌యం జ‌రిగే ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాన‌మంత్రి కీల‌కోప‌న్యాసం  చేయ‌నున్నారు.
 ప్రంచ‌వ్యాప్తంగా కోవిడ్ -19 మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో బుద్ధ‌పూర్ణిమ ఉత్స‌వాలు వ‌ర్చువ‌ల్ వైశాఖ్‌డే ద్వారా
నిర్వ‌హించ‌నున్నారు.
ఈ కార్య‌క్ర‌మాన్ని కోవిడ్ బాధితులు కోవిడ్ -19పై ముందుండి పోరాటం చేస్తున్న యోధుల గౌర‌వార్థం నిర్వ‌హిస్తున్నారు.
ఈ సంద‌ర్భంగా ప్రార్థ‌నా స‌మావేశాలను నేపాల్ లోని ప‌విత్ర లుంబిని వ‌నం, ఇండియాలోని బోధ్‌గ‌య‌ల గ‌ల మ‌హాబోధి ఆల‌యం  , ఇండియాలోని సార‌నాథ్‌లోగ‌ల ముల్ గంధ కుటి విహార, ఇండియాలోని కుషిన‌గ‌ర్‌లోగ‌ల ప‌రినిర్వాణ స్తూప‌, శ్రీ‌లంక‌లోని చ‌రిత్రాత్మ‌క, ప‌విత్ర‌ అనురాధ‌పుర స్తూప ప్రాంగ‌ణంలోని రువాన్‌వెలి మ‌హాసేయ నుంచి పిరిత్  చాంటింగ్‌, నేపాల్ లోఇ  న‌మోస్తూప‌, బౌదానాథ్ స్వ‌యంభూతోపాటు ఇత‌ర బౌద్ద ప్ర‌సిద్ధ క్షేత్రాల‌నుంచి ప్రార్థ‌న కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌త్య‌క్ష  ప్ర‌సారం చేస్తారు.
సాంస్కృతిక, ప‌ర్యాట‌క శాఖ మంత్రి శ్రీ ప్ర‌హ్లాద్‌సింగ్ ప‌టేల్‌, మైనారిటీ వ్య‌వ‌హారాలు, యువ‌జ‌న స‌ర్వీసులు, క్రీడ‌ల‌శాఖ మంత్రి శ్రీ కిర‌ణ్ రిజ్జు కూడా ఈ కార్య‌క్ర‌మ‌ములో పాల్గొంటారు.
వేస‌క్ - బుద్ధ‌పూర్ణిమ‌ను , త‌ధాగ‌త గౌత‌మ‌బుద్ధ‌జ‌న‌నం  , జ్ఞానోద‌యం , మ‌హాప‌రినిర్వాణ‌మైన అత్యంత ప‌విత్ర‌మైన రోజుగా భావిస్తారు.


(Release ID: 1621633) Visitor Counter : 327