ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరియు ఇథియోపియా ఫెడరల్ డెమోక్రాటిక్ రిపబ్లిక్ ప్రధానమంత్రి గౌరవనీయులు డాక్టర్ అబియ్ అహ్మద్ అలీ మధ్య టెలిఫోన్ సంభాషణ.
प्रविष्टि तिथि:
06 MAY 2020 7:05PM by PIB Hyderabad
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు ఇథియోపియా ఫెడరల్ డెమోక్రాటిక్ రిపబ్లిక్ ప్రధానమంత్రి గౌరవనీయులు డాక్టర్ అబియ్ అహ్మద్ అలీ తో టెలిఫోన్ లో మాట్లాడారు.
భారత ఇథియోపియా మధ్య సన్నిహిత సంబంధాలను, ఇరుదేశాల మధ్య నెలకొన్న అద్భుతమైన భాగ్వామ్యాన్ని ప్రధానమంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు.
కోవిడ్-19 మహమ్మారి వల్ల ఎదురైన సదేశీయ, ప్రాంతీయ, అంతర్జాతీయ సవాళ్ల గురించి ఇద్దరు నాయకులు చర్చించారు. ఆరోగ్య సంక్షోభం లో ఒకరికొకరు సంఘీభావం వ్యక్తం చేసుకున్నారు.
ఇథియోపియా కు అవసరమైన మందుల సరఫరాకు, మహమ్మారి ప్రభావానికి గురైన ఆర్ధికవ్యవస్థ మెరుగుదలకు, భారతదేశం సహాయం అందజేస్తుందని ఇథియోపియా ప్రధానమంత్రి డాక్టర్ అబియ్ అహ్మద్ అలీ కి భారత ప్రధానమంత్రి హామీ ఇచ్చారు.
కోవిడ్-19 కు వ్యతిరేకంగా చేస్తున్న పోరులో ఇథియోపియా ప్రజలు విజయం సాధించాలని, తన తరఫున, భారతదేశ పౌరుల తరఫున ప్రధానమంత్రి ఆకాంక్ష వ్యక్తం చేశారు.
******
(रिलीज़ आईडी: 1621578)
आगंतुक पटल : 336
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Punjabi
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam