ఆర్థిక మంత్రిత్వ శాఖ
ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజ్: ఇప్పటివరకు పురోగతి
సుమారు 39 కోట్ల మంది పేద ప్రజలు పిఎంజికెపి కింద రూ 34,800 కోట్ల ఆర్ధిక సహాయం అందుకున్నారు
Posted On:
06 MAY 2020 11:41AM by PIB Hyderabad
ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ (పిఎమ్‌కెకెపి) కింద డిజిటల్ చెల్లింపు మౌలిక సదుపాయాలను ఉపయోగించి, సుమారు 39 కోట్ల మంది ప్రజలు 5 మే 2020 నాటికి 34,800 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందుకున్నారు. కోవిడ్ -19 కారణంగా విధించిన లాక్‌డౌన్ ప్రభావం నుండి ప్రజలను రక్షించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన దానికి అనుగుణంగా వారు ఈ మొత్తాన్న అందుకున్నారు.
పిఎంజికెపిలో భాగంగా, మహిళలు పేదలు, వయోధికులు, రైతులకు ఉచిత ఆహార ధాన్యాలు, నగదు చెల్లింపును ప్రభుత్వం ప్రకటించింది. ప్యాకేజీ సత్వర అమలును కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. సహాయక చర్యలు అవసరమైనవారికి వేగంగా, లాక్ డౌన్ ఉద్దేశ్యానికి అనుగుణంగా సత్వరం చేరేలా చూడటానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ, సంబంధిత మంత్రిత్వ శాఖలు, క్యాబినెట్ సెక్రటేరియట్ , పిఎంఓ లు అవసరమైన అన్నిచర్యలూ తీసుకుంటున్నాయి.
లబ్ధిదారులకు సత్వరం , సమర్దంగా నగదు బదిలీ చేయడానికి ఫిన్‌టెక్, డిజిటల్ టెక్నాలజీలను వినియోగించడం జరుగుతోంది. ప్రత్యక్ష నగదు బదిలీ (డిబిటి) అంటే,లబ్ధిదారు ఖాతాలోకి నేరుగా నగదు బదిలీకి వీలు కల్పించడం. ఇది మధ్యదళారులను, లభ్దిదారులకు నగదు అందడంలో లీకేజీలను లేకుండా చేస్తుంది. సమర్జతను పెంపొందిస్తుంది. లబ్దిదారుడు బ్యాంకు శాఖకు స్వయంగా వెళ్ళాల్సిన అవసరం లేకుండానే వారి ఖాతాలలోకి ఈ మొత్తం జమ అవుతుంది.
పిఎంజికెపి పథకం వివిధ కాంపొనెంట్ లకింద సాధించిన ప్రగతి కింది విధంగా ఉంది.:
--పిఎం-కిసాన్ తొలి విడతచెల్లింపు కింద 8.19 కోట్ల లబ్ధిదారులకోసం 16,394 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది.
---20.05 కొట్ల (98.33 శాతం) మహిళా జన్‌ధన్ ఖాతాలో తొలి విడత మొత్తం కింద రూ 10.025 కోట్ల రూపాయలు జమచేయడం జరిగింది. ప్రభుత్వం నగదు జమచేసిన పిఎంజెడివై ఖాతాలు కలిగిన మహిళలు8.72 కోట్లు (44 శాతం).. రూ 2,785 కోట్ల రూపాయలను 5.57 కోట్ల మహిళల జన్ ధన్ ఖాతాలలో 2020 మే 5 నాటికి రెండోవిడత మొత్తం జమచేశారు.
---.2.82 కోట్ల మంది వృద్ధాప్య,వితంతు, దివ్యాంగులైన లబ్ధిదారులకు 1405 కోట్ల రూపాయలు పంపిణీ చేశారు.2.812 కోట్ల మంది లబ్ధిదారులందరికీ ప్రయోజనాలను బదిలీ చేశారు.
---.2.20 కోట్ల మంది భవన నిర్మాణ కార్మికులు 3492.57 కోట్ల రూపాయల ఆర్థిక మద్దతు అందుకున్నారు.
---
ఏప్రిల్ కు సంబంధించి ఇప్పటివరకు 67.65 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అందుకున్నాయి. 2020 ఏప్రిల్ కి సంబంధించి 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 60.33 కోట్ల లబ్ధిదారులకు 30.16 లక్షల మెట్రిక్‌టన్నుల ఆహార ధాన్యాలు పంపిణీ చేశారు.
, 2020 ఏప్రిల్‌లో 36 స్టేట్స్ / యుటిల ద్వారా 60.33 కోట్ల బీ-నెఫిషియరీలను కవర్ చేస్తుంది. 6.19 ఎల్‌ఎమ్‌టి ఆహార ధాన్యాలు పంపిణీ చేయబడ్డాయి, మే 2020 లో 22 రాష్ట్రాలు / యుటిల ద్వారా 12.39 కోట్ల మంది లబ్ధిదారులను కవర్ చేస్తుంది. 2020 మే నెలకు సంబంధించి 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 12.39 కోట్ల లబ్ధిదారులకు 6.19 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు పంపిణీ చేశారు.
---వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఇప్పటివరకూ 2.42 లక్షల మెట్రిక్ టన్నుల పప్పుధాన్యాలను19.4 కోట్ల లబ్దిదారులకు గాను 5.21 కోట్ల మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
---5.09 కోట్ల ప్రధానమంత్రి ఉజ్వల యోజన(పిఎంయువై) సిలిండర్లు ఈ పథకం కింద ఇప్పటివరకూ నమోదయ్యాయి. 4.82 కోట్ల పిఎంయువై ఉచిత సిలిండర్లు ఇప్పటికే లబ్దిదారులకు పంపిణీచేశారు.
---ఎంప్లాయీస్ ప్రావిడెంట్ పండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఒ) కు చెందిన 9.6 లక్షల మంది సభ్యులు ఆన్‌లైన్ ద్వారా ఇపిఎఫ్ఒ నుంచి నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ పొందే ప్రయోజనాన్ని 2985 కోట్ల రూపాయల మేరకు అందుకున్నారు.
--- 24 శాతం ఇపిఎఫ్ కంట్రిబ్యూషన్‌ను 44.97 లక్షల ఉద్యోగులకు సుమారు 698 కోట్ల రూపాయల మేరకు బదిలీ చేశారు.
---ఎం.జి.ఎన్.ఆర్.ఇ.జి.ఎ పెంచిన రేట్లను 01-04-2020 న నోటిఫై చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5.97 కోట్ల వ్యక్తుల పనిదినాలు కల్పించడం జరిగింది. దీనికి తోడు రూ 21,032 కోట్ల రూపాయలు వేతనాలు, మెటిరీయల్‌కు సంబంధించిన పెండింగ్ బకాయిలు తీర్చేందుకు విడుదల చేశారు.
----ప్రభుత్వ ఆస్పత్రులు, హెల్త్ కేర్ సెంటర్లలో హెల్త్ వర్కర్లకు ఇన్సూరెన్స్ పథకాన్ని 22.12 లక్షల మంది హెల్త్ వర్కర్లకు న్యూ ఇండియా అస్సూరెన్స్ అమలు చేస్తోంది.
ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ పాకేజ్
. 05-05-2020 వరకు మొత్తం ప్రత్యక్ష నగదు బదిలీ
పథకం
|
లబ్ధిదారుల సంఖ్య
|
మొత్తం
|
పిఎంజెడివై మహిళా ఖాతాదారులకు మద్దతు
|
తొలివిడత - 20.05 కోట్లు (98.3%)
రెండవ విడత - 5.57కోట్లు
|
తొలివిడత - 10025 కోట్లు
రెండవ విడత – 2785 కోట్లు
|
ఎన్.ఎస్.ఎ.పికి మద్దతు ( వయోధిక వితంతువులు, దివ్యాంగులు, సీనియర్‌సిటిజన్లు)
|
2.82 కోట్లు (100%)
|
1405 కోట్లు
|
పి.ఎం.కిసాన్ కింద రైతులకు ఫ్రంట్ లోడెడ్ పెమెంట్లు
|
8.19 కోట్లు
|
16394 కోట్లు
|
బిల్టింగ్, ఇతర నిర్మాణ రంగ కార్మికులకు మద్దతు
|
2.20కోట్లు
|
3493కోట్లు
|
ఇపిఎఫ్ఓ కు 24 శాతం కంట్రిబ్యూషన్
|
.45 కోట్లు
|
698 కోట్లు
|
మొత్తం |
39.28 కోట్లు
|
34800 కోట్లు
|
(Release ID: 1621345)
Visitor Counter : 614
Read this release in:
Marathi
,
English
,
Urdu
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada