ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 అప్‌డేట్స్
Posted On:
05 MAY 2020 5:44PM by PIB Hyderabad
ఇప్పటివరకూ కోవిడ్ -19 నుంచి కోలుకున్న 12,726 మంది
భారత ప్రభుత్వం, కోవిడ్ -19 సంక్షోభ తీవ్రతకు అనుగుణంగా , ముందస్తు చర్యలు, సానుకూల వైఖరి ద్వారా రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలతో కలసి సమిష్టి కృషితో వైరస్ నివారణ, నియంత్రణ, నిర్వహణ కోసం అనేక చర్యలు తీసుకుంటోంది. వీటిని క్రమం తప్పకుండా ఉన్నత స్థాయిలో సమీక్షిస్తున్నారు
కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాక మంత్రి డాక్టర్ హర్షవర్దన్ 14 వగ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (జిఒఎం) సమావేశానికి అధ్యక్షత వహించారు. వీరు కోవిడ్ -19 ను నియంత్రించడంపై లోతైన చర్చలు జరిపారు.కేంద్ర , రాష్ట్రప్రభుత్వాలు తీసుకున్న చర్యలను చర్చించారు. పిపిఇలు, మాస్క్‌లు, వెంటిలేటర్లు, ఔషధాల అందుబాటుకు సంబంధించి జి.ఒ.ఎం సమీక్షించింది. ఆరోగ్యసేతు యాప్ సమర్ధత, దాని పనితీరుపై కూడా జి.ఒ.ఎంలో ప్రదర్శించారు.
ఇతర నాన్ కోవిడ్ చికిత్సలు అందించే ఆస్పత్రులు, కోవిడ్ బ్లాక్‌లు కలిగిన ఆస్పత్రులలో ఆరోగ్య కార్యకర్తల కోసం పిపిఇ లను హేతుబద్ధంగా వాడడంపై కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ తాజాగా అదనపు మార్గదర్శకాలు జారీచేసింది. పిపిఇ ల హేతుబద్ధమైన వాడకంపై 2020 మార్చి 24 న ఇప్పటికే జారీ చేసిన మార్గదర్శకాలతో పాటుగా ఇవి కొనసాగుతాయి.
ఒపిడి, వైద్యుల గదులు, ప్రీ- అనస్తీషియా చెక్-అప్ క్లినిక్, ఐపిడి- వార్డ్ ,ఐసియు , లేబర్ రూమ్, ఆపరేషన్ థియేటర్ వంటి వివిధ ప్రాంతాల కోసం వివిధ స్థాయిల వ్యక్తిగత రక్షణ పరికరాలు (పిపిఇ) సూచించారు..ఇందుకు సంబంధించిన వివరణాత్మక మార్గదర్శకాలు https://www.mohfw.gov.in/pdf/AdditionalguidelinesonrationaluseofPersonalProtectiveEquipmentsetting approachforHealthfunctionariesworkinginnonCOVIDareas.pdf లింక్ లో అందుబాటులో ఉన్నాయి
ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 2020 ఏప్రిల్ 14 న అత్యవసర ఆరోగ్య సేవలను అందించడానికి ఇప్పటికే మార్గదర్శకాలను జారీ చేసింది.
ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా, రోగనిరోధకత, ప్రసూతి సేవలు-పిల్లల ఆరోగ్య సేవలు, తీవ్రమైన అనారోగ్య రోగులకు డయాలసిస్, క్యాన్సర్, డయాబెటిస్, టిబి వంటి వారికి రక్తదాన సేవలు వంటి వాటిని అన్ని సేవలను ప్రభుత్వ ప్రైవేటు నాన్ కోవిడ్ ఆస్పత్రులలో వివిధ జోన్లలో ప్రకటించిన సడలింపుల ప్రకారం అందేటట్లు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు చూడాలి.
ఇప్పటివరకూ మొత్తం 12,726 మందికి వ్యాధి నయమైంది. దీనితో మొత్తం రికవరీ రేటు 27.41 శాతానికి చేరింది. మొత్తం కోవిడ్ నిర్ధారిత కేసులు ప్రస్తుతం 46,433 కు చేరాయి. నిన్నటి నుంచి దేశంలో కోవిడ్ -19 నిర్ధారణ కేసులు 3,900 పెరిగాయి. మొత్తం ఇప్పటివరకూ నమొదైన మరణాల సంఖ్య 1568. నిన్నటినుంచి ఇప్పటి వరకు 195 మరణాలు నమోదయ్యాయి.
కోవిడ్ నిర్ధారిత కేసుల సంఖ్య , మరణాల సంఖ్య గత 24 గంటలలో గరిష్ఠంగా నమోదైనందున, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కోవిడ్ -19 వైరస్ కాంటాక్టులను సమర్ధంగా గుర్తించాలని క్రియా శీల కేసులకోసం తనిఖీ చేయాలని , గుర్తించిన కేసులకు చికిత్స అందించాలని కేంద్రం సూచించింది.
కోవిడ్ -19 కి సంబంధించి తాజా , అధీకృత సమాచారం , దీనికి సంబంధించిన సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, ఇతర సూచనల కోసం క్రమం తప్పకుండా గమనించండి : https://www.mohfw.gov.in/.
కోవిడ్ -19 కి సంబంధించి సాంకేతిక అంశాలపై తమ ప్రశ్నలను technicalquery.covid19[at]gov[dot]in ఈమెయిల్‌కు పంపవచ్చు. ఇతర ప్రశ్నలను ncov2019[at]gov[dot]in .కు పంపవచ్చు.
కోవిడ్ -19పై ఏవైనా ప్రశ్నలకు సమాధానాల కోసం కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్‌లైన్ నెంబర్ : +91-11-23978046 లేదా 1075 (టోల్ ఫ్రీ) కు ఫోన్ చేయవచ్చు. కోవిడ్ -19 పై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల హెల్ప్‌లైన్ ల జాబితా కోసం కింది లింక్‌ను గమనించవచ్చు.
https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf .
*****
(Release ID: 1621274)
Visitor Counter : 242
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam