రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 మహమ్మారిని ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో ప్రధానమంత్రి జనఔషధీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి: మనసుఖ్ మాండవీయ
చౌక ధరల్లో నాణ్యమైన మందులు కొనేందుకు ప్రతి రోజూ 10 లక్షల మంది ప్రధానమంత్రి జనఔషధీ కేంద్రాలను సందర్శిస్తున్నారు

Posted On: 04 MAY 2020 5:44PM by PIB Hyderabad

కోవిడ్ -19 మహమ్మారిని ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో దేశవ్యాప్తంగా ఉన్న జనఔషధీ కేంద్రాలు  కీలక పాత్ర పోషిస్తున్నాయని  కేంద్ర నౌకాయాన ,  రసాయనాలు మరియు ఎరువుల శాఖ సహాయ (ఐసి)  మంత్రి శ్రీ మనసుఖ్ మాండవీయ అన్నారు.   ప్రతి రోజు  6000  జనఔషధీ కేంద్రాలను దాదాపు 10 లక్షల మంది సందర్శించి నాణ్యమైన మందులను చౌక ధరలకు కొంటున్నారని మంత్రి అన్నారు.  ఈ కేంద్రాలలో హైడ్రాక్సీ క్లోరోక్విన్ కూడా అమ్ముతున్నారని అన్నారు.  
చౌక ధరలకు నాణ్యమైన సాధారణ మందులను అందరికీ అందుబాటులోకి తేవాలన్న ప్రధానమంత్రి కలను నిజం చేయడానికి భారత ప్రభుత్వ ఔషధీయ  శాఖ  ప్రధానమంత్రి భారతీయ జనఔషధి  పరియోజన (పి ఎం బి జె పి )  కింద జనఔషధీ కేంద్రాలు ప్రారంభించింది.  
ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి శ్రీ నరేంద్ర మోదీ జనఔషధీ కేంద్రాల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నారు.  గడచిన ఐదున్నర ఏళ్లలో  6000  కేంద్రాలను ప్రారంభించడం జరిగింది.   సగటు మార్కెట్ ధరతో పోల్చినప్పుడు జనఔషధీ కేంద్రాలలో 50 నుంచి 90 శాతం తక్కువ ధరకు మందులు అమ్ముతున్నారు.  
జన ఔషధీ కేంద్రాలలో నాణ్యమైన జనరిక్ మందులను చౌక ధరల్లో అమ్మడంతో పాటు లాక్ డౌన్ సమయంలో  అనేక కేంద్రాలు రేషన్ కిట్లు , ఆహారం, ఉచిత మందులు మొదలగునవి పేదలకు పంపిణీ చేశాయని తెలిపారు.  
కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తి వంటి ప్రత్యేక పరిస్థితిలో జన ఔషధీ కేంద్రాల పాత్ర చాలా ముఖ్యంగా మారింది. పేదలు,  ఆపన్నుల సేవలో 6000 జన ఔషధీ కేంద్రాలు రేయింబవళ్లు అవిశ్రాంతంగా పనిచేస్తున్నాయి.  ఒక్క ఏప్రిల్, 2020 నెలలోనే దేశవ్యాప్తంగా ఈ కేంద్రాల వ్వారా రూ. 52 కోట్ల విలువైన మందులు అమ్మారు.   ఈ కేంద్రాల ద్వారా హైడ్రాక్సీ క్లోరోక్విన్,  ఎన్ 95 మాస్కులు,  మూడు పొరల మాస్కులు,  హ్యాండ్ శానిటైజర్లు మొదలగునవి చౌక ధరలకు అమ్ముతున్నారు.    

 


కోవిడ్ -19 మహమ్మారి సమయంలో ఈ కేంద్రాలు పోషించిన ముఖ్యమైన పాత్రను శ్రీ మాండవీయ గుర్తించారు.  "పేదలకు సామాజిక సేవ అందిస్తున్న జన ఔషధీ దుకాణాల యజమానులను  నేను ప్రశంసిస్తున్నాను"  అని మంత్రి అన్నారు.   

***(Release ID: 1621058) Visitor Counter : 120