గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 నుండి ఉత్పన్నమయ్యే పరిస్థితుల నేపథ్యంలో గిరిజన సేకరణదారులు, చేతివృత్తులవారి జీవనోపాధి, భద్రత కోసం తక్షణ చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం
దేశవ్యాప్తంగా గిరిజన వృత్తికళాకారుల దగ్గర నిల్వ ఉన్న రూ.23 కోట్ల ఉత్పత్తులను సేకరించనున్న ట్రైఫెడ్
Posted On:
04 MAY 2020 1:45PM by PIB Hyderabad
గిరిజన చేతివృత్తులవారు ఎదుర్కొన్న అసాధారణమైన కష్టాల దృష్ట్యా, గిరిజన సేకరణదారులు, గిరిజన కళాకారులకు సహాయాన్ని అందించడానికి ప్రభుత్వం అనేక తక్షణ కార్యక్రమాలను చేపట్టింది. ‘గిరిజన ఉత్పత్తుల అభివృద్ధి, మార్కెటింగ్‌కు శాఖా పరంగా సహాయం’ పథకం కింద మైనర్ అటవీ ఉత్పత్తి వస్తువుల కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)ని గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇప్పటికే పెంచింది. ఈ పథకం కింద గిరిజన మంత్రిత్వ శాఖ కింద ఉన్న ట్రైఫెడ్ 10 లక్షల మంది గిరిజన చేతివృత్తి దారులతో సంధానం అవుతుంది. గత 30 రోజుల్లోగా లాక్ డౌన్ వల్ల గిరిజన చేతివృత్తుల వారికి వ్యాపార కార్యకలాపాలు లేక అనిశ్చితితో ఉండిపోయి జీవోనోపాధి లేకుండా పోయింది. ఈ చేతివృత్తుల వారి దగ్గర వస్త్రాలు, గిఫ్హ్ వస్తువులు, వన్ ధన్ నాచురల్స్, లోహ వస్తువులు, ఆభరణాలు, గిరిజన చిత్రాలు, మట్టి బొమ్మలు, పాత్రలు, వెదురు తో చేసిన వస్తువులు ఉంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో గిరిజనులను ఆదుకోడానికి పలు చర్యలు తీసుకున్నారు:
ఏ) అమ్మకాలు లేక ఉన్న నిల్వల కొనుగోలు:
తాము తయారు చేసే వస్తువుల అమ్మకాల పైనే గిరిజనుల జీవనోపాధి ఆధార పడి ఉంటుంది. అందువల్ల వాటికి సంబంధించి తక్షణ సహాయం కావాలి. అందువల్ల బాగా ప్రభావ వంతమైన గిరిజన కుటుంబాల నుండి అటువంటి ఉత్పత్తులను కొనుగోలు చేయాలని గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక అభిప్రాయానికి వచ్చింది. దీనికి అనుగుణంగా ట్రైఫెడ్ దేశవ్యాప్తంగా రూ.23 కోట్ల విలువ చేసే ఉత్పత్తులను సేకరించడానికి ఏర్పాట్లు చేస్తోంది.
దీనితో పాటు పరిశ్రమల సమాఖ్యలు, ప్రధాన కార్పొరేట్, వర్తక సంస్థలతో ట్రైఫెడ్ వీడియో కాన్ఫెరెన్స్, వెబినార్స్, చర్చల ద్వారా గిరిజన ఉత్పత్తుల నిల్వలను స్వీకరించేలా చర్యలు చేపట్టింది. దీని ద్వారా వృత్తికారులు తమ ఉత్పత్తులను మొత్తం అమ్ముకునేలా, వివిధ సంస్థల గిఫ్ట్ అవసరాలకు అనుగుణంగా కొనుగోలు చేసేలా, సదస్సులు, సమావేశాల్లో అవసరమైన స్టేషనరీ, వివిధ కార్యాలయాలలో విభిన్నమైన రేఖాచిత్రాలు, డోక్రా తదితర అవసరాలు తీర్చేలా, అలాగే ఎక్కువ పరిమాణంలో టోకుగా కంపెనీలు తీసుకునేలా గిరిజనులు తమ ఉత్పత్తులను విక్రయించే అవకాశాలు ఉన్నాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో మాస్కులు, శానిటైజెర్ల తయారీకి కూడా గిరిజనులు సిద్ధమయ్యారు.

(మణిపూర్ చుర చాంద్పూర్ కి చెందిన వన్ ధన్ కేంద్రాల సంచార విక్రయ కేంద్రాలు ప్రారంభోత్సవం)



బి) గిరిజన వృత్తికారులకు నెలవారి రేషన్ :
గిరిజన కళాకారులకు కొంత ఉపశమనం కలిగించడానికి, ట్రైఫెడ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది, వారి #iStandWithHumanity ప్రచారంతో గిరిజన కుటుంబాలకు బాసటగా నిలిచే ప్రయత్నం జరుగుతుంది. దేశవ్యాప్తంగా గిరిజన కుటుంబాలకు రూ .1000 / - విలువైన రేషన్ కిట్లను పంపిణీ చేయడం (సామాజిక దూర మార్గదర్శకాలను కొనసాగిస్తూ) జరుగుతుంది. ప్రతి రేషన్ కిట్‌లో 5 కిలోల గోధుమ పిండి, 2 కిలోల పప్పులు, 3 కిలోల బియ్యం, 500 మి.లీ ఆయిల్, 100 గ్రాముల పసుపు పొడి, 100 గ్రాముల రెడ్ మిరప పొడి, 100 గ్రాముల జీలకర్ర విత్తనాలు, 100 గ్రాముల నల్ల ఆవాలు, 100 గ్రాముల కూర మసాలా, 2 సబ్బులు అందజేస్తున్నారు.
వీటితో పాటు గిరిజన వృత్తికారులు వ్యాపారంలో బ్యాంకు గారెంటీలు, రుణాలు, మూల ధనం, పెట్టుబడులు వంటి విషయాల్లో ట్రైఫెడ్ వివిధ ఆర్ధిక సంస్థలతో సంప్రదింపులు జరిపి ఆదుకుంటోంది. గిరిజన ప్రాంతాల్లో వారికి, ట్రైఫెడ్ లక్ష మాస్కులు, సబ్బులు, చేతి తొడుగులు, 20,000 వ్యక్తిగత సంరక్షణ కిట్లు అందిస్తోంది.
గిరిజన సేకరణదారులు వారి పనుల్లో అవసరమైన సామజిక దూరం పాటించడం, పరిశుభ్ర వాతావరణం అలవరిచేలా ట్రైఫెడ్ యూనిసెఫ్ తో కలిసి ఏప్రిల్ 9న వెబినార్ ను నిర్వహించింది. ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కోడానికి ట్రైఫెడ్ పలు సలహాలు సూచనలు కూడా చేసింది
(Release ID: 1620936)
Visitor Counter : 192
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam