ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ

కోవిడ్ అనంతర పరిస్థితుల్లో విస్తారమైన వెదురు వనరుల మద్ధతు భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టానికి మంచి అవకాశం – డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 03 MAY 2020 5:07PM by PIB Hyderabad

కేంద్ర సహాయ మంత్రి (ఇండిపెండెంట్ ఛార్జ్) (ఈశాన్య భారత రీజియన్ అభివృద్ధి, పర్సనల్, పబ్లిక్ గ్రీవియన్స్ పెన్షన్స్ పి.ఎం.ఓ. సహాయ మంత్రి, అణుశక్తి మరియు అంతరిక్ష శాఖ,) డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ కోవిడ్ అనంతర పరిస్థితుల్లో భారత ఆర్థిక వ్యవస్థకు వెదురు పంట దన్నుగా నిలుస్తుందని, వెదురు వనరుల ద్వారా భారత్ ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు అవకాశం ఉందని తెలిపారు.

బ్యాంబూ కాన్ క్లేవ్ ను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ప్రసంగించారు. ఈ కాన్ఫరెన్స్ లో ఈశాన్య భారత రీజియన్ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రతినిధులు, కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు వివిధ రంగాలకు చెందిన వాటాదాలు పాల్గొన్నారు. డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, వెదురు నిల్వల్లో 60 శాతం ఈశాన్య భారత దేశంలోనే ఉందని, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో, గత ఆరేళ్ళుగా ఈశాన్య భారత అభివృద్ధికి ప్రాధాన్యత నిచ్చి, గొప్ప ప్రయోజనాలు చేకూర్చారని, అదే సమయంలో వెదురు రంగానికి కూడా ప్రోత్సాహం అందిందని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఈశాన్య భారతానికి ఇంత ప్రోత్సాహం లభించలేదని, ఈ విషయంలో మోడీ ప్రభుత్వం 2017లో తీసుకొచ్చిన 100 సంవత్సరాల నాటి భారతీయ అటవీ చట్టంలోని సవరణలను ప్రస్తావించిన ఆయన, దాని ఫలితంగా వెదురు జీవనోపాధి అవకాశాలను పెంచడంలో భాగంగా ఇంట్లో పెరిగిన వెదురుకు మినహాయింపు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.

 వెదురుకు ప్రచారం చేయడాన్ని మోడీ ప్రభుత్వం ప్రాధాన్యత కల అంశంగా భావిస్తోందని, లాక్ డౌన్ వ్యవధిలో కూడా, ఏప్రిల్ 16న హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, వివిధ రంగాల్లో పరిమిత కార్యకలాపాలను అనుమతించే సమయంలో కూడా ఇది స్పష్టంగా తెలుస్తుందని డాక్టర్. జితేంద్ర సింగ్ తెలిపారు. నాటడం, ఇతర ప్రక్రియలు సహా వెదురుకు సంబంధించిన కార్యకలాపాల పనితీరుకు ఇందులో అనుమతి లభించిందని తెలిపారు.

భారతదేశంలో అగర్ బత్తీ కోసం 2,30,000 యూనిట్ల వెదురు అవసరం అవుతుందని, దాని మార్కెట్ విలువ 5000 కోట్ల రూపాయలు ఉంటుందని, దానిలో పెద్ద మొత్తాన్ని చైనా, వియత్నాం లాంటి దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం ఆశ్చర్యకరమైన అంశమని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. కోవిడ్ తదనంతర పరిస్థితుల నేపథ్యంలో, భారతదేశ పోటీ ప్రపంచంలో ఎదగడానికి, మరియు స్వయం సమృద్ధిని సాధించడానికి ఈశాన్య ప్రాంతానికి ఇదో చక్కని అవకాశమని ఆయన తెలిపారు.

సమీప భవిష్యత్తులో, ఈశాన్య మంత్రిత్వ శాఖ వెదురు తయారీ మరియు వాణిజ్యాన్ని ప్రోత్సహించడాన్ని మరింత వేగవంతం చేసేందుకు ప్రణాళికలను రూపొందించే ప్రయత్నం చేస్తోందని, ఈ రంగంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్ షిఫ్ (పి.పి.పి)సాధ్యతను కూడా పరిశీలిస్తోందని డాక్టర్. జితేంద్ర సింగ్ తెలిపారు. వెదురు నుంచి బయో డీజిల్, గ్రీన్ ఫ్యూయల్ మరియు చెక్క కలప, ప్లైవుడ్ సహా పలు ఉత్పత్తుల్లో ప్రాసెస్ చేయవచ్చని, ఇది ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రాన్ని మార్చడమే కాకుండా బహుళ రంగాల్లో ఉపాధి అవకాశాలను సృష్టించడమే గాక, మరింత మెరుగు పరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో మాట్లాడిన వారిలో ఈశాన్యభారత అభివృద్ధి ప్రత్యేక కార్యదర్శి శ్రీ ఇండోవర్ పాండె, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ అల్కా భార్గవ్, ఈశాన్యభారత అభివృద్ధి సంయుక్త కార్యదర్శి రాం వీర్ సింగ్, సి.బి.టిసి, ఎం.డి మరియు ఈశాన్య హస్తకళలు మరియు చేనేత అభివృద్ధి కార్బొరేషన్ (ఎన్.ఈ.హెచ్.డి.సి) శ్రీ శైలేందర్ చౌదరి, మాజీ మంత్రి జాతీయ వెదురు మిషన్ సభ్యుడు శ్రీ అన్నా సాహెబ్ ఎం.కె. పాటిల్ ఉన్నావు. ఈ కాన్ క్లేవ్ ను ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ గ్రీన్ ఎనర్జీ (ఐ.ఎఫ్.జి.ఈ) డైరక్టర్ జనరల్ శ్రీ సంజయ్ గంజూ పర్యవేక్షించారు. 

 

***


(Release ID: 1620668) Visitor Counter : 204