రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 లాక్ డౌన్ సమయంలో జనౌషధీ కేంద్రాలు 2020 ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో 52 కోట్ల రూపాయల మేర అమ్మకాల టర్నోవర్ సాధించాయి.

Posted On: 03 MAY 2020 1:48PM by PIB Hyderabad

కోవిడ్-19 లాక్ డౌన్ సమయంలో సేకరణ మరియు రవాణాకు సమస్యలు ఎదురైనప్పటికీ ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధీ కేంద్రాలు - పి.ఎం.బి.జె.ఏ.కే. 2020 మర్చి నెలలో సాధించిన 42 కోట్ల రూపాయల మేర అమ్మకాల టర్న్ ఓవర్ తో పోలిస్తే,  2020 ఏప్రిల్ నెలలో 52 కోట్ల రూపాయల మేర అమ్మకాలు సాధించాయి. కాగా 2019 ఏప్రిల్ నెలలో ఈ అమ్మకాలు 17 కోట్ల రూపాయల మేర ఉన్నాయి. 

 

Sadananda Gowda@DVSadanandGowda

@pmbjpbppi is committed to ensure uninterrupted availability of medicines to people of the country. In spite of lockdown and problems in procurement & logistics, Janaushadhi has achieved an appreciable sales turnover of Rs 52 Cr in April 2020 as compared to Rs 42 Cr in March 2020

View image on Twitter

12

6:05 PM - May 1, 2020

Twitter Ads info and privacy

See Sadananda Gowda's other Tweets

Mansukh Mandaviya@mansukhmandviya

.@pmbjpbppi के इस संकट की घड़ी में राष्ट्रसेवा का जज्बा लिए जन-जन तक सस्ती एवं गुणवत्ता वाली दवाएं पहुंचे इसे सुनिश्चित कर रहें हैं।

निःसंदेह इन कर्म-योगियों का योगदान सराहनीय है, आइए हम सब मिलकर इन योद्धाओं को नमन करें, सम्मान करें।

Embedded video

265

8:30 AM - May 3, 2020

Twitter Ads info and privacy

125 people are talking about this

 

 

కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి కారణంగా దేశం మొత్తం పెద్ద సవాలును ఎదుర్కొంటుండగా, మందులు, వైద్య పరికరాలకు పెద్ద డిమాండ్ ఏర్పడింది.  ఈ డిమాండ్ ను తీర్చడానికి జన్ ఔషధీ కేంద్రాలు 2020 ఏప్రిల్ నెలలో ప్రజలకు తక్కువ ధరల్లో సుమారు 52 కోట్ల రూపాయల మేర విలువైన నాణ్యమైన మందులు సరఫరా చేశాయి.  జన్ ఔషధీ కేంద్రాల మందులు మార్కెట్ ధర కంటే సరాసరి 50 నుండి 90 శాతం తక్కువగా ఉండడంతో సామాన్య ప్రజలకు సుమారు 300 కోట్ల రూపాయల మేర మొత్తం ఆదా అయ్యింది 

 

దేశంలో మందుల అవసరం ఎక్కువగా ఉన్న సమయంలో, విషమ పరిస్థితుల్లో కూడా నిర్విరామంగాఅలసిపోకుండా పనిచేసి, రికార్డు స్థాయిలో అమ్మకాలు సాధించిన జనౌషధి స్టోర్ ఆపరేటర్లను భారత ప్రభుత్వ రసాయనాలుఎరువుల శాఖ కేంద్ర మంత్రి శ్రీ డి.వి.సదానంద గౌడ మరియు కేంద్ర రసాయనాలుఎరువుల శాఖ సహాయమంత్రి శ్రీ మన్ సుఖ్ మాండవీయ అభినందించారు. 

 

ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధీ పరియోజన (పి.ఎం.బి.జె.పి.) ద్వారా ప్రజలకు తక్కువ ధరల్లో అంతరాయం లేకుండా మందులు అందుబాటులో ఉండే విధంగా చూసేందుకు తన మంత్రిత్వశాఖ కట్టుబడి ఉందని శ్రీ గౌడ హామీ ఇచ్చారు

 

కోవిడ్-19 కు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న పోరులో భాగంగా భారత ప్రభుత్వం ఆరోగ్య పరిరక్షణ విధాన రూపురేఖలను పి.ఎం.బి.జె.పి. వంటి ముఖ్యమైన పధకాల ద్వారా విప్లవాత్మకంగా రూపొందిస్తోంది.  ఈ పధకంలో భాగంగా 900 కు పైగా రకాల నాణ్యమైన జనరిక్ మందులను మరియు 154 రకాల శస్త్రచికిత్సకు ఉపయోగించే పరికరాలు, ఇతర వినియోగావస్తువులను అతి తక్కువ ధరలకు దేశంలోని ప్రతి పౌరునకు అందిస్తున్నారు. 

 

భారత ప్రభుత్వరంగ ఫార్మా సంస్థల బ్యూరో (బి.పి.పి.ఐ.) ముఖ్య కార్యనిర్వహణాధికారి సచిన్ కుమార్ సింగ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజలు తమ దగ్గరలోని జన్ ఔషధీ కేంద్రాలను గుర్తించడంతో పాటు, జనరిక్ మందుల లభ్యతను, వాటి ధరలను తెలుసుకోడానికి సహాయపడే  "జన్ ఔషధీ సుగం మొబైల్ యాప్"  ను  బి.పి.పి.ఐ. అభివృద్ధి చేసిందని చెప్పారు.  ఈ యాప్ ను 3,25,000 మందికి పైగా ఉపయోగిస్తున్నారు.  ఈ యాప్ ద్వారా జన్ ఔషధీ కేంద్రాలు ఉన్న ప్రదేశం, అక్కడికి చేరుకోడానికి గూగుల్ మ్యాప్ ద్వారా మార్గం, జన్ ఔషధీ జనరిక్ మందుల ఎంపిక, జనరిక్ మందులు, బ్రాండెడ్ మందుల మధ్య నాణ్యత మరియు ధరల వ్యత్యాసం, మొత్తం మీద ఆదా అయ్యే మొత్తం వంటి వివిధ వివరాలు తెలుసుకోవచ్చు ఈ యాప్ ఆండ్రాయిడ్ మరియు ఐ-ఫోన్ వేదికలు రెండింటిలో అందుబాటులో ఉంది

ప్రస్తుతం దేశంలోని 726 జిల్లాలలో మొత్తం 6,300 పైగా పి.ఎమ్.జె.ఏ.కె. లు పనిచేస్తున్నాయి.  కరోనా వైరస్ నుండి తమకు తాము రక్షణ కల్పించుకోడానికి వీలుగా లాక్ డౌన్ సమయంలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ పి.ఎమ్.బి.జె.పి. కూడా తమ సామాజిక మాధ్యమం వేదికల ద్వారా సందేశాలు ప్రచారం చేస్తోంది

 

***** 



(Release ID: 1620647) Visitor Counter : 177