ప్రధాన మంత్రి కార్యాలయం
భారతదేశం లో వృద్ధి ని పరుగు పెట్టించడం కోసం ఆర్థిక రంగం లో, నిర్మాణ రంగం లో మరియు సంక్షేమ రంగం లో చేపట్టవలసిన చర్యల ను గురించి చర్చించేందుకు ఒక విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించిన ప్రధాన మంత్రి
Posted On:
02 MAY 2020 10:57PM by PIB Hyderabad
ఆర్థిక రంగం లో ఏయే విధాలు గా జోక్యం చేసుకోవాలి అనే వ్యూహాల ను చర్చించడం కోసం, అలాగే ప్రస్తుత పరిస్థితుల లో వృద్ధి ని మరియు సంక్షేమాన్ని వేగిరపరచడం కోసం నిర్మాణ రంగాని కి సంబంధించి ఎటువంటి సంస్కరణల ను ప్రవేశపెట్టాలి అంశాల ను గురించి కూడా చర్చించడం కోసం ఒక సమావేశాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిర్వహించారు.
ఆర్థిక మంత్రి తో మరియు అధికారుల తో ఏర్పాటు చేసిన ఓ సమావేశం లో రైతుల కు, ఎమ్ఎస్ఎమ్ఇ లకు సాయపడటానికి, వ్యవస్థ లో ద్రవ్య సరఫరా ను , ఇంకా పరపతి లభ్యత ను అధికం చేయడానికి ఏయే ప్రమేయాలు, వ్యూహాలు అవసరం అవుతాయి అనే అంశాల పై ప్రధాన మంత్రి చర్చించారు. కోవిడ్-19 సంక్రమణ నేపథ్యం లో ఆర్థిక స్థిరత్వాని కి పూచీ పడటానికి ఏయే ఉపాయాల ను అమలు పరచాలో ఈ సమావేశం లో ప్రధాన మంత్రి చర్చించారు. అంతేకాక, కోవిడ్-19 ప్రభావాల నుండి వ్యాపారాలు త్వరిత గతి న కోలుకొనేందుకు వీలు గా తీసుకొన్నటువంటి చర్యల ను గురించి సైతం ఆయన చర్చించారు.
శ్రామికుల శ్రేయం మరియు సామాన్య మానవుడి శ్రేయం అనే అంశాల ను ప్రధాన మంత్రి ఈ సమావేశం లో ప్రస్తావిస్తూ, కోవిడ్-19 కారణం గా తల ఎత్తిన అంతరాయాల కు సంబంధించిన సంకటాల ను దూరం చేయడానికి వ్యాపారాల కు సాయపడటం ద్వారా లాభదాయక ఉద్యోగ అవకాశాల ను కల్పించవలసిన ఆవశ్యకత ఉందని తెలిపారు.
గత కాలం లో చేపట్టిన ప్రధానమైన వ్యవస్థీకృత సంస్కరణల ను బల పరచవలసిన అవసరాన్ని గురించి కూడా ప్రధాన మంత్రి సమావేశం లో ఉద్ఘాటించారు. అదే విధం గా కార్పొరేట్ గవర్నెన్స్, పరపతి విపణులు మరియు మౌలిక సదుపాయాల కల్పన రంగాల లో నూతన వ్యవస్థీకృత సంస్కరణల పై సైతం సమావేశం లో చర్చించడమైంది.
మౌలిక సదుపాయాల కల్పన రంగం లో క్రొత్త పథకాల కు సంబంధించిన పనుల ను మొదలుపెట్టేందుకు సత్వర చర్యల ను తీసుకోవలసిన అవసరం ఎంతయినా ఉందని, అలా చేసినందువల్ల కోవిడ్-19 కారణం గా చేజారిన కాలాన్ని తిరిగి భర్తీ చేసుకోవడానికి వీలు ఏర్పడుతుంది అంటూ ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు. నేశనల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ లో భాగం గా అమలుపరుస్తున్న పథకాల ను- కాలిక జాప్యాల ను నివారించి మరి ఉద్యోగాల ను కల్పించడం సాధ్యపడేటట్లుగా- తరచు గా అత్యున్నత స్థాయి లో సమీక్షిస్తూ ఉండాలని ప్రధాన మంత్రి కోరారు.
వివిధ మంత్రిత్వ శాఖ లు చేపట్టిన సంస్కరణ కార్యక్రమాల ను అంతరాయం లేకుండా కొనసాగించాలని, మూలధనం మరియు పెట్టుబడి ప్రవాహాల కు ఎటువంటి అడ్డంకులు ఎదురైనా వాటి ని తొలగించేందుకు కాలబద్ధ ప్రణాళిక తో ముందుకు పోవాలన్న విషయం కూడా సమావేశం లో చర్చ కు వచ్చింది.
హోం మంత్రి, ఆర్ధిక మంత్రి, ఆర్ధిక మంత్రిత్వ శాఖ కార్యదర్శులతో పాటు భారత ప్రభుత్వం లోని ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశాని కి హాజరయ్యారు.
**
(Release ID: 1620587)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam