ప్రధాన మంత్రి కార్యాలయం

విద్యారంగంపై స‌మీక్షాస‌మావేశం నిర్వ‌హించిన ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

Posted On: 01 MAY 2020 9:45PM by PIB Hyderabad

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ‌న‌రేంద్ర మోదీ ఈరోజు జాతీయ విద్యా విధానం (ఎన్‌.ఇ.పి) స‌హా విద్యారంగంలో తీసుకురావ‌ల‌సిన సంస్క‌ర‌ణ‌లు , విద్యారంగ అంశాల‌పై ఒక స‌మావేశం నిర్వ‌హించారు.విద్యారంగంలో సాంకేతిక వినియోగం,ఆన్‌లైన్ త‌ర‌గ‌తులు, విద్యాపోర్ట‌ల్ , ప్ర‌త్యేక విద్యా ఛాన‌ళ్ల‌లో త‌ర‌గ‌తివారీగాప్ర‌సారాలు  వంటి సాంకేతిక‌త వాడడం వ‌ల్ల అభ్య‌స‌న శ‌క్తి పెరుగుద‌ల‌, వీటి సానుకూల‌త‌ల‌పై ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు.
బ‌హుభాష‌లు, 21 వ శతాబ్దపు నైపుణ్యాలు, క్రీడలు, కళల ఏకీకరణ, పర్యావరణ సమస్యలు మొదలైన   వాటిపై దృష్టి సారించే కొత్త జాతీయ క‌రికుల‌మ్ ఫ్రేమ్ వ‌ర్క్ ద్వారా
నాణ్య‌మైన సార్వ‌త్రిక విద్య‌ను అందుబాటులోకి తేవ‌డం, విద్య‌లో ఏక‌రూప‌త‌, ప్రాథ‌మిక విద్య నాణ్య‌త‌పెంపు, వంటి వాటిని ,సాధించడంపై ఈ స‌మావేశంలో దృష్టిపెట్టారు.
పాఠశాల  ఉన్నత స్థాయిలలో విద్య కోసం వివిధ రీతుల్లో సాంకేతిక పరిజ్ఞానం  ఉపయోగం  ప్రచారం గురించి  ఈ స‌మావేశంలో వివరంగా చర్చించారు - అంటే ఆన్‌లైన్ మోడ్, టివి ఛానెల్స్, రేడియో, పాడ్‌కాస్ట్‌లు మొదలైనవి. భారతీయ విద్యా వ్యవస్థను అత్యున్నత ప్రపంచ ప్రమాణాలతో సమానంగా చేసే దిశ‌గా ఉన్న‌త విద్యావ్య‌వ‌స్థ‌ను సంస్క‌రించ‌డం ద్వారా ‌ ఉన్నత విద్యా వ్య‌వ‌స్జ చురుకైన‌, స‌మ‌గ్ర  మైన‌, సమకాలీన భారతీయ సంస్కృతి  నైతికతలలో వేళ్ళూనుకోవ‌డానికి ఉప‌క‌రిస్తుంది.
మొత్తంమీద, బాల్యద‌శ‌ సంరక్షణ ,విద్య, ప్రాథ‌మిక అక్ష‌రాస్య‌త‌,  అంకెలు, సమకాలీన బోధనను అనుసరించడం, భారతదేశ సాంస్కృతిక భాషా వైవిధ్యాన్ని పరిరక్షించడం, విద్య  ప్రారంభ దశ‌లొ వృత్తి విద్య‌పై  ప్రత్యేక దృష్టి పెట్టడం వంటి వాటిపై ప్ర‌ముఖంగా దృష్టిపెట్టారు.
అందరికీ నాణ్యమైన విద్యకు భరోసా ఇవ్వడం ద్వారా శక్తివంతమైన జ్ఞాన సమాజాన్ని సృష్టించడానికి విద్యా సంస్కరణలను చేపట్టాలని నిర్ణయించారు, తద్వారా అది భారతదేశాన్ని ‘గ్లోబల్ నాలెడ్జ్ సూపర్ పవర్’ గా మారుస్తుంది.

 ఈ ల‌క్ష్యాల‌న్నీ సాధించ‌డానికి , విద్యాప‌రంగా పాల‌న‌ను స‌మ‌ర్ధంగా నిర్వ‌హించ‌డానికి కృత్రిమ మేధ‌తో సహా పెద్ద ఎత్తున సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని ప్రోత్స‌హించ‌డం జ‌రుగుతుంది.
 


*****



(Release ID: 1620232) Visitor Counter : 334