హోం మంత్రిత్వ శాఖ
లాక్‌డౌన్ కారణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్నవారికి శుభవార్త ప్రత్యేక రైళ్ల ద్వారా స్వస్థలాలకు చేరేందుకు కేంద్రం అనుమతి
प्रविष्टि तिथि:
01 MAY 2020 4:47PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా ఉన్న లాక్‌డౌన్ కారణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్నవారు స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ ప్రదేశాల్లో చిక్కుకున్న వలస కూలీలు, యాత్రికులు, సందర్శకులు, విద్యార్థులు మరియు ఇతరులు, రైల్వే మంత్రిత్వ శాఖ నడిపే ప్రత్యేక రైళ్ల ద్వారా గమ్యస్థానాలు చేరుకునేందుకు అనుమతించింది.
ప్రజలను తరలించేందుకు రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాలతో సమన్వయం చేసుకునేలా, రైల్వే మంత్రిత్వ శాఖ నోడల్ అధికారులను నియమించనుంది. టిక్కెట్ల విక్రయాలపై సంపూర్ణ మార్గదర్శకాలు విడుదల చేయనుంది. రైళ్లలో, ఫ్లాట్‌ఫారాలపైనా సామాజిక దూరం, ఇతర ఆరోగ్యపర జాగ్రత్తలు పాటించేలా కూడా మార్గదర్శకాలు ఇవ్వనుంది.
(रिलीज़ आईडी: 1620066)
आगंतुक पटल : 356
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Punjabi
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam