మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వ‌హించే వివిధ ప‌రీక్ష‌లకోసం ఆన్ లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తులు పెట్ట‌డానికి తుది గ‌డువు పొడిగింపు

Posted On: 30 APR 2020 7:42PM by PIB Hyderabad

కోవిడ్ -19 మ‌హ‌మ్మారి కార‌ణంగా దేశ‌వ్యాప్తంగా విద్యార్థులు, త‌ల్లిదండ్రులు అనేక క‌ష్టాలు ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో వివిధ ప‌రీక్ష‌ల కోసం ఆన్ లైన్ లో ద‌ర‌ఖాస్తులు దాఖ‌లు చేయ‌డానికిగాను ప్ర‌క‌టించిన తేదీల‌ను నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ ( ఎస్ ఎస్ టి) పొడిగించాల‌ని కేంద్ర మాన‌వ‌వ‌న‌రుల శాఖ మంత్రి శ్రీ ర‌మేష్ పోఖ్రియాల్ ఆదేశించారు. కేంద్ర మంత్రి ఆదేశాల ప్ర‌కారం ఎన్ ఎస్ టి వెంట‌నే ఆయా ప‌రీక్ష‌ల ద‌ర‌ఖాస్తు గ‌డువు తేదీల‌ను పొడిగించింది. 
సూచించిన ప‌రీక్ష ఫీజుల‌ను క్రెడిట్ డెబిట్‌, నెట్ బ్యాంకింగ్‌, యుపిఐ లేదా పేటీఎంల‌ద్వారా చెల్లించ‌వ‌చ్చు. ఇక ఆయా ప‌రీక్ష‌ల‌కు సంబంధంచిన స‌వ‌రించిన ప‌రీక్ష‌ల తేదీల‌ను, అడ్మిట్ కార్డు డౌన్ లోడ్ వివ‌రాల‌ను ఆయా ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన వెబ్ సైట్ల‌లో ప్ర‌క‌టిస్తారు. అంతే కాదు www.nta.ac.in ద్వారా కూడా తెలుసుకోవ‌చ్చు. ఈ వివ‌రాల‌ను కోవిడ్ -19 ప‌రిస్థితిని స‌మీక్షించి మే 15 త‌ర్వాత ప్ర‌క‌టిస్తారు. 
ప‌రీక్ష‌ల గురించి త‌ల్లిదండ్రులు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని ఈ లాక్ డౌన్ స‌మ‌యాన్ని విద్యార్థులు స‌ద్వినియోగం చేసుకొని ప‌రీక్ష‌ల త‌యారీకి సంబంధించి ఏవైనా గ్యాపులుంటే వాటిని తొల‌గించుకోవాల‌ని ఎన్ టిఏ కోరుతోంది. 
పరీక్ష‌ల‌కోసం ద‌ర‌ఖాస్తు చేసుకునే విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు ఆయా వెబ్ సైట్ల‌ను క్ర‌మం త‌ప్ప‌కుండా సంద‌ర్శించి తాజా స‌మాచారం తెలుసుకుంటూ వుండాల‌ని ఎన్ టిఏ సూచించింది. అంతే కాదు ప‌రీక్ష‌ల అభ్య‌ర్థులు  
 8287471852, 8178359845, 9650173668, 9599676953, 8882356803 నెంబ‌ర్ల‌ను సంప్ర‌దించ‌గ‌ల‌రు 

*****


(Release ID: 1619820) Visitor Counter : 234