మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 కారణంగా తలెత్తిన పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులతో వెబినార్ ద్వారా సంభాషించిన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి.

విద్యార్థుల భవిష్యత్తు కోసం నాణ్యమైన విద్య నందిచడానికి మానవ వనరుల మంత్రిత్వశాఖ కట్టుబడి ఉంది : శ్రీ రమేష్ పోఖ్రియాల్ 'నిషాంక్'.


అన్ని రాష్ట్రాలకు చెందిన విద్యాశాఖ మంత్రులతోనూ, విద్యాశాఖ కార్యదర్శులతోనూ 2020 ఏప్రిల్ 28వ తేదీన సంభాషించనున్న - కేంద్ర మానవనరుల అభివృద్ధి శాఖ మంత్రి.

Posted On: 27 APR 2020 6:46PM by PIB Hyderabad

కోవిడ్-19 కారణంగా తలెత్తిన పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులతో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ 'నిషాంక్' ఈ రోజు వెబినార్ ద్వారా సంభాషించారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తమ మంత్రిత్వశాఖ ద్వారా ఆన్ లైన్ విద్య కోసం చేపట్టిన వివిధ పధకాల గురించి విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేశారు.  విద్యార్థుల విద్యా కార్యకలాపాల కోసం తమ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఆలోచిస్తోందనీ, అందువల్లేదేశంలోని 33 కోట్ల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరే విధంగా అనేక పధకాలు అమలుచేస్తున్నామనీ ఆయన చెప్పారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు విద్యార్థుల తల్లిదండ్రులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుతం దేశం ఒక అసాధారణ పరిస్థితిని ఎదుర్కొంటోందని ఆయన పేర్కొన్నారు.  తల్లిదండ్రులకు ఇది మరింత క్లిష్టమైన సమయం, ఎందుకంటే, వారు తమ పిల్లల విద్య, భవిష్యత్తు కోసం ఆందోళన చెందుతూ ఉంటారువిద్యార్థులకు నాణ్యమైన విద్య, ఉజ్వలమైన భవిష్యత్తు అందించడానికి మానవ వనరుల మంత్రిత్వశాఖ పూర్తిగా కట్టుబడి ఉందని శ్రీ పోఖ్రియాల్ ఈ సందర్భంగా తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు.  ఈ దిశగా విద్యార్ధులందరి విద్యను ఈ-పాఠశాల; సార్వత్రిక విద్యావనరుల జాతీయ భాండాగారం (ఎన్.ఆర్.ఓ.ఈ.ఆర్.); స్వయం; డి.టీహెచ్. ఛానల్ స్వయం ప్రభ మొదలైన మాహ్యమాల ద్వారా కొనసాగించాలని తమ మంత్రిత్వశాఖ కృషి చేస్తోందని కేంద్రమంత్రి చెప్పారు

ఆన్ లైన్ విద్యా విధానాన్ని పటిష్ఠపరచడం కోసం దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకుల నుండి సూచనలు సలహాలు స్వీకరించడానికి వీలుగా భారత్ పథే ఆన్ లైన్ ప్రచారాన్ని ప్రారంభించినట్లు శ్రీ ఫోఖ్రియాల్ వెల్లడించారు. దాదాపు 10,000 సూచనలుసలహాలు స్వీకరించామనీ, త్వరలో మార్గదర్శకాలను రూపొందించనున్నామనీ, ఆయన చెప్పారు 

డాక్టర్ రమేష్ పోఖ్రియాల్ నిషాంక్ 

దేశవ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులతో సంభాషణ :

 

Dr Ramesh Pokhriyal Nishank@DrRPNishank

Interacting with parents from across India @PMOIndia @HMOIndia @HRDMinistry @mygovindia @PIB_India @MIB_India @DDNewslive https://www.pscp.tv/w/cXUx1zFlV0t5WFdhb014UUF8MXluSk9wd1Zaa1Z4UoRWlSog50vxUvs9wTuc76eo57EL2rfSJgKYSixdM3Js …

Dr.Ramesh Pokhriyal @DrRPNishank

Interacting with parents from across India #EducationMinisterGoesLive @PMOIndia @HMOIndia @HRDMinistry @mygovindia @PIB_India @MIB_India @DDNewslive

pscp.tv

1,759

1:08 PM - Apr 27, 2020

Twitter Ads info and privacy

2,609 people are talking about this

 

విద్యాదాన 2.0 గురించి కేంద్రమంత్రి విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేస్తూ, ఈ ప్రచారంలో భాగంగా,  వివిధ ఈ-లెర్నింగ్ విధానాలపై సిలబస్ ప్రకారం విషయ వివరణ అందించాలని దేశమలోని విద్యావేత్తలను, విద్య సంస్థలను కోరినట్లు చెప్పారు. దీని కింద అతి త్వరలో విద్యార్థులకు  తగినంతగా కోర్స్ మెటీరియల్ అందుబాటులోకి వస్తుందని శ్రీ పోఖ్రియాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా, తల్లిదండ్రులు తమ పిల్లలకు సంబంధించిన కొన్ని కీలకమైన సమస్యలపై ప్రశ్నలు అడిగారు.  ఎన్.సి.ఈ.ఆర్.టి. పాఠ్యపుస్తకాల లభ్యతపై అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెబుతూ, దాదాపు అన్ని రాష్ట్రాలకు ఎన్.సి.ఈ.ఆర్.టి. పుస్తకాలు పంపడం జరిగిందనీ, త్వరలో అవి విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. 

సి.బి.ఎస్.ఈ. 10, 12, తరగతుల మిగిలిన పరీక్షల నిర్వహణ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ, సాధ్యమైనంత తొందరలో 29 కోర్ సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు

లాక్ డౌన్ కారణంగా విద్యార్థులు కోల్పోయిన  విద్యాభ్యాస నష్టాన్ని ఎలా తగ్గిస్తారని అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెబుతూమంత్రిత్వశాఖకు చెందిన వివిధ ఆన్ లైన్ విద్యా విధానాల ద్వారా విద్యార్థుల విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తామని తెలిపారు.  తమ మంత్రిత్వ శాఖకు చెందిన దీక్షా వేదిక పైనే  80,000 కు పైగా కోర్సులు అందుబాటులో ఉన్నాయని ఆయన వెల్లడించారు. గత కొన్ని వారాలుగా దేశంలో ఈ-లెర్నింగ్ ప్రశంసనీయమైన పెరుగుదలను సాధించిందని కూడా అయన తెలిపారు

 

మరొక ప్రశ్నకు మంత్రి సమాధానం చెబుతూ, లాక్ డౌన్ కారణంగా విద్యను కోల్పోకుండా ఉండడానికి, ఎన్.సి.ఈ.ఆర్.టి. ఒక ప్రత్యామ్నాయ ప్రణాళికను తయారుచేసిందని చెప్పారు.  అదేవిధంగా ఒక కొత్త విద్యా కేలండర్ ను రూపొందిచవలసిందిగా సి.బి.ఎస్.ఈ. ని కూడా ఆదేశించారు.  వీటితో పాటు, విద్యార్థులకు సంబంధించి కెరీర్పరీక్షలు, ఇతర విషయాలపై అడిగిన అనేక ప్రశ్నలకు కేంద్ర మంత్రి సమాధానాలు చెప్పారు

ఈ వెబినార్ సందర్భంగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి మాట్లాడుతూ, తమ మంత్రిత్వశాఖ అన్ని రాష్ట్రాలకు చెందిన విద్యాశాఖ మంత్రులు, విద్యాశాఖ కార్యదర్శులతో నిరంతరం సంప్రదిస్తున్నట్లు చెప్పారు. వారితో రేపు అనగా 2020 ఏప్రిల్ 28వ తేదీన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తాను సమావేశమవుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రస్తుత సమయంలో విద్యార్థులు తమ విద్యాభ్యాసాన్ని కొనసాగించడానికి వీలుగా మధ్యాహ్న భోజన పధకం, సమగ్ర శిక్షణ తో పట్టు కోవిడ్-19 నియంత్రణపై కూడా వారితో చర్చించనున్నట్లు కేంద్ర మంత్రి తెలియజేసారు. 

ఈ వెబినార్ లో పాల్గొన్నందుకు శ్రీ పోఖ్రియాల్ విద్యార్థుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే వారం తానూ వెబినార్ ద్వారా విద్యార్థులతో ముచ్చటించనున్నట్లు తెలియజేసారు.   ప్రస్తుత లాక్ డౌన్ సమయంలో నెలకొన్న క్లిష్ట పరిస్థితులను ఓపికగా భరిస్తూ, సామాజిక దూరం వంటి మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తున్నందుకు విద్యార్థుల తల్లిదండ్రులందరికీ వెబినార్ ముగించే ముందు కేంద్ర మంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. 

******



(Release ID: 1618835) Visitor Counter : 127