ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 అప్‌డేట్స్
Posted On:
27 APR 2020 6:25PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. వైరస్ సంక్రమణ గొలుసును తెంపేయాలన్నారు. ముఖ్యంగా రెడ్ జోన్లు, ఆరంజ్ జోన్లు ఉన్న ప్రాంతాలలో దీనిని గట్టిగా అమలు చేయాలన్నారు. హాట్‌స్పాట్‌లు అంటే రెడ్ జోన్లకు సంబంధించి ప్రభుత్వ మార్గదర్శకాలను అమలు చేయడంలో రాష్ట్రాలు ,కేంద్రపాలిత ప్రాంతాల ప్రాధాన్యతను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కృషి రెడ్ జోన్లను ఆరంజ్ జోన్లుగా ఆ తర్వాత గ్రీన్ జోన్లుగా మార్చే విధంగా ఉండాలన్నారు. కరోనా వైరస్ వ్యాధితో ఎలాంటి మచ్చ ఉండకూడదని, ఆరోగ్య సేవలు అందించే సంస్థలు కోవిడ్ -19 తోపాటు ఇతర ఆరోగ్య సేవలు కూడా అందించాలన్నారు. సంప్రదాయ వైద్య విధానాలు తమ పనిని తాము కొనసాగించాలన్నారు.
గతంలో కరోనా కేసులు ఉన్న దేశంలోని 16 జిల్లాలు గత 28 రోజులలో ఎలాంటి తాజా కేసులలేవని ప్రధానమంత్రి చెప్పారు. ఈ జాబితాకు మరో 3 జిల్లాలు చేరాయని చెప్పారు.(24 ఏప్రిల్ తో కలుపుకుని)
మహారాష్ట్రలోని గోండియా
కర్ణాటకలోని దేవన్‌గెరే
బీహార్‌లోని లఖి సరాయి
రెండు జిల్లాలకు తాజా కేసులు వచ్చాయి. గత 28 రోజులలో ఈ జిల్లాలలో ఎలాంటి కేసులు అక్కడ లేవు. ఇవి ఉత్తరప్రదేశ్‌లోని ఫిలిబిత్, పంజాబ్ లోని షాహీద్ భగత్ సింగ్ నగర్. ఇంకా 25 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 85 జిల్లాలు గత 14 రోజులలో ఎలాంటి కేసులు నమోదు చేయలేదని ప్రధానమంత్రి చెప్పారు.
ఈ రోజు న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో, భారత ప్రభుత్వానికి చెందిన సాధికార గ్రూప్ 5 (ఇజి 5), కోవిడ్ -19 వ్యాప్తి చెందినప్పటి నుండి వైరస్ విసిరిన సవాలును ఎదుర్కోవడానికి , దాని వ్యాప్తిని అరికట్టడానికి తీసుకున్న చర్యలను దేశంలో సరఫరా వ్యవస్త , రవాణా ఏర్పాట్లకు సంబంధించిన తాజా సమాచారాన్ని వెల్లడించింది. మీడియాతో మాట్లాడుతూ, తాగునీరు పారిశుద్ధ్య శాఖ కార్యదర్శి, సాధికారగ్రూప్ -5 కన్వీనర్ శ్రీ పరమేశ్వరన్ అయ్యర్, నాలుగు క్లిష్టమైన రంగాలైన వ్యవసాయం, తయారీ, లాజిస్టిక్స్ , నిరుపేదలకు ఆహారం సమకూర్చడంలో సవాళ్లను పరిష్కరించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తెలియజేశారు.
ఆహారం, మందులను తరలించే ట్రక్కుల శాతం మార్చి 30 న 46శాతం నుండి 2020 ఏప్రిల్ 25 న 76 శాతానికి పెరిగిందని ఆయన చెప్పారు. అదే కాలంలో, రైల్వే రేక్‌ల శాతం 67 శాతం నుండి 76 శాతానికి పెరిగిందన్నారు,పోర్టులలో కార్యకలాపాలు 70 శాతంనుంచి 87 శాతానికి పెరిగాయి. ప్రధాన మాండిల కార్యకలాపాలు 61 శాతం నుంచి 79 శాతానికి పెరిగాయి. ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు పరిశ్రమలు ప్రతిరోజూ 1.5 కోట్లకు పైగా ప్రజలకు వండిన భోజనం అందిస్తున్నాయి.
సాధికారగ్రూప్ -5 పాత్ర గురించి మాట్లాడుతూ ఆయర, అవసరమైన వస్తువుల సరఫరా వ్యవస్థలలో అవరోధాలకు కారణంగా నిలుస్తున్న ప్రస్తుత విధానాలను సులభతరం చేయడంపై ప్రభుత్వం దృష్టిపెడుతున్నదన్నారు. క్షేత్రస్థాయిలో గల నిర్ధిష్ట అడ్డంకులను తొలగించడం, ముఖ్య సూచికలను గమనిస్తుండడం, సరఫరా వ్యవస్థలోని వారికోసం ఉత్తమ పద్ధతులను వ్యాప్తి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని అన్నారు. ఇందుకోసం వారు దీనితో సంబంధం ఉన్న విభాగాలైన హోంమంత్రిత్వశాఖతోపాటు, పరిశ్రమ కు చెందిన యఇతర కీలక భాగస్వాములైన ఆహారం, ఫార్మా, రవాణా రంగాలు, టోకు వర్తకులు , చిల్లర వర్తకులు, మండీల వంటి వారితో కలసిపనిచేయనున్నట్టు తెలిపారు.
ప్రస్తుతానికి దేశంలో 22.1 శాతం రికవరీ రేటుతో 6184 మందికి కరోనా వ్యాధినయమైంది. నిన్నటినుంచి 1396 కొత్త కేసులు నమోదయ్యాయి. దీనితో కోవిడ్ -19 కు సంబంధించి మొత్తం నిర్దారణ అయిన పాజిటివ్ కేసుల పంఖ్య మన దేశంలో 27,892 కు చేరింది. గడచిన 24 గంటలలో , 48 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తం మరణాల సంఖ్య 872 కుచేరింది
కోవిడ్ -19 కి సంబంధించి తాజా , అధీకృత సమాచారం , దీనికి సంబంధించిన సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, ఇతర సూచనల కోసం క్రమం తప్పకుండా గమనించండి : https://www.mohfw.gov.in/.
కోవిడ్ -19 కి సంబంధించి సాంకేతిక అంశాలపై తమ ప్రశ్నలను technicalquery.covid19[at]gov[dot]in ఈమెయిల్‌కు పంపవచ్చు. ఇతర ప్రశ్నలను ncov2019[at]gov[dot]in .కు పంపవచ్చు.
కోవిడ్ -19పై ఏవైనా ప్రశ్నలకు సమాధానాల కోసం కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్‌లైన్ నెంబర్ : +91-11-23978046 లేదా 1075 (టోల్ ఫ్రీ) కు ఫోన్ చేయవచ్చు. కోవిడ్ -19 పై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల హెల్ప్‌లైన్ ల జాబితా కోసం కింది లింక్‌ను గమనించవచ్చు.
https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf .
(Release ID: 1618780)
Visitor Counter : 276
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam