ప్రధాన మంత్రి కార్యాలయం
మన్ కీ బాత్ 2.0, లో 11వ ఎపిసోడ్ లో ప్రసంగించిన ప్రధానమంత్రి
కరోనాపై భారత్ పోరాటం ప్రజలు నడుపుతున్నపోరాటం: ప‌్రధానమంత్రి
బహిరంగ ప్రదేశాలలో ఉమ్మివేసే అలవాటు దూరం చేయాలని ప్రధానమంత్రి పిలుపు
Posted On:
26 APR 2020 4:49PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ మన్‌కీ బాత్ 2.0,కు చెందిన 11 వ ఎడిషన్ ను ఉద్దేశించి మాట్లాడుతూ,,
కరోనాపై భారతదేశం సాగిస్తున్న పోరాటం ప్రజలు నడిపిస్తున్న పోరాటమని, ప్రజలతో కలసి ప్రభుత్వం, పాలనాయంత్రాంగం ఈ మహమ్మారిపై పోరాటం సాగిస్తున్నదని అన్నారు. ఈ పోరాటంలో ప్రతి ఒక్క పౌరుడూ ఒక సైనికుడని, వారు ఈ పోరాటాన్ని ముందుండి నడిపిస్తున్నారని అన్నారు. ప్రతి ప్రాంతంలో ప్రజలు ఒకరికొకరు సహాయపడేందుకు ముందుకు వచ్చారని, అంటూ ఈ ప్రజా సంకల్పాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు.
అన్నార్తులకు ఆహారం అందించడం, రేషన్ సరుకులు అందించడం, లాక్ డౌన్ నిబంధనలను పాటించడం, ఆస్పత్రులలో సదుపాయాలు కల్పించడం, దేశీయంగా వైద్య పరికరాలను తయారు చేయడం వంటి వాటిలో దేశం యావత్తూ కలసికట్టుగా ముందుకు పోతున్నదని ప్రధానమంత్రి అన్నారు.
కరోనా మన నగరానికి, గ్రామానికి, మన వీధికి లేదా మన కార్యాలయానికి ఇంకా రాలేదనో లేక ఇది ఇప్పట్లో మన దగ్గరకు రాదనో మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఉండవద్దని ప్రధానమంత్రి ప్రజలను కోరారు.
దో గజ్ దూరి హై జరూరీ, అనేది మన మంత్రంగా ఉండాలని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. ప్రజలు రెండు గజాల దూరం పాటించాలని, ఆ రకంగా తమను తాము ఆరోగ్యంగా ఉంచుకోవాలని ప్రధాని సూచించారు. మన అత్యుత్సాహంలో ఎక్కడా స్థానికంగా కానీ లేదా మరెక్కడైనా కానీ ఎలాంటి నిర్లక్ష్యం పనికిరాదని అన్నారు. ప్రజలు ఎల్లప్పుడూ దీనిని గుర్తుపెట్టుకోవాలన్నారు.
ఎన్నో సానుకూల మార్పులు సహజసిద్దంగానే పని సంస్కృతిలో వచ్చి చేరుతున్నాయని ప్రధానమంత్రి అన్నారు. బాగా కనిపిస్తున్న మార్పు మాస్క్ ధరించడం, ముఖాన్ని కప్పి ఉంచుకోవడం. కరోనా కారణంగా మారిన పరిస్థితులలో మాస్క్‌లు ప్రజల జీవితంలో భాగమయ్యాయి. ఇకనుంచి మాస్క్ లు నాగరిక సమాజానికి చిహ్నంగా నిలుస్తాయని ఆయన అన్నారు. ప్రజలు వ్యాధుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి, ఇతరులను రక్షించడానికి వారు మాస్క్ ధరించాల్సి ఉంటుందన్నారు. ప్రజలు గమ్‌చా లేదా తేలిక పాటి టవల్‌తో అయినా ముఖానికి అడ్డుపెట్టుకోవచ్చని ఆయన సూచించారు.
ఇక, సమాజంలో వచ్చిన మరో అవగాహన గురించి చెబుతూ ప్రధానమంత్రి, బహిరంగ ప్రదేశాలలో ఉమ్మివేయడం వల్ల జరిగే నష్టం ఏమిటో ప్రజలు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారని అన్నారు.
ఎక్కడపడితే అక్కడ ఉమ్మి వేయవచ్చని భావించే వారి దురలవాటు ఇప్పడు అటు పరిశుభ్రతకు ఇటు ప్రజారోగ్యానికి పెను సవాలుగా మారిందని ఆయన అన్నారు. ఎక్కడపడితే అక్కడ ఉమ్మివేసే అలవాటును దూరం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఇది మౌలికంగా పరిశుభ్రత స్థాయి పెరగడానికి దోహదపడడమే కాక, కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకుంటుందని చెప్పారు.
ప్రస్తుత సంక్షోభ సమయలో ప్రజలు ప్రదర్శించిన సంకల్పం ఒక నూతన భారతావని మార్పునకు నాందిగా మారిందని ప్రధానమంత్రి అన్నారు. దేశంలోని వ్యాపారసంస్జలు, కార్యాలయాలు, విద్యాసంస్థలు వైద్యరంగం నూతన కార్యాచరణకు సంబంధించిన మార్పుల దిశగా ముందుకుసాగుతున్నాయన్నారు. సాంకేతికంగా చూస్తే, నవకల్పనలకు దోహదపడే ప్రతి ఒక్కరూ ప్రస్తుత పరిస్థితులలో ఏదో ఒక ఆలోచనతో ముందుకు వస్తున్నారని ఆయన చెప్పారు.
సహాయకార్యక్రమాలు శరవేగంగా చేపట్టడంలో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు , ప్రతి ఒక్క విభాగం, సంస్థ కలసిమెలసి పనిచేస్తున్నాయన్నారు. విమానయాన రంగంలోని వారు, రైల్వే ఉద్యోగులు దేశప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు తొలగించేందుకు రాత్రింబగళ్ళు పనిచేస్తున్నాయన్నారు. స్వల్పవ్యవధిలో మందులను దేశంలోని నలుమూలలకు చేరవేయడానికి లైఫ్‌లైన్ ఉడాన్ ప్రత్యేక ప్రచారం వీలు కల్పించిందని ప్రధాని వివవరించారు.లైఫ్ లైన్ ఉడాన్ కింద విమానాలు మూడు లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించి , 500 టన్నుల ఔషధ సరఫరాలను దేశంలోని సుదూర ప్రాంతాలకు సైతం అందించిందన్నారు.
లాక్ డౌన్ సమయంలో రైల్వేలు అలుపెరగకుండా ఎలా పనిచేస్తున్నాయో ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. రైల్వేలు దేశంలోని సామాన్య ప్రజలు నిత్యావసర సరకుల కొరతతో ఇబ్బందులు పడే పరిస్థితి లేకుండా చేశాయన్నారు. భారతీయ రైల్వేలు సుమారు 60 రూట్లలో 100 పార్శిల్ రైళ్లను నడుపుతున్నాయి. పోస్టల్ శాఖకు చెందిన వారు, మందుల సరఫరాలో కీలకపాత్ర పోషిస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే వీరందరూ కూడా కరోనాపై పోరాటంచేస్తున్న యుద్ధవీరులే అన్నారు. పేదలు, అవసరం ఉన్నవారికి సహాయం అందించడంలో ప్రభుత్వం సంకల్పాన్ని ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి,
ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద నగదును పేదల ఖాతాలలోకి నేరుగా జమచేసినట్టు చెప్పారు. ఉచిత గ్యాస్ సిలిండర్లు, మూడు నెలల వరకు రేషన్‌ను పేదలకు అందించడం జరుగుతోందని చెప్పారు. ప్రభుత్వ డిపార్టమెంట్‌లు, బ్యాంకింగ్ రంగానికి చెందిన వారు, ఒక టీమ్‌గా కలసికట్టుగా పనిచేస్తుండడం పట్ల ప్రధానమంత్రి వారిని అభినందించారు.
ప్రస్తుత కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో కీలక సానుకూల పాత్ర పోషిస్తున్నందుకు ప్రధానమంత్రి రాష్ట్రాలను అభినందించారు. కరోనాపై పోరాటంలో రాష్ట్రప్రభుత్వాలు, స్థానిక పాలనాయంత్రాంగాలు చేపట్టిన బాధ్యత కీలకమైనదని అన్నారు. వారి శ్రమ ప్రశంసించదగినదని ప్రధానమంత్రి అన్నారు. దేశవ్యాప్తంగా వైద్యసేవలు అందిస్తున్న డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు, దేశాన్ని కరోనారహితంగా మార్చడానికి నిరంతరం శ్రమిస్తున్న ఇలాంటి వారందరికీ ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. వీరి రక్షణకు మనం పూచీపడాలని, ఈ దిశగా ఇటీవలే ఆర్డినెన్స్ జారీ అయిందని ప్రధానమంత్రి తెలిపారు. కరోనాపైపోరాడుతున్న వీరిని వేధించినా, వారిని గాయపరిచినా, వారిపై హింసకు పాల్పడినా కఠిన శిక్షలను ఈ ఆర్డినెన్స్ తీసుకువచ్చిందని అన్నారు.
.ఇంటిపనులు చేసే వారి ఉదాహరణలు ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, మన అవసరాలు తీర్చేసాధారణ వర్కర్లు, దగ్గరలో ఉన్న షాపులో పనిచేసే వారు, నిత్యావసరాలు అందించేవారు, మార్కెట్లలో పనిచేసే కార్మికులు, పొరుగున ఉన్న ఆటోరిక్షా డ్రైవర్లు, ఇలా వీరు లేకుంటే తమ జీవితం ఎంత కష్టంగా ఉంటుందో ప్రజలు ఇప్పడు తెలుసుకోగలిగారన్నారు. ప్రజలు వారిని గుర్తచేసుకోవడమే కాదు, వారికి అవసరమైనవి అందించి సహాయపడుతున్నారన్నారు. వీరి గురించి ఎంతో గౌరవభావంతో సోషల్ మీడియాలో కూడా రాస్తున్నారన్నారు. డాక్టర్లు, పరిశుభ్రతా కార్యకలాపాలు చేపట్టే సిబ్బంది, ఇతర ఇలాంటి సేవలు అందించే వారు, పోలీసు సంస్జలకు చెందినవారు ఇలా వీరందరిని సామాన్య ప్రజలు ఇప్పుడు నూతన దృష్టితో చూస్తున్నారన్నారు. ఇవాళ పోలీసుల పేదలకు , అవసరమైన వారికి ఆహారం ,మందులు అందేట్టు చూస్తున్నారని ఆయన అన్నారు.సాధారణ ప్రజలు భావోద్వేగంతో పోలీసులతో కనెక్ట్ అవుతున్న సమయం ఇది అని ఆయన అన్నారు.
ప్రభుత్వం covidwarriors.gov.in డిజిటల్ ప్లాట్‌ఫాంను తీసుకువచ్చిందని శ్రీ నరేంద్ర మోదీ చెప్పారు. సామాజిక సంస్థల వలంటీర్లు , పౌర సమాజం ప్రతినిధులు, స్థానిక పాలనాయంత్రాంగానికి సంబంధించిన వారిని ఈ ప్లాట్ ఫాం ద్వారా అనుసంధానం చేసినట్టు ప్రధానమంత్రి చెప్పారు.
స్వల్ప వ్యవధిలోనే, డాక్టర్లు, నర్సులు, ఆశా-ఎ.ఎన్.ఎం వర్కర్లు, ఎన్‌సిసి, ఎన్.ఎస్.ఎస్ కేడెట్లు, వివిధ రంగాలకు చెందిన ప్రొఫెషనల్స్ సుమారు 1.25 కోట్ల మంది ఈ పోర్టల్‌లో భాగస్వాములయ్యారని చెప్పారు. ఈ కోవిడ్ వారియర్లు,స్థానికంగా సంక్షోభనియంత్రణ ప్రణాళికలు రూపొందించడం, వాటిని అమలు చేయడంలో ఎంతో సహయపడుతున్నారన్నారు. దేశానికి సేవచేయడానికి కోవిడ్ వారియర్గా ప్రజలు covidwarriors.gov.in లో జాయిన్ కావాలని ప్రజలను ప్రధానమంత్రి కోరారు.
ప్రస్తుత సంక్షోభ సమయంలో, భారతదేశం తన మానవతా బాధ్యతకు అనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా అవసరమైన వారికి వైద్య సామాగ్రిని అందించినట్లు ప్రధాని ప్రముఖంగా ప్రస్తావించారు.భారతదేశానికి చెందిన ఆయుర్వేదం ,యోగా ల ప్రాముఖ్యతపైన , రోగనిరోధక శక్తిని పెంచడంలో వీటి పాత్ర పైన ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని ఆయన అన్నారు.
కరోనాకు సంబంధించి రోగనిరోధక శక్తిని పెంచడానికి ఆయుష్ మంత్రిత్వశాఖ ప్రోటోకాల్‌ను అనుసరించాలని శ్రీ నరేంద్ర మోదీ కోరారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ జారీ చేసిన గోరువెచ్చని నీరు వాడడం, డికాక్షన్ సేవించడం వంటి ఇతర మార్గదర్శకాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన అన్నారు
ప్రధానమంత్రి మాట్లాడుతూ, మన స్వంత బలాలు అద్భుతమైన మన సంప్రదాయాలను అంగీకరించడానికి సిద్ధంగా లేకపోవడం దురదృష్టకరమన్నారు. మన సంప్రదాయ సూత్రాలను శాస్త్రీయ భాషలో వివరించడానికి యువ తరం పరిశోధనలు చేపట్టవలసిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ప్రపంచం యోగాను సంతోషంగా అంగీకరించినట్లే, వేలాది సంవత్సరాల ఆయుర్వేద సూత్రాలను కూడా ప్రపంచం ఖచ్చితంగా అంగీకరిస్తుందని ఆయన అన్నారు.
పవిత్ర అక్షయతృతీయ పర్వదినాన పర్యావరణం, అడవులు, నదులు మొత్తం పర్యావరణ వ్యవస్థ పరిరక్షణ గురించి ఆలోచించాలని ప్రధాని పిలుపునిచ్చారు. ప్రజలు పునరుత్పాదక వనరులు కొనసాగాలని కోరుకుంటే , వారు భూమి సమృద్ధిగా ఉండేలా చూడాలని ప్రధాని అన్నారు. అక్షయ-తృతీయ పండుగ దానధర్మాల బలాన్ని, సంక్షోభ సమయంలో ఇచ్చే శక్తిని తెలుసుకునే అవకాశాన్ని కల్పించే సందర్భమని ఆయన అన్నారు. మొదటి తీర్థంకరుడైన భగవాన్ రిషభదేవ్ జీవితంలో ఈ రోజు ఒక ముఖ్యమైన రోజు అని ప్రధానమంత్రి గుర్తుచేసుకున్నారు. ఇది బసవేశ్వరుడి జయంతి కూడా అని ప్రధానమంత్రి గుర్తు చేశారు. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైందని, ఈద్‌కు ముందు ప్రపంచం కరోనా నుండి విముక్తి పొందాలని ఇంతకు మున్నెన్నటి కంటే ఎక్కువగా ప్రార్థించాలని, తద్వారా ప్రజలు ఉత్సాహంతో ఈద్ జరుపుకోవచ్చని ఆయన అన్నారు.
వీధులు, మార్కెట్లు మొహల్లాలు లేదా కాలనీలలో భౌతిక దూరం నియమాలను పాటించడం చాలా ముఖ్యం కనుక రంజాన్ సందర్భంగా స్థానిక పాలనాయంత్రాంగం మార్గదర్శకాలను పాటించాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలను కోరారు. వ్యక్తికి వ్యక్తికి మధ్య రెండు గజాల దూరం పాటించడం గురించి , ఇళ్ళ నుండి బయటకు వెళ్ళకుండా ఉండడం గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్న కమ్యూనిటీ నాయకులందరికీ ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా, భారతదేశం సహా, అన్ని దేశాలలో పండుగలను జరుపుకునే విధానాన్ని , వారి ఆచార విధానాలను కరోనా మార్చిందని, ప్రధాని అన్నారు.
(Release ID: 1618517)
Visitor Counter : 236
Read this release in:
Marathi
,
Assamese
,
Punjabi
,
Kannada
,
English
,
Urdu
,
Hindi
,
Manipuri
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam