ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
                
                
                
                
                
                
                    
                    
                        కోవిడ్-19 పై తాజా సమాచారం 
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                26 APR 2020 5:13PM by PIB Hyderabad
                
                
                
                
                
                
                దేశంలో కోవిడ్-19 నివారణ, నియంత్రణ మరియు నిర్వహణ కోసం భారత ప్రభుత్వం వివిధ రాష్ట్రాలు  / కేంద్రపాలిత ప్రాంతాలతో కలిసి క్రియాశీల విధానం ద్వారా అనేక చర్యలు చేపడుతోంది.   వీటిని క్రమం తప్పకుండా ఉన్నత స్థాయిలో పర్యవేక్షిస్తోంది.   
కోవిడ్-19 ను అధిగమించేందుకు తీసుకుంటున్న చర్యల గురించి తెలుసుకునేందుకు కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ ఈ రోజు అఖిల భారత వైద్య విజ్ఞానాల సంస్థ (ఎయిమ్స్) కు చెందిన ట్రామా ను సెంటర్ సందర్శించారు.  ఈ పర్యటన సందర్భంగా, కోవిడ్-19 రోగుల కోసం ఐసొలేషన్ సదుపాయాలు ఉన్న అత్యాధునిక భవనంలోని వివిధ వార్డులను సందర్శించారు. ఈ సందర్భంగా, రోగుల వద్ద రోబో తో ఏర్పాటు చేసిన ఫోన్ కు వీడియో కాల్ చేసి కోవిడ్-19 సోకిన రోగులతో మాట్లాడి, వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు.  ఎయిమ్స్ లో అందుబాటులో ఉన్న సదుపాయాల గురించి వారి స్పందన తెలుసుకున్నారు. తద్వారా వాటిని మరింత మెరుగుపరచటానికి అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. 
సవివరమైన సమీక్ష అనంతరం, వివిధ యూనిట్లలో పనితీరు పట్ల డాక్టర్ హర్ష వర్ధన్ సంతృప్తి వ్యక్తం చేశారు.   డిజిటల్ విధానాలు, వీడియో, వాయిస్ కాలింగ్ వంటి సాంకేతిక విధానాలను వినియోగించి, కోవిడ్-19 సోకిన, సోకే అవకాశం ఉన్నట్లు అనుమానం ఉన్న రోగులను 24 గంటలూ పర్యవేక్షిస్తూ, వారి శ్రేయస్సు కోసం ఎయిమ్స్ చేస్తున్న సేవలను ఆయన ప్రశంసించారు.  కోవిడ్-19 వ్యాప్తి ని సమర్ధవంతంగా నిరోధించేందుకు రెండవ దశ లాక్ డౌన్ ను చిత్తశుద్ధితో  తప్పనిసరిగా అమలుచేయాలని డాక్టర్ హర్ష వర్ధన్ ఈ సందర్భంగా దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.  వ్యాప్తి తీవ్రంగా ఉన్న హాట్ స్పాట్ జిల్లాలు (హెచ్.ఎస్.డి.), తీవ్రత లేని నాన్ హాట్ స్పాట్ జిల్లాలు (ఎన్.హెచ్.ఎస్.డి.) గా మారుతున్నందువల్ల భారతదేశంలో పరిస్థితి మెరుగౌతోందని ఆయన పేర్కొన్నారు. 
కోవిడ్-19 కోసం సంసిద్ధతపై రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాల ప్రధాన కార్యదర్శులు, డి.జి.పి. లతో క్యాబినెట్ కార్యదర్శి ఈ రోజు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో సవివరంగా సమీక్షించారు.   ఎక్కువగా కేసులున్న రాష్ట్రాలు లాక్ డౌన్ చర్యలు, కంటైన్మెంట్ వ్యూహం సమర్ధవంతంగా అమలుచేయడంపై దృష్టి పెట్టాలని ఆయన నొక్కి చెప్పారు. ఐసోలేషన్ పథకాలు, ఐ.సి.యు. పడకలు, వెంటిలేటర్లు వంటి వైద్య పరమైన మౌలికసదుపాయాల లభ్యత తగినంతగా ఉండే విధంగా కూడా రాష్ట్రాలు దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. 
ఇంతవరకు, 21.90 శాతం రికవరీ రేట్ తో, 5,804 మంది చికిత్స అనంతరం కోలుకుని ఆసుపత్రుల నుండి విడుదల అయ్యారు.  భారతదేశంలో ఇంతవరకు, 26,496 కేసులను కోవిడ్-19 పాజిటివ్ గా ధృవీకరించారు.  824మరణాలు నమోదయ్యాయి.    
కోవిడ్-19 కు సంబంధించిన సాంకేతిక సమస్యలకు, మార్గదర్శకాలు, సలహాలు, సూచనలపై వాస్తవ, తాజా సమాచారం కోసం దయచేసి క్రమం తప్పకుండా  ఈ వెబ్ సైట్ ని చూడండి : 
: https://www.mohfw.gov.in/.
కోవిడ్-19 కు సంబంధించిన సాంకేతిక సమస్యలకు పరిష్కారాలను దిగువ పేర్కొన్న ఈ మెయిల్ ను సంప్రదించడం  ద్వారా తెలుసుకోవచ్చు : 
 technicalquery.covid19[at]gov[dot]in   
ఇతర సందేహాలు, అనుమానాలకు పరిష్కారాలను దిగువ పేర్కొన్న ఈ మెయిల్ ను సంప్రదించడం  ద్వారా తెలుసుకోవచ్చు:
            ncov2019[at]gov[dot]in .
కోవిడ్-19 పై ఎటువంటి అనుమానాలు, సమస్యలు, సమాచారానికైనా, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన ఉచిత  హెల్ప్ లైన్ నెంబర్ :    +91-11-23978046  లేదా  1075 (టోల్ ఫ్రీ) ని సంప్రదించవచ్చు. 
వివిధ రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల కు చెందిన కోవిడ్-19 హెల్ప్ లైన్ నెంబర్ల జాబితా కోసం ఈ వెబ్ సైట్ ని చూడండి : 
 https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf .
*****
                
                
                
                
                
                (Release ID: 1618485)
                Visitor Counter : 214
                
                
                
                    
                
                
                    
                
                Read this release in: 
                
                        
                        
                            English 
                    
                        ,
                    
                        
                        
                            Urdu 
                    
                        ,
                    
                        
                        
                            हिन्दी 
                    
                        ,
                    
                        
                        
                            Marathi 
                    
                        ,
                    
                        
                        
                            Assamese 
                    
                        ,
                    
                        
                        
                            Manipuri 
                    
                        ,
                    
                        
                        
                            Bengali 
                    
                        ,
                    
                        
                        
                            Punjabi 
                    
                        ,
                    
                        
                        
                            Gujarati 
                    
                        ,
                    
                        
                        
                            Odia 
                    
                        ,
                    
                        
                        
                            Tamil 
                    
                        ,
                    
                        
                        
                            Kannada 
                    
                        ,
                    
                        
                        
                            Malayalam