హోం మంత్రిత్వ శాఖ
ఆరోగ్య పరిరక్షణ నిపుణులు, వైద్య సిబ్బంది, క్షేత్రస్థాయిలో పనిచేసే కార్మికులపై హింసను నిరోధించడానికి తగినంత భద్రత కల్పించాలి : కేంద్ర హోంమంత్రి.
కోవిడ్-19 రోగులకు సేవలు అందిస్తూ ప్రాణాలు కోల్పోయిన, క్షేత్రస్థాయిలో పనిచేసే ఆరోగ్య పరిరక్షణ కార్మికులు, వైద్య నిపుణుల అంత్యక్రియలను అడ్డుకునే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి : రాష్ట్రాలకు ఎమ్.హెచ్.ఏ. ఆదేశాలు.
Posted On:
22 APR 2020 5:24PM by PIB Hyderabad
ఆరోగ్య పరిరక్షణ నిపుణులు, వైద్య సిబ్బంది, క్షేత్రస్థాయిలో పనిచేసే కార్మికులపై హింసను నిరోధించడానికి తగినంత భద్రత కల్పించాలని, కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా ఆదేశాల మేరకు, కేంద్ర దేశీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎమ్.హెచ్.ఏ) అన్ని రాష్ట్రాలను / కేంద్ర పాలిట ప్రాంతాలను ఈ రోజు ఆదేశించింది. కోవిడ్-19 రోగులకు సేవలు అందిస్తూ ప్రాణాలు కోల్పోయిన, క్షేత్రస్థాయిలో పనిచేసే ఆరోగ్య పరిరక్షణ కార్మికులు, వైద్య నిపుణుల అంత్యక్రియలను అడ్డుకునే వారిపై తప్పక కఠిన చర్యలు తీసుకోవాలి.
ఆరోగ్య పరిరక్షణ నిపుణులు, వైద్య సిబ్బంది మరియు క్షేత్ర స్థాయి కార్మికులకు వారి రక్షణ, భద్రత కోసం చర్యలను ముమ్మరం చేయడం ద్వారా తగిన రక్షణ కల్పించాలని కోరుతూ ఎమ్.హెచ్.ఏ. 24.03.2020, 04.04.2020 మరియు 11.04.2020 తేదీలలో అన్ని రాష్ట్రాలు, కేంద్రప్రయాలిట ప్రాంతాలకు సూచనలు జారీ చేసింది. పలుమార్లు హెచ్చరించినప్పటికీ, ఆరోగ్య పరిరక్షణ నిపుణులు, క్షేత్రస్థాయి కార్మికులపై హింసాత్మక సంఘటనలకు సంబంధించిన వార్తలు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి అందుతూనే ఉన్నాయి. ఇటువంటి సమయంలో, ఆరోగ్య పరిరక్షణ నిపుణులపై ఏ ఒక్క హింసాత్మక సంఘటన జరిగినా, అది మొత్తం ఆరోగ్యరక్షణ సమాజంపై అభద్రతా భావాన్ని కలిగిస్తుంది.
ఆసుపత్రుల్లోనూ, కోవిడ్-19 రోగులను గుర్తించిన ప్రదేశాల్లోనూ, కోవిడ్-19 అనుమానిత రోగులు ఉన్న ప్రదేశాల్లోనూ, క్వారంటైన్, ఐసోలేషన్ ప్రదేశాల్లోనూ విధులు నిర్వహిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందికి అవసరమైన పోలీసు రక్షణ కల్పించాలని ఆదేశిస్తూ, భారత సుప్రీం కోర్టు 08-04-2020 తేదీన భారత ప్రభుత్వాన్ని, అన్ని రాష్ట్రాలు / కేంద్ర పాలితప్రాంతాలను, సంబంధిత పోలీసు అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా, రోగ లక్షణాలను గుర్తించడంకోసం పరీక్షలు నిర్వహించడానికి వివిధ ప్రాంతాలకు వెళ్లే వైద్యులు, ఇతర వైద్య సిబ్బందికి అవసరమైన పోలీసు భద్రతా కల్పించాలని కూడా న్యాయస్థానం ఆదేశించింది.
ప్రభుత్వ ఆరోగ్య అధికారులు, ఇతర ఆరోగ్య నిపుణులు, సంబంధిత వ్యక్తులు, విపత్తు యాజమాన్య చట్టం, 2005 కింద అధీకృత వ్యక్తులు తమ చట్ట బద్దమైన విధులు నిర్వహిస్తున్న సమయంలో వారిని అడ్డుకునే వారిపై సుప్రీం కోర్టు ఆదేశాలకు, విపత్తు యాజమాన్య చట్టం, 2005 నిబంధనలకు అనుగుణంగా అన్ని రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలు మరియు జిల్లా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్.హెచ్.ఏ. కోరింది.
వైద్య నిపుణుల విధి నిర్వహణలో భద్రత విషయమై ఏదైనా సమస్య ఏర్పడితే పరిష్కరించడానికి 24 X 7 అందుబాటులో ఉండే విధంగా రాష్ట్ర స్థాయి / కేంద్రపాలిత ప్రాంత స్థాయి తో పాటు జిల్లా స్థాయి నోడల్ అధికారిని నియమించాలని మా.హెచ్.ఏ. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు / కేంద్రపాలితప్రాంతాల పాలనా యంత్రాంగాలను కోరింది. ఎక్కడైనా హింసాత్మక సంఘటన జరిగితే, వెంటనే వారు కఠిన చర్య తీసుకోవాలని కూడా కోరింది.
దీనికి అదనంగా, ఈ విషయంలో చేపట్టిన ముందు జాగ్రత్త చర్యలు, నోడల్ అధికారుల నియామకం మొదలైన విషయాల గురించి వైద్య రంగంలోని వ్యక్తులకు, స్థానిక ఐ.ఎమ్.ఏ. స్థానిక శాఖలకు, ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో విశ్వాసం కూడగట్టుకోడానికి వీలుగా ప్రజలకు తెలియజేయాలని అన్ని రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాలను కోరింది.
రాష్ట్రాలకు / కేంద్రపాలితప్రాంతాలకు జారీ చేసిన అధికారిక ప్రకటన కోసం ఇక్కడ చూడండి.
Click here to see the Official Communication to States/UTs
*****
(Release ID: 1617244)
Visitor Counter : 333
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam