ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం

ఆర్థిక వ్యవహారాల కు సంబంధించి ఏర్పాటు చేసిన మంత్రివర్గ సంఘం (సిసిఇఎ)

ఫాస్ఫేటిక్ మరియు పొటాషిక్ (పి&కె) ఎరువుల కు 2020-21 సంవత్సరానికి గాను పౌష్టికాధారిత సబ్సిడీ (ఎన్ బిఎస్) ధర ల స్థిరీకరణ కు ఆమోదం తెలిపిన మంత్రిమండలి

Posted On: 22 APR 2020 3:39PM by PIB Hyderabad

ఫాస్ఫేటిక్ మరియు పొటాషిక్ (పి&కె) ఎరువుల కు  2020-21 సంవత్సరానికి గాను పౌష్టికాధారిత సబ్సిడీ (ఎన్ బిఎస్) ధర ల స్థిరీకరణ కు

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన ఆర్థిక వ్యవహారాల సంబంధిత మంత్రివర్గ సంఘం (సిసిఇఎ) ఆమోదం తెలిపింది.  ఎన్ బిఎస్  కి సంబంధించినంతవరకు ఆమోదించిన ధరలు ఈ దిగువన తెలిపిన విధం గా ఉన్నాయి.

ఒక్కొక్క కిలోగ్రాముకు సబ్సిడీ ధరలు (రూపాయల లో)

 

ఎన్

పి

కె

ఎస్

 

18.789

 

14.888

 

10.116

 

2.374

 

 

అమోనియం ఫాస్ఫేట్ (ఎన్ పి 14:28:0:0) అనే పేరు ను కలిగిన ఒక కాంప్లెక్స్ ఫర్టిలైజర్ ను  ఎన్ బిఎస్ పథకం లో చేర్చేందుకు కూడా సిసిఇఎ సమ్మతి ని తెలిపింది.

పి&కె ఫర్టిలైజర్ లపై సబ్సిడీ విడుదల కు గాను 2020-21 వ సంవత్సరం లో 22,186.55 కోట్ల రూపాయల మేరకు వ్యయం కావచ్చని అంచనా వేయడమైంది.

ఎరువుల కంపెనీల కు పి&కె పై సబ్సిడీ ని సిసిఇఎ ఆమోదించిన సబ్సిడీ ధరల మేరకు సమకూర్చడం జరుగుతుంది.

పూర్వరంగం:

ప్రభుత్వం ఎరువులను, అనగా యూరియా మరియు పి&కె ఫర్టిలైజర్ ల తాలూకు 21 గ్రేడుల ను రైతుల కు సబ్సిడైజ్ డ్ ధరల లో ఎరువుల తయారీదారు సంస్థలు/దిగుమతిదారు సంస్థల ద్వారా అందుబాటు లోకి తెస్తున్నది.  పి&కె ఫర్టిలైజర్ లపై సబ్సిడీ ని 2010వ సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నాటి నుండి ఎన్ బిఎస్ స్కీము యొక్క అధీనం లో ఉంచడమైంది.  రైతుల పట్ల స్నేహపూర్వకమైన వైఖరి ని అవలంబించాలన్న తన వైఖరి కి అనుగుణం గా, పి&కె ఫర్టిలైజర్ ల ను రైతుల కు తక్కువ భారం పడే రీతి న అందుబాటు లో ఉండేటట్టు చూడటానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.  ఎగువ న ప్రస్తావించిన రేటుల కు సబ్సిడీ ని ఫర్టిలైజర్ కంపెనీల కు విడుదల చేయడం జరుగుతుంది. తద్వారా ఆయా కంపెనీలు ఎరువుల ను రైతుల కు కొద్ది గా చౌక ధర కు లభ్యం అయ్యేటట్టు చేసే అవకాశం ఏర్పడుతుందన్న మాట; ఈ ఏర్పాటే లేకపోతే గనక పరిస్థితి వేరే విధం గా ఉండేది.

**

 

 


(Release ID: 1617138)