హోం మంత్రిత్వ శాఖ
ఐఎంఏ ప్రతినిధులతో, వైద్యులతో మాట్లాడిన కేంద్ర మంత్రులు కోవిడ్ -19 తో పోరాటం చేస్తున్న వైద్యరంగ సిబ్బంది భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని స్పష్టీకరణ వైద్య ఆరోగ్య రంగ సిబ్బందిపై దాడులను తీవ్రంగా పరిగణిస్తామన్న కేంద్రం
వైద్య ఆరోగ్యరంగ సిబ్బంది భద్రత విషయంలో శ్రీ మోదీ ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది: శ్రీ అమిత్ షా
Posted On:
22 APR 2020 12:12PM by PIB Hyderabad
ఇండియన్ మెడికల్ అసోషియేషన్ ప్రతినిధులతో, వైద్యులతో కేంద్ర మంత్రులు శ్రీ అమిత్ షా, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ మాట్లాడారు. వారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ వైద్య ఆరోగ్య రంగ సిబ్బంది భద్రతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని భరోసానిచ్చారు.
సమాజానికి వైద్యులు అందిస్తున్న సేవలను కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా కొనియాడారు. కరోనా వైరస్ కు వ్యతిరేకంగా వారు చేస్తున్న పోరాటం ఎంతో గొప్పదని అన్నారు. వారు అందిస్తున్న సేవలు ఇంతే అంకితభావంతో కొనసాగాలని ఆకాంక్షించారు. కోవిడ్ -19 లాంటి అత్యంత ప్రమాదకరమైన వ్యాధినుంచి ప్రజలను రక్షించడానికిగాను వైద్య ఆరోగ్య రంగ సిబ్బంది చేస్తున్న త్యాగాలు నిరుపమానమైనవని అన్నారు.
వైద్య ఆరోగ్య రంగ సిబ్బంది భద్రత, సంక్షేమానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఈ విషయంలో ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని అన్నారు.
వైద్య ఆరోగ్య సిబ్బందిపై జరిగిన దాడులను ఆయన ఖండించారు సిబ్బందికి సంబంధించిన అన్ని సమస్యలను ప్రధాని స్వయంగా తెలుసుకుంటున్నారని కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా అన్నారు. భవిష్యత్తులో ఎలాంటి దాడులు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో జాతీయ, అంతర్జాతీయ సంక్షేమం దృష్ట్యా వైద్య ఆరోగ్య సిబ్బంది ఎలాంటి నిరసనలకు దిగవద్దని కోరారు.
కేంద్ర ప్రభుత్వంలోని అత్యున్నత్తస్థాయినుంచి వెంటనే స్పందన రావడం, కేంద్ర హోం, ఆరోగ్య శాఖ మంత్రులే స్వయంగా భరోసానివ్వడంతో తన ప్రతిపాదిత నిరసనను ఐఎంఏ వెనక్కి తీసుకుంది.
ఈ వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, సీనియర్ వైద్యులు, నీతి ఆయోగ్ ప్రతినిధులు పాల్గొన్నారు.
***
(Release ID: 1617009)
Visitor Counter : 306
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam