రక్షణ మంత్రిత్వ శాఖ
కోవిడ్-19పై పోరులో భాగంగా కార్వార్ వద్ద సేవలందిస్తున్న భారత నావికాదళ నౌకాస్పత్రి... ఐఎన్‌హెచ్‌ఎస్ పతంజలి
Posted On:
19 APR 2020 1:23PM by PIB Hyderabad
కోవిడ్-19పై పోరాటంలో భాగంగా కర్ణాటకలోని ఉత్తర కన్నడజిల్లా పరిధిలోగల కార్వార్‌వద్ద భారత నావికాదళ నౌకాస్పత్రి పతంజలి రోగులకు విశిష్ట సేవలందిస్తోంది. గతనెల 25న జాతీయ దిగ్బంధం ప్రకటించిన తర్వాత కార్వార్ జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి మేరకు కేవలం 24 గంటల్లో ఐఎన్‌హెచ్‌ఎస్ పతంజలిని అధికారులు అన్నివిధాలా సంసిద్ధం చేశారు. అటుపైన 2020 మార్చి 28న కోవిడ్-19 రోగుల తొలి బృందాన్ని ఈ నౌకాస్పత్రికి తరలించారు. ముగ్గురు డాక్టర్లు, 9 మంది వైద్యసిబ్బంది, మరో 9 మందిసహాయ సిబ్బందితో కూడిన బృందం ఇక్కడ కోవిడ్-19 రోగులకు 24 గంటలూ సేవలందిస్తోంది. పతంజలి నౌకాస్పత్రిలో చికిత్స పొందుతున్న 9 మంది రోగులలో 8 మందికి పూర్తిగా నయం కావడంతో కొన్ని రోజుల వ్యవధిలో ఇళ్లకు పంపివేశారు. ప్రస్తుతం ఏప్రిల్ 16న ఇక్కడి చేరిన ఏకైక రోగిలో చికిత్సకు సానుకూల స్పందన కనిపిస్తోంది. మరోవైపు తన సాధారణ విధుల్లో భాగంగా ఐఎన్‌హెచ్‌ఎస్ పతంజలి తమ సిబ్బందికి వైద్యసేవలను కొనసాగిస్తోంది.
*****
(Release ID: 1616101)