సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
పాదరక్షల పరిశ్రమ ప్రతినిధులకు అన్నివిధాలా మద్దతునివ్వగలమని హామీ ఇచ్చిన కేంద్ర మంత్రి శ్రీ నితిన్‌గడ్కరి
Posted On:
18 APR 2020 6:09PM by PIB Hyderabad
కోవిడ్ -19 వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్ కారణంగా ఉత్పన్నమైన సవాలును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్నివిధాలా మద్దతు నివ్వగలదని
ఎం.ఎస్.ఎం.ఇలు, రోడ్డురవాణా,జాతీయ రహదారుల శాఖ కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరి తెలిపారు.
నాగపూర్‌నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ ఆయన ఈ హామీ ఇచ్చారు. ఆదాయపన్నుశాఖ నుంచి రిఫండ్ ల రూపంలో ఎం.ఎస్.ఎం.ఇలకు రూ 5204 కోట్ల రూపాయలు నిన్ననే విడుదల చేసినట్టు ఆయన చెప్పారు. ఇది ఈ రంగానికి పెద్ద ఎత్తున ఉపయోగపడనున్నదని చెప్పారు.
దిగుమతులకు ప్రత్యామ్నాయాలను ఆలోచించి ఎగుమతులకు గల అవకాశాలను ఉపయోగించుకోవాల్సిందిగా ఆయన పరిశ్రమ వర్గాలకు పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో పాదరక్షల పరిశ్రమ ప్రతినిధులు, వర్కింగ్ కేపిటల్ కొరత,లాజిస్టిక్స్, ముడిసరుకు అందుబాటు,పనిప్రదేశ పరిస్థితులు, వ్యాపార కార్యకలాపాల కొనసాగింపు,, కోవిడ్ -19 నేపథ్యంలో పాదరక్షలకు డిమాండ్ తదితర అంశాలను ప్రస్తావించారు. ఈ రంగానికి అండగా ఉండడానికి చర్యలు తీసుకోవలసిందిగా వారు ప్రభుత్వాన్ని కోరారు.
లాక్‌డౌన్ అనంతరం కూడా , ఉత్పత్తి క్రమంగా పుంజుకుంటుందని,పూర్తి సామర్ధ్యానికి చేరుకోవడానికి కొంత సమయం పడుతుందని అన్నారు. పాదరక్షల ముడిసరకును చైనానుంచి దిగుమతి చేసుకోవడాన్నినిలిపివేయాలని, దీనివల్ల ముడిసరుకు మార్కెట్‌ను ముంచెత్తకుండా ఉంటుందని చెప్పారు.
ప్రభుత్వం కొన్ని పారిశ్రామిక రంగాలు పని ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతించిందని, అయితే పరిశ్రమ వర్గాలు, అత్యంత ముఖ్యంగా కోవిడ్ -19 వ్యాప్తి నిరోధానికి సంబంధించి తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని శ్రీ నితిన్ గడ్కరీ సూచించారు. పిపిఇల ( మాస్క్‌లు, శానిటైజర్లు, గ్లోవ్‌లు తదితరాల) వాడకం గురించి ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. అలాగే వ్యాపార కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేటపుడు సామాజిక దూరం పాటించాలని ఆయన కొరారు.
ఈ రంగానికి తక్షణ ఉపశమనం కల్పించడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ, వాణిజ్య మంత్రిత్వ శాఖ దృష్టికి సంబంధిత సమస్యలను తీసుకువెళతామని శ్రీ గడ్కరీ హామీ ఇచ్చారు. లాక్‌డౌన్ అనంతరం వ్యాపార కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేటప్పుడు పాదరక్షల పరిశ్రమ సానుకూల వైఖరి అనుసరించాలని, కోవిడ్ -19 సంక్షోభం ముగిసిన అనంతరం ఏర్పడే అవకాశాలను అందిపుచ్చుకోవడానికి కలిసి పనిచేయాలని శ్రీ గడ్కరీ పరిశ్రమ వర్గాలను కోరారు.
*****
(Release ID: 1615827)
Visitor Counter : 138