ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ఢిల్లీ లెఫ్టనెంట్ గవర్నర్, ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి, ఢిల్లీ లోని వివిధ ఆసుపత్రుల మెడికల్ సూపరింటెండెంట్లు, ఢిల్లీ ప్రభుత్వ ఆరోగ్యశాఖ అధికారులు, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్యశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన డాక్టర్ హర్ష వర్ధన్.

అనారోగ్యంతో బాధపడుతున్న కోవిడ్-19 సోకని ఇతర క్లిష్టమైన రోగులకు కూడా చికిత్సనందించాలని ఆసుపత్రులను కోరారు.

రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో మొబైల్ రక్త సేకరణ వాహనాల వంటి వివిధ సేవలను వినియోగించి, స్వచ్చంద రక్త దాతలను ప్రోత్సహించి రక్తం అవసరమైన వారికి ఎక్కించడానికి సమృద్ధిగా రక్తం స్టాక్ ఉంచాలి.

అత్యవసర వైద్య సహాయం అందవలసిన ఎవరైనా రోగి, చికిత్స నిరాకరించిన కారణంగా ఆసుపత్రులనుండి తిరిగి వెళ్ళిపోతే, సంబంధిత సిబ్బందిపై చర్య తీసుకోవడం జరుగుతుంది.

Posted On: 17 APR 2020 8:54PM by PIB Hyderabad

"కోవిడ్-19 కు వ్యతిరేకంగా జరుగుతున్నపోరులో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చినందుకు నేను మీ అందరినీ అభినందిస్తున్నాను. అయితే, ఈ పరీక్షా సమయంలో  వైద్యం అవసరమైన అత్యవసర / ఇతర రోగులను ఎవరినీ నిర్లక్ష్యం చేయకూడదు." అని డాక్టర్ హర్ష వర్ధన్ సూచించారు. ఢిల్లీ లెఫ్టనెంట్ గవర్నర్, ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి, ఢిల్లీ లోని ప్రముఖ కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రుల మెడికల్ సూపరింటెండెంట్లు, ఢిల్లీ మునిసిపల్ కమిషనర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు ఆయన అధ్యక్షత వహించారు. 

"కోవిడ్-19 వ్యాధితో కాకుండా, రక్త మార్పిడి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా గుండె జబ్బులతో బాధపడే రోగులు, గర్భిణీలతో పాటు ఇతర క్లిష్టమైన వ్యాధులతో బాధపడుతున్న రోగులకు చికిత్స అందించకుండా తిరస్కరిస్తున్నట్లు నాకు ఫోన్లుసామాజిక మాధ్యమం, ట్విట్టర్, ప్రింట్ మీడియా ద్వారా అనేక ఫిర్యాదులు అందుతున్నాయి." అని డాక్టర్ హర్ష వర్ధన్ చెప్పారు. "అత్యవసర పరిస్థితుల్లో వైద్యం కోసం ఆసుపత్రులకు వచ్చిన రోగులకు చికిత్స నిరాకరించడాన్ని మేము తీవ్రంగా పరిగణించవలసి వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో రోగికి వెంటనే చికిత్స అందని కారణంగా ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది. " అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  కోవిడ్-19 సోకిన రోగికి ఎటువంటి చికిత్స నందిస్తామో, అదేవిధంగా ఇతర అనారోగ్యంతో వచ్చే రోగులకు కూడా తగిన వైద్య సదుపాయాన్ని కల్పించాలని, కేంద్ర మంత్రి అన్ని ఆసుపత్రుల సూపెరింటెండెంట్లను ఆదేశించారు. "లాక్ డౌన్ సమయంలో ఇది ప్రతిఒక్కరికీ పరీక్షా సమయం, నిజంగా అనారోగ్యం పాలైన వ్యక్తి, వెంటనే చికిత్స అవసరమై బయటకు వచ్చి ఆసుపత్రికి చేరుకోడానికి ఎన్నో కష్టాలు  పడవలసి ఉంటుంది. రక్త మార్పిడి, డయాలిసిస్ వంటి వెంటనే చేపట్టవలసిన కొన్ని చికిత్సలు చేయకుండా కుంటి సాకులు చెప్పి, వారిని,  మనం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి పంపకూడదు." అని ఆయన హెచ్చరించారు.   

" ఏ.ఐ.ఐ.ఎం.ఎస్. మరియు సఫ్దర్ జంగ్ ఆసుపత్రులలో కోవిడ్తో-19 సదుపాయాలను కల్పించడంతో పాటు నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రులు ఎల్.ఎన్.జె.పి.  మరియు రాజీవ్ గాంధీ సూపర్ స్పెషలిటీ ఆసుపత్రులను కోవిడ్ ప్రత్యేక ఆసుపత్రులుగా కేటాయించాము. మిగిలిన ఆసుపత్రులు సాధారణంగా చికిత్స కోసం వచ్చే  కోవిడ్ సోకని రోగుల ఆరోగ్య అవసరాలను  తీర్చవలసి ఉంటుంది." అని ఆయన స్పష్టం చేశారు.  

కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో ఆరోగ్య పరిరక్షణకు ఇదివరకు ఎన్నడూ లేనంతగా పెరిగిన డిమాండ్ ను తట్టుకునేందుకు వీలుగా అవసరమైన ఆరోగ్య సంరక్షణ సేవలు అందించడానికి వీలుగా కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ సవివరమైన మార్గదర్శకాలను జారీ చేసింది. " అని ఆయన తెలిపారు.  అటువంటి రోగులకు టెలి-కన్సల్టేషన్, డిజిటల్ ప్రిస్క్రిప్షన్, మందులు ఇంటి దగ్గర అందించే విధంగా సేవలు కల్పించవచ్చునని కూడా ఆయన చెప్పారు

ఈ రోగుల పట్ల కరుణ, శ్రద్ధతో స్పందించాలని ఆయన కోరారు.  ఎందుకంటే, వారు లాక్ డౌన్ వల్ల ఇప్పటికే తీవ్ర కష్టాలను అనుభవించి ఉంటారుదుర్బలమైన వ్యాధులతో బాధ పడుతున్నవారితో సహా వైద్యం అవసరమైన రోగులందరికీ ముందస్తు, చురుకైన, ప్రభావవంతమైన చర్యలు తీసుకునివైద్యం అందించవలసిన అవసరం ఉంది"  అని  ఆయన పేర్కొన్నారు.   

రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో మొబైల్ రక్త సేకరణ వాహనాల వంటి వివిధ సేవలను వినియోగించి, స్వచ్చంద రక్త దాతలను ప్రోత్సహించి రక్తం అవసరమైన వారికి ఎక్కించడానికి వీలుగా రక్తం నిల్వను తగినంతగా ఉంచవలసిందిగా ఆయన వారిని కోరారు.  తరచుగా రక్త దానం చేసేవారిని గుర్తించిమొబైల్ రక్త సేకరణ వాహనాలను వారి వద్దకే తీసుకువెళ్తే, వారికి సౌకర్యంగా ఉంటుంది, ఈ సమయంలో అది ఒక గొప్ప పనిగా ఉంటుందని కూడా కేంద్ర మంత్రి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కి తెలియజేశారు. 

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో  ప్రత్యేక కార్యదర్శి  సంజీవ కుమార్;  అదనపు కార్యదర్శి  వందన గుర్నాని;  సంయుక్త కార్యదర్శి గాయత్రీ మిశ్రా;  ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ గార్గ్ తో పాటు  ఆర్.ఎం.ఎల్. ఆసుపత్రి మెడికల్ సూపెరింటెండెంట్లుఇతరులు పాల్గొన్నారు

*****


(Release ID: 1615614) Visitor Counter : 252