మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

మాన‌వ వ‌న‌రులు అభివృద్ధి మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన ఎన్.ఐ.ఒ.ఎస్ నేరుగా ఇంటివ‌ద్ద‌కే చ‌దువును తీసుకువెళ్లే ప్ర‌త్యేక విధానం ప్రారంభం

కోవిడ్ -19 కారణంగా ,ఎన్‌.ఐ.ఒ.ఎస్ సంస్థ కెవిఎస్‌, ఎన్‌.వి.ఎస్‌.సిబిఎస్ఇ, ఎన్‌సిఇఆర్‌టి ల స‌హాయంతో స్కైప్ స‌హాయంతో స్వ‌యం ప్ర‌భ డిటిహ‌చ్ ఛాన‌ల్‌పై లైవ్ సెష‌న్లు ప్ర‌సారం చేస్తున్న ఎన్ఐఒఎస్‌

ఇంట్లో ఇంట‌ర్నెట్ స‌దుపాయం లేని వారు సైతం చ‌దువు నేర్చుకోవ‌డానికి స్వ‌యం ప్ర‌భ మంచి ఉప‌క‌ర‌ణం.- శ్రీ ర‌మేష్ పోఖ్రియాల్ నిశాంక్‌
దీనిద్వారా జెఇఇ,ఎన్ఇఇటి ప‌రీక్ష‌ల‌కు సిద్ధ‌మ‌య్యేవారు ఇంటివ‌ద్ద‌నుంచే ప‌రీక్ష‌ల‌కు సిద్ధ‌మ‌య్యేందుకు వీలు

Posted On: 14 APR 2020 3:06PM by PIB Hyderabad

కోవిడ్ -19 కార‌ణంగా విద్యార్థులు ఇబ్బందులు ప‌డ‌కుండా ఉండేందుకు మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి మంత్రిత్వ‌శాఖ ప‌లు ప్ర‌త్యేక‌ చ‌ర్య‌లు తీసుకుంది.
మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి మంత్రిత్వ‌శాఖ ఆదేశాల మేర‌కు ఎన్‌.ఐ.ఒ.ఎస్ విద్యార్థులు ఇంటివ‌ద్ద‌నే చ‌దువు నేర్చుకునే వినూత్న విధానాన్ని తీసుకువ‌చ్చింది. నాణ్య‌త‌తో కూడిన విద్య‌ను అందించ‌డంలో భాగంగా . 'SWAYAM’ MOOC ప్లాట్‌ఫాంపై  వివిద స‌బ్జెక్టుల‌కు సంబంధించి 9 వ‌త‌ర‌గ‌తి నుంచి 12 వ త‌ర‌గ‌తి వ‌ర‌కు మెటీరియ‌ల్ అందుబాటులో ఉంచారు. స్వ‌యంగా చ‌దువుకోవ‌డానికి వీలు క‌ల్పించే మెటీరియ‌ల్ ను SWAYAM పోర్ట‌ల్ అందించ‌డంతోపాటు, వీడియో పాఠాలు, స్వీయ అంచ‌నాకు వీలు క‌ల్పిస్తుంది. ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు, విద్యార్థుల సందేహాల‌కు స‌మాధానాల‌ను డిస్క‌ష‌న్ ఫోరం ద్వారా ప‌రిష్క‌రిస్తారు.
దీనికితోడు ఇంట‌ర్నెట్ పెద్ద‌గా అందుబాటులో లేని వారికి ఈ వీడియో పాఠాలను ఎం.హెచ్‌.ఆర్‌.డి స్వ‌యంప్ర‌భ టివి ఛాన‌ల్ లో ప్ర‌సారం చేస్తారు. ఇందులో లైవ్ సెష‌న్లు కూడా నిర్వ‌హిస్తారు. వీటిద్వారా విద్యార్థులు ఆయావిష‌య నిపుణులైన టీచ‌ర్ల‌ను అడిగి సందేహాలు తీర్చుకోవ‌చ్చు.
జెఇఇ, ఎన్.ఇ.ఇ.టి కి సిద్ధ‌మౌతున్న విద్యార్థులు ఇంటివ‌ద్దే కూర్చుని దీని ద్వారా ప‌రీక్ష‌ల‌కు సిద్ధం కావ‌చ్చు.
కోవిడ్ -19 మ‌హ‌మ్మారి కార‌ణంగా ఎన్.ఐ.ఒ.ఎస్ , స్కైప్ ద్వారా లైవ్ సెష‌న్లు నిర్వ‌హించేందుకు వినూత్న ఆలోచ‌న‌లు చేసింది. వీటిని కెవిఎస్‌.ఎన్‌.వి.ఎస్‌, సిబిఎస్ఇ , ఎన్‌సిఇఆర్‌టి సంస్థ‌ల స‌హ‌కారంతో స్వ‌యం ప్ర‌భ డిటిహెచ్ ఛాన‌ల్ పాణిని  (#27) , ఎన్ ఒ ఐ ఎస్ ఛాన‌ల్  శార‌ద (#28), ఎన్‌.సి.ఇ.ఆర్‌.టి ఛాన‌ల్ కిషోర్ మంచ్((#31),  ద్వారా  విష‌య నిపుణులు  స్వ‌యంప్ర‌భ ద్వారా  స్కైప్ నుంచి ప్ర‌త్య‌క్ష ప్ర‌సారాల‌తో  ఇంటినుంచే విష‌య నిపుణుల‌తో సంబంధాలు పెట్టుకోవ‌డానికి వీలు క‌లుగుతుంది.

విద్యార్ధులు ఈ డిటిహెచ్ చాన‌ళ్లు, ఎన్ ఐ ఒ ఎస్ యూట్యూబ్‌ ఛానెల్‌లో 6 గంటల రికార్డ్ చేసిన ప్రసారాన్ని ఉదయం 7.00 నుండి 1.00PM వరకు చూడవచ్చు, తరువాత 6 గంటల లైవ్ సెషన్ మ‌ధ్యాహ్నం 1 గంట‌నుంచి  రాత్రి 7 గంట‌ల వరకు నాలుగు వేర్వేరు విషయ నిపుణులతో ఒకటిన్నర వరకు చూడవచ్చు. సెషన్ ప్రతి గంట వ్య‌వ‌ధి. లైవ్ సెషన్‌లో సూచించే నంబర్‌పై ఫోన్ కాల్ ద్వారా  ప్రత్యక్ష ప్రసారంలో నేరుగా ఎన్‌.ఐ.ఒ.ఎస్ వెబ్‌సైట్ లోని  'స్టూడెంట్ పోర్టల్' ద్వారా విద్యార్థులు తమ ఇంటి నుండి సబ్జెక్ట్ నిపుణులతో  నేరుగా ప్రశ్నలు అడగవచ్చు.

కేంద్ర హెచ్‌ఆర్‌డి మంత్రి  రమేష్ పోఖ్రియాల్ ‘నిశాంక్’, కేంద్ర స‌మాచార ప్ర‌సార శాఖ మంత్రి   శ్రీ ప్రకాష్ జవదేకర్ల అభ్య‌ర్థ‌న మేర‌కు టాటా స్కై, ఎయిర్‌టెల్ డిటిహెచ్ ఆపరేటర్లు తమ డిటిహెచ్ ప్లాట్‌ఫామ్‌లో మూడు స్వయం ప్రభ డిటిహెచ్ ఛానెళ్లను ప్రసారం చేయడానికి అంగీకరించారు. ఇప్పుడు ఈ మూడు స్వయం ప్రభ డిటిహెచ్ ఛానెల్స్ డిడి-డిటిహెచ్ , జియో టివి యాప్ తో పాటు అన్ని డిటిహెచ్ సర్వీసు ప్రొవైడర్ల ద్వారా అందుబాటులో ఉన్నాయి. ఈ ఛానెల్‌ కోసం ప్రజలు తమ డిటిహెచ్ 'సర్వీస్ ప్రొవైడర్'ను అదనపు ఖర్చు లేకుండా అభ్యర్థించవచ్చు, ఎందుకంటే ఇవి ఫ్రీ ఎయిర్ ఛాన‌ళ్లు. కోవిడ్ -19  వ్యాప్తి కారణంగా తలెత్తే ఈ క్లిష్ట పరిస్థితిలో విద్యార్థులు ఎలాంటి ఆటంకం లేకుండా ఇంటినుంచే తమ విద్యను కొనసాగించవచ్చు
వివిధ డిటిహెచ్ స‌ర్వీసు ప్రొవైడ‌ర్ల లో ఛాన‌ల్ నెంబ‌ర్లు కింది విధంగా ఉన్నాయి.

ఎయిర్ టెల్ టివి :   ఛాన‌ల్ # 437, ఛాన‌ల్ # 438 , ఛాన‌ల్ # 439
విఎం వీడియోకాన్ :   ఛాన‌ల్ # 475, ఛాన‌ల్  # 476, ఛాన‌ల్ # 477
టాటా స్కై :   ఛాన‌ల్ # 756,ఇది స్వ‌యం ప్ర‌భ డిటిహెచ్ ఛాన‌ళ్ల కు విండో పాప్ అప్ అవుతుంది.
డిష్ టివి :  ఛాన‌ల్‌ # 946, ఛాన‌ల్  # 947, ఛాన‌ల్ # 949, ఛాన‌ల్ # 950

 స్వయం ప్రభ  అనేది  ఇంట్లో ఇంటర్నెట్ సదుపాయం లేనివారికి నేర్చుకునే విద్యాభ్యాసానికి  ప్రభావవంతమైన సాధనం. జి శాట్  ఉపగ్రహాన్ని ఉపయోగించి 24 గంట‌లూ  అధిక-నాణ్యతగ‌ల‌ విద్యా కార్యక్రమాలను ప్రసారం చేయడానికి అంకిత‌మైన  32 డిటిహెచ్‌ ఛానళ్ల సమూహం స్వయం ప్రభ. ప్రతి రోజూ, కనీసం (4) గంటలు కొత్త కంటెంట్ ఉంటుంది, ఇది రోజులో 5 సార్లు పున‌:ప‌్ర‌సారం అవుతుంది., దీనివల్ల విద్యార్థులు వారి సౌలభ్యం , సమయాన్ని ఎంచుకోవచ్చు. ఛానళ్లు, గాంధీనగర్ లోని బీసాగ్ నుండి  అప్ లింక్  చేయబడ్డాయి. పాఠ్వాంశాల‌ను  ఎన్‌పిటిఇఎల్‌, ఐఐటిలు, యుజిసి, సిఇసి, ఇగ్నో, ఎన్‌.సి.ఇ.ఆర్‌.టి, ఎన్‌.ఐ.ఒ.ఎస్‌ అందిస్తున్నాయి. ఇన్‌ఫ్లిబినెట్ సెంటర్, వెబ్ పోర్టల్‌ను నిర్వహిస్తుంది. అన్ని 32 ఛానెళ్లు డిడి డిటిహెచ్‌,  జియో టివి మొబైల్ యాప్‌లో అందుబాటులో ఉన్నాయి.
డిటిహెచ్ ఛాన‌ళ్లు ఈ కింది అంశాల‌ను క‌వ‌ర్ చేస్తాయి.:

ఎ) ఉన్న‌త విద్య : ఆర్ట్స్, సైన్స్, కామర్స్, పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, సోషల్ సైన్సెస్ , హ్యుమానిటీస్, ఇంజనీరింగ్, టెక్నాలజీ, లా, మెడిసిన్, అగ్రికల్చర్ వంటి విభిన్న విభాగాల  పోస్ట్-గ్రాడ్యుయేట్  అండర్-గ్రాడ్యుయేట్ స్థాయిలో పాఠ్య ప్రణాళిక ఆధారిత కోర్సు విషయాలు ఇందులో ఉంటాయి.. SWAYAM ద్వారా MOOC కోర్సులను అందించడానికి  ఈ వేదిక అభివృద్ధి చేయబడింది
బి) పాఠశాల విద్య (9-12 త‌ర‌గ‌తుల వ‌ర‌కు): ఉపాధ్యాయ శిక్షణ కోసం మాడ్యూల్స్ ,అలాగే భారతదేశ పిల్లలకు బోధన ,అభ్యాసనకు సంబంధించిన‌  విషయాలను బాగా అర్థం చేసుకోవడంలో ఇవి సహాయపడతాయి . ప్రొఫెషనల్ డిగ్రీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి పోటీ పరీక్షలకు సిద్ధం చేయడంలో వారికి ఇవి సహాయపడతాయి.
సి)   పాఠ్య ప్రణాళిక ఆధారిత, భారతీయ విద్యార్థులు , విదేశాలలో ఉన్న భారతీయ పౌరుల నిరంత‌ర విద్యా  అవసరాలను తీర్చగల  కోర్సులు
డి). పోటీ ప‌రీక్ష‌ల‌కు సిద్ధ‌మ‌య్యే విద్యార్థుల‌కు (11 , 12 వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు) స‌హాయం
చాన‌ళ్లు 0-10 వ‌ర‌కు సిఇసి-యుజిసి నిర్వ‌హిస్తుంది.
ఛానళ్లు  11 -18 వ‌ర‌కు ఎన్‌.పి.టి.ఇ.ఎల్ నిర్వ‌హిస్తుంది.
ఛాన‌ళ్లు 19 - 22  వ‌ర‌కు హైస్కూలు విద్యార్థుల‌కు ఐఐటి ఢిల్లీ నిర్వ‌హిస్తుంది. దీనిని ఐఐటి పిఎల్ అని పిలుస్తారు
ఛాన‌ళ్లు 23,24,25,26 ల‌ను న్యూఢిల్లీలోని ఇగ్నో నిర్వ‌హిస్తోంది.
ఛానళ్లు 27,27 ల‌ను ఎన్ఐఒఎస్‌, న్యూఢిల్లీ నిర్వ‌హిస్తోంది.
ఛాన‌ల్ 29ని యుజిసి-ఇన్‌ఫ్లిబినెట్, గాంధీన‌గ‌ర్ నిర్వహిస్తుంది.
ఛాన‌ల్ 31ని ఎన్‌.సి.ఇ.ఆర్‌.టి నిర్వహిస్తుంది.
ఛాన‌ల్ 32ను ఇగ్నో, ఎన్‌.ఐ.ఒ.ఎస్‌లు సంయుక్తంగా నిర్వహిస్తాయి.

స్వ‌యం ప్ర‌భ ఛాన‌ళ్ల‌కు సంబంధించి మ‌రిన్ని వివ‌రాల‌కు కింది లింక్‌ను
క్లిక్ చేయండ‌డి.
https://www.swayamprabha.gov.in/index.php/ch_allocation(Release ID: 1614474) Visitor Counter : 257