PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 12 APR 2020 7:00PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

 

  • దేశంలో నిన్నటి నుంచి పెరిగిన కోవిడ్‌-19 నిర్ధారిత  కేసుల సంఖ్య 909
  • ప్రాథమిక వైద్య మౌలిక వసతుల సామర్థ్యం పెంపుపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రత్యేక ఆస్పత్రులు, ఏకాంత-ఐసీయూ పడకలతోపాటు దిగ్బంధ పర్యవేక్షణ సదుపాయాలు ఇందులో భాగంగా ఉంటాయి
  • రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఆశ్రయాలు/శిబిరాల్లోగల వలస కార్మికుల సంక్షేమంపై సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించాలని కేంద్రం స్పష్టీకరణ
  • కోవిడ్‌-19పై పోరాడుతున్న డాక్టర్లు, వైద్య సిబ్బందికి పోలీసు రక్షణ కల్పించాలని అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకే దేశీయాంగ శాఖ ఆదేశం
  • పీఎంయూవై కింద 11 రోజుల్లో 85 లక్షల లబ్ధిదారులకు వంటగ్యాస్‌ సరఫరా; ఇబ్బందులను అధగమిస్తూ రోజుకు 60 లక్షల సిలిండర్లు అందిస్తున్న సిబ్బంది.  

 

కోవిడ్‌-19పై ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నుంచి తాజా సమాచారం

దేశంలో నిన్నటినుంచి కొత్తగా నమోదైన కోవిడ్‌-19 నిర్ధారిత కేసులు 909 కాగా- వైరస్‌ బారినపడి కోలుకున్న/పూర్తిగా నయమైన 716 మంది ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వెళ్లారు. ఇక నేటివరకూ మరణాల సంఖ్య 273గా నమోదైంది. దేశంలో ప్రాథమికవైద్య మౌలిక వసతుల సామర్థ్యం పెంపుపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. ప్రత్యేక ఆస్పత్రులు, ఏకాంత-ఐసీయూ పడకలు, క్వారంటైన్‌ సదుపాయాలు ఇందులో భాగంగా ఉంటాయి.  మరోవైపు ఇప్పటికే దేశవ్యాప్తంగా కోవిడ్‌-19 కేసుల నిర్వహణకు ఏర్పాటయ్యే ప్రత్యేక ఆస్పత్రుల సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు వివిధ ప్రైవేటు రంగ ఆస్పత్రుల కృషికి ప్రభుత్వరంగ సంస్థలు, రక్షణ దళాలు, భారత రైల్వేల నుంచి విస్తృత సహకారం లభిస్తోంది.

మరిన్ని వివరాలకు :

రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఆశ్రయాలు/శిబిరాల్లోగల వలస కార్మికుల సంక్షేమంపై సుప్రీం కోర్టు ఆదేశాలు అమలు చేయాలని దేశీయాంగ శాఖ లేఖ

దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ఆశ్రయాలు/శిబిరాల్లోగల వలస కార్మికుల సంక్షేమంపై సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల అమలు దిశగా తగిన చర్యలు తీసుకోవాలని దేశీయాంగ శాఖ అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలకు లేఖ రాసింది. అదే సమయంలో కోవిడ్‌-19పై పోరు దిశగా దిగ్బంధ చర్యలను పటిష్టంగా పాటించాలని సూచించింది.

మరిన్ని వివరాలకు :

కోవిడ్‌-19పై పోరాడుతున్న డాక్టర్లు, వైద్య సిబ్బందికి పోలీసు రక్షణ కల్పించాలని అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు దేశీయాంగ శాఖ ఆదేశం

కోవిడ్‌-19 నిర్ధారిత, క్వారంటైన్‌లోగల అనుమానిత రోగులకు సేవలందిస్తున్న ఆస్పత్రులు, ఇతర చికిత్స కేంద్రాలలో డాక్టర్లు, వైద్య సిబ్బందికి అవసరమైన పోలీసు రక్షణ కల్పించాలని దేశీయాంగ శాఖ అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలకు, సంబంధిత పోలీసు అధికారులకు ఆదేశాలిచ్చింది. డాకర్లతోపాటు వైద్య సిబ్బందికి వేధింపులు ఎదురవుతున్న సంఘటనలు దృష్టికి వచ్చిన నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీచేసింది.

మరిన్ని వివరాలకు :

ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఈ నెలలో ఇప్పటిదాకా 85 లక్షల మంది లబ్ధిదారులకు వంటగ్యాస్‌ సరఫరా; కోవిడ్‌-19పై జాతి పోరాటానికి సరఫరా క్రమంలోని సిబ్బంది నిర్విరామ మద్దతు

కోవిడ్‌-19పై ఆర్థిక ప్రతిస్పందనలో భాగంగా ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన కింద కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమం దిశగా అనేక చర్యలు ప్రకటించింది. ఈ పథకం కింద ఉజ్వల లబ్ధిదారులకు ఏప్రిల్‌ నుంచి జూన్‌దాకా 3 నెలలపాటు ఉచితంగా సిలిండర్లు సరఫరా చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా 1.26 కోట్ల సిలిండర్లకు బుకింగ్‌ స్వీకరించగా, ఇందులో 85 లక్షల మేర పీఎంయూవై లబ్ధిదారులకు సరఫరా చేశారు.

మరిన్ని వివరాలకు :

దిగ్బంధం సమయంలో వ్యవసాయ, అనుబంధం రంగాలను ప్రోత్సహించేందుకు కేంద్ర వ్యవసాయ-సహకార-రైతు సంక్షేమ శాఖ చొరవ

దిగ్బంధం సమయంలో దేశవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో రైతులకు, వ్యవసాయ కార్యకలాపాలకు వెసులుబాటు కల్పిస్తూ వ్యవసాయ-సహకార-రైతు సంక్షేమ శాఖ అనేక చర్యలు చేపట్టింది.

మరిన్ని వివరాలకు :

కోవిడ్‌-19 సంబంధిత కార్యకలాపాల్లో కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద వ్యయం విధివిధానాలపై సందేహాలకు కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ సమాధానాలు

మరిన్ని వివరాలకు :

కరోనా వైరస్‌పై పోరాటానికి భారత వాయుసేన మద్దతు

రాష్ట్రాలు, సహాయ సంస్థలు ప్రపంచ మహమ్మారిని ప్రభావవంతంగా, సమర్థంగా ఎదుర్కొనడంలో తనవంతు తోడ్పాటుగా ఆయా రాష్ట్రాల నోడల్ పాయింట్లకు అవసరమైన వైద్య సామగ్రి, రేషన్ సరఫరాలను సకాలంలో అందించేందుకు భారత వాయుసేన అన్నివిధాలా కృషి చేస్తోంది.

మరిన్ని వివరాలకు :

పోర్ట్‌ బ్లయర్‌లో కోవిడ్‌-19పై పోరాటానికి భారత నావికాదళం మద్దతు

కోవిడ్‌-19 సంక్షోభం నేపథ్యంలో పోర్ట్‌ బ్లయర్‌లోని పేదలకు అక్కడి నావికాదళ విమాన స్థావరం (ఎన్‌ఏఎస్‌) ఉత్కృష్‌తోపాటు సామగ్రి సరఫరా సంస్థ (పోర్ట్‌ బ్లయర్‌) ఆహారం పంపిణీ చేసింది.

మరిన్ని వివరాలకు :

కరోనా యుద్ధవీరుల్లా పనిచేస్తున్న జనౌషధి కేంద్రాల నిర్వాహకులు: శ్రీ మాండవీయ

ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లోనూ దేశంలోని జనౌషధి కేంద్రాల నిర్వాహకులు కరోనా యుద్ధవీరుల్లా జాతికి సేవలందిస్తున్నారని కేంద్ర రసాయనాలు-ఎరువుల శాఖ మంత్రి శ్రీ మన్‌సుఖ్‌ మాండవీయ అన్నారు.

మరిన్ని వివరాలకు :

కేంద్ర హెచ్‌ఆర్‌డి శాఖ మంత్రి శ్రీ రమేష్‌ పోఖ్రియాల్‌ “నిషాంక్‌” చేతుల మీదుగా ‘యుక్తి’ (యంగ్‌ ఇండియా కంబాటింగ్‌ కోవిడ్‌ విత్‌ నాలెడ్జ్‌, టెక్నాలజీ అండ్‌ ఇన్నవేషన్‌) పోర్టల్‌ ప్రారంభం

కోవిడ్‌-19 నేపథ్యంలో హెచ్‌ఆర్‌డి మంత్రిత్వశాఖ తీసుకున్న చర్యలపై పర్యవేక్షణ, నమోదు బాధ్యతల నిర్వహణ ఈ పోర్టల్‌ లక్ష్యం. అంతేకాకుండా మంత్రిత్వశాఖకు-ఆయా సంస్థలకు మధ్య పరస్పర సమాచార ప్రదానానికి ఈ పోర్టల్‌ వీలు కల్పిస్తుంది. దీనివల్ల సదరు సంస్థలకు మంత్రిత్వ శాఖనుంచి అవసరమైన మద్దతు లభించే వీలుంటుంది.

మరిన్ని వివరాలకు :

కోవిడ్‌-19 పరిస్థితుల నడుమ బోధనను విద్యార్థులకు చేరువచేసే దిశగా పలు చర్యలు చేపట్టిన కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌, ఢిల్లీ ప్రాంతీయ విభాగం

ఈ మేరకు 6వ తరగతి నుంచి 8వ తరగతి విద్యార్థులకు సోమవారం నుంచి ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభమవుతాయి. కాగా, 9, 10 తరగతుల విద్యార్థులకు కేవీఎస్‌ ఢిల్లీ ప్రాంతీయ విభాగం ఇప్పటికే ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ ద్వారా ప్రత్యక్ష ఆన్‌లైన్‌ తరగతులను ప్రారంభించింది.

మరిన్ని వివరాలకు :

రెండు పొరల ఖాదీ మాస్కులను రూపొందించిన కేవీఐసీ

ఖాదీ-గ్రామీణ పరిశ్రమల కమిషన్‌ (కేవీఐసీ) రెండుపొరల మాస్కులను విజయవంతంగా రూపొందించింది. అంతేకాకుండా వీటిని పెద్ద సంఖ్యలో సరఫరా చేయడం కోసం ఆర్డర్లు కూడా పొందింది. ఇందులో ఒక్క జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వమే 7.5 లక్షల మాస్కుల సరఫరాకు ఆర్డర్‌ ఇవ్వడం గమనార్హం.

మరిన్ని వివరాలకు :

దేశంలో కోవిడ్‌-19 వ్యాప్తి నిరోధంలో సామాజిక సైనికుల్లా పనిచేస్తున్న ఎన్‌ఆర్‌ ఎల్‌ఎం స్వయంసహాయ సంఘాల మహిళలు

కోవిడ్‌-19పై పోరాటంలో భాగంగా జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్‌ (ఎన్‌ఆర్‌ఎల్‌ఎం)లో భాగమైన 27 రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి మిషన్ల (ఎస్‌ఆర్‌ఎల్‌ఎం)కు చెందిన 78,000 మంది స్వయంసహాయ సంఘాల మహిళలు ఇప్పటివరకూ 2 కోట్ల మాస్కులను తయారుచేశారు. అలాగే వివిధ రాష్ట్రాల్లో 5,000కుపైగా వ్యక్తిగత రక్షణ సామగ్రిని తయారుచేశారు; మరోవైపు 9 రాష్ట్రాల్లోని సుమారు స్వయం సహాయ సంఘాల నిర్వహణలోని 900 సంస్థలు లక్ష లీటర్ల పరిశుభ్రదత ద్రవాన్ని తయారు చేయగా, కొన్ని సంఘాలు హస్త పరిశుభ్రతకు భరోసా ఇస్తూ ద్రవ సబ్బులను కూడా రూపొందించాయి.

మరిన్ని వివరాలకు :

దేశంలో కోవిడ్‌-19 సవాలుకు దీటుగా ముందడుగు వేసిన ఎన్‌ఆర్‌ఎల్‌ఎం స్వయం సహాయ సంఘాలు

ప్రస్తుత సంక్షోభ సమయంలో కోవిడ్‌-19పై పోరాటానికి తమవంతు చేయూతగా చేతనైన అన్ని మార్గాల్లోనూ స్వయం సహాయ సంఘాల సభ్యులు సామాజిక సైనికుల్లా పనిచేస్తున్నారు. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని దీన్‌దయాళ్‌ అంత్యోదయ యోజన-జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్‌ (డీఏవై-ఎన్‌ఆర్‌ఎల్‌ఎం)కింద ఏర్పాటైన 63 లక్షల సంఘాలకు చెందిన సుమారు 690 లక్షల మంది మహిళా సభ్యులు అకుంఠిత దీక్షతో కృషిచేస్తున్నారు.

మరిన్ని వివరాలకు :

కోవిడ్‌-19పై బహుముఖ పోరాటం కొనసాగిస్తున్న సీఎస్‌ఐఆర్‌-సెంటర్‌ ఫర్‌ సెల్యూలర్‌ అండ్‌ మైక్రోబయాలజీ (సీసీఎంబీ- హైదరాబాద్‌)

కోవిడ్‌-19పై దేశం కొనసాగిస్తున్న పోరాటంలో భాగంగా సీఎస్‌ఐఆర్‌ పరిధిలోని ప్రముఖ జీవశాస్త్ర ప్రయోగశాల సీసీఎంబీ (హైదరాబాద్‌) అనేక ఉపకరణాలను, విధానాలను అనుసరిస్తోంది.

మరిన్ని వివరాలకు :

 

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • కేరళ: రాష్ట్రంలో తీవ్రముప్పున్న కాసరగోడ్‌లో 26 మంది కోవిడ్‌-19 రోగులు కోలుకుని ఇవాళ ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వెళ్లారు; మరో 60 మంది కోలుకోగా, జిల్లాలో ఇంకా 105 యాక్టివ్‌ కేసులున్నాయి. కాగా, కేంద్ర ప్రభుత్వం కేరళకు తగిన ఆర్థిక సహాయం అందించడం లేదని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి విమర్శించారు. ఇక అక్రమ వాహనాల సంచారం నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రంతో ఉపమార్గాలన్నిటినీ కేరళ పోలీసు శాఖ దిగ్బంధం చేసింది.
  • తమిళనాడు: రాష్ట్రంలో 12 మరణాలు సంభవించినట్లు సమాచారం అందింది; రాష్ట్రంలో 8 మంది డాక్టర్లకు కోవిడ్‌-19 నిర్ధారణ కాగా, ఇప్పటివరకూ నమోదైన మొత్తం కేసుల సంఖ్య 969కి చేరింది. విల్లుపురం నుంచి ఢిల్లీకి చెందిన కోవిడ్‌-19 రోగి ఒకరు అదృశ్యం కావడంతో దేశవ్యాప్త అప్రమత్తత ప్రకటించారు. మరోవైపు దిగ్బంధం పర్యవసానంగా రాష్ట్ర్రం రూ.10,000 కోట్ల రాబడి లోటును ఎదుర్కొంటోంది.
  • కర్ణాటక: రాష్ట్రంలో ఇవాళ మధ్యాహ్నం వరకూ 11 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 226కు చేరింది. ఈ మేరకు బెళగావిలో 4 కేసులు నమోదు కాగా, విజయపురలో ఒక 60 ఏళ్ల మహిళకు వ్యాధి నిర్ధారణ కావడంతో రాష్ట్రంలో కోవిడ్‌ కేసులున్న 19వ జిల్లాగా జాబితాలో చేరింది. మరోవైపు బెంగళూరు అర్బన్‌ జిల్లాలో ఇవాళ్టినుంచి ఇంటింటి కోవిడ్‌ సర్వే ప్రారంభమైంది.
  • ఆంధ్రప్రదేశ్‌: రాష్ట్రంలో ఇవాళ 12 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 417కు చేరింది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మడాన్ని శిక్షార్హ నేరంగా ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి ఒక్కరికీ 3 వంతున మాస్కులు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కాగా, రాష్ట్రంలో మొత్తం 1.47 కోట్ల కుటుంబాలుండగా మూడోదశ సర్వే ముగిసేసరికి 1.43 కోట్ల కుటుంబాలపై అధ్యయనం పూర్తయింది.
  • తెలంగాణ: రాష్ట్రంలోని నిర్మల్‌ జిల్లాలో ఇవాళ 2 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 505కు చేరింది. కాగా, కోవిడ్‌ వ్యాధి నిరోధానికి రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో రోగకారకాల నిర్మూలన ద్రవం చల్లడం కోసం ప్రభుత్వం డ్రోన్లను రంగంలో దింపింది.
  • అరుణాచల్‌ ప్రదేశ్‌: రాష్ట్రంలో కోవిడ్‌-19పై పోరాడుతున్న ముందువరుసలోని ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, పోలీసులుసహా ఇతర యోధులకు పసీఘాట్‌కు చెందిన జేఎన్‌ కాలేజి ఎన్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు ఇవాళ మాస్కులు పంపిణీ చేశారు.
  • అసోం: రాష్ట్రంలో కోవిడ్‌-19 రోగి ఎవరూ చనిపోలేదని ఆరోగ్యశాఖ మంత్రి హిమంత విశ్వశర్మ స్పష్టం చేశారు. ఈ మేరకు గువహటి వైద్యకళాశాల ఆస్పత్రిలో ఒకరు మరణించినట్లు ఓ స్థానిక పత్రిక ప్రచురించిన కథనం అవాస్తవమని పేర్కొన్నారు.
  • మణిపూర్‌: రాష్ట్రంలో (పైపులద్వారా లేదా పడకల పక్కన) ప్రాణవాయు సరఫరా సదుపాయాల కోసం అన్వేషించాలని ప్రభుత్వ ప్ర్రధాన కార్యదర్శి ఆరోగ్యశాఖను ఆదేశించారు.  
  • మిజోరం: మిజోరంలో నిత్యావసరాలు సరఫరాచేసే వాహనాల డ్రైవర్లు, ఇతర కార్మికుల భద్రత దిశగా వారి ఆరోగ్య రక్షణకు అన్నివిధాలా సహాయసహకారాలు అందించాలని రవాణా శాఖ మంత్రి అధికారులను ఆదేశించారు.
  • మేఘాలయ: రాష్ట్రంలోని పశ్చిమ జైంటియా పర్వతప్రాంత జిల్లాల్లో ప్రజలకు సహాయం అందించదలచిన రాష్ట్రంలోని లేదా ఇతర రాష్ట్రాలకు చెందిన స్వచ్ఛంద, ఇతర సేవా సంస్థలు, వ్యక్తులు సంబంధిత అధికారుల వద్ద పేర్లు నమోదు చేసుకోవాలని ఆయా జిల్లాల కమిషనర్లు ఆదేశించారు.
  • నాగాలాండ్‌: దిమాపూర్‌లో 363 మందికి ఆశ్రయం కల్పించిన 3 సహాయకేంద్రాలు మళ్లీ పనిచేయడం ప్రారంభించాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే జిల్లా యంత్రాంగాలుసహా స్వచ్ఛంద సంస్థలు మరో 2,000 మందికి ఆహారధాన్యాలు, ఇతర వస్తువులు సరఫరా చేసినట్లు పేర్కొంది.
  • సిక్కిం: కోవిడ్‌-19 నేపథ్యంలో ఎదుర్కొంటున్న సవాళ్లపై తదుపరి నిర్ణయాలు తీసుకునే దిశగా ఈ నెల 15వ తేదీన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.   
  • త్రిపుర: రాష్ట్రంలోని ఇటుకల పరిశ్రమలో పనిచేస్తున్న 21,899 మంది వలస కార్మికుల సహాయార్థం రూ.3.58 కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిధులతో ప్రతి కార్మికుడికీ రూ.1,000 నగదులోపాటు 20 రోజులకు సరిపడా రేషన్‌ వస్తువులు సరఫరా చేస్తారు.
  • మహారాష్ట్ర: దిగ్బంధ సమయంలో క్వారంటైన్‌ మార్గదర్శకాలను, నిషేధాజ్ఞలను ఉల్లంఘించిన ఆరోపణలపై పోలీసులు 35,000 కేసులు నమోదు చేశారు. మరోవైపు 134 మందికి వ్యాధి నిర్ధారణ కావడంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 1,895కు చేరింది.
  • మధ్యప్రదేశ్‌: దేశంలో మహారాష్ట్ర తర్వాత కోవిడ్‌-19 మరణాల రీత్యా మధ్యప్రదేశ్‌ రెండో స్థానంలో ఉంది. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం మహారాష్ట్రలో ఇప్పటివరకూ 127 మంది మరణించగా మధ్యప్రదేశ్‌లో 36 కరోనా వైరస్‌ మరణాలు నమోదయ్యాయి.  
  • రాజస్థాన్‌: రాష్ట్రంలో 151 తాజా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 751కి చేరింది. ఇప్పటిదాకా వ్యాధిబారిన పడినవారిలో 21 మంది కోలుకోగా, ముగ్గురు మరణించారు.
  • గుజరాత్‌: రాష్ట్రంలో ఇవాళ 67 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 308కి చేరింది. ఇప్పటివరకూ వైరస్‌ సంక్రమించినవారిలో 31 మంది కోలుకోగా, 19 మరణాలు నమోదయ్యాయి.
  • జమ్ముకశ్మీర్‌: ఈ కేంద్రపాలిత ప్రాంతంలో ఇవాళ 21 కేసులు నమోదయ్యాయి. వీటిలో 17 కశ్మీర్‌ డివిజన్‌, మిగిలిన 4 జమ్ము డివిజన్‌ పరిధిలోనివి కాగా మొత్తం కేసుల సంఖ్య 245కు చేరింది.

 

 

https://pbs.twimg.com/profile_banners/231033118/1584354869/1500x500

 

******


(Release ID: 1613761) Visitor Counter : 364