హోం మంత్రిత్వ శాఖ

వలస కార్మికులను పునారావాస గృహాల్లో ఆశ్రయం కల్పించాలన్న సర్వోన్నత న్యాయస్థాన ఆదేశాన్ని అమలుపరచాలని అన్ని రాష్ట్రాల మరియు కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలను వ్రాసిన కేంద్ర హోం శాఖ

Posted On: 12 APR 2020 5:03PM by PIB Hyderabad

కొవిడ్-19 వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రభుత్వం విధించిన లాక్డౌన్ను సమర్థవంతంగా అమలుపరచడంలో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లోని వలస కార్మికులకు పునరావాస గృహాల్లో ఆశ్రయం కల్పించాలన్న సర్వోన్నత న్యాయస్థాన ఆదేశాన్ని అమలుపరచాలని అన్ని రాష్ట్ర మరియు కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలకు కేంద్ర హోం శాఖ  లేఖలు వ్రాసింది.

దేశ వ్యాప్తంగా ఉన్న వలస కార్మికులకు పునరావాస కేంద్రాల్లో సరియైన వైద్య, ఆహార, పరిశుభ్రమైన త్రాగు నీరు మరియు పరిసర ప్రాంతాలు పరిశుభ్రతను కల్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. వారి ఎటువంటి భయం లేకుండా ఉండేలా సౌకర్యాలతోపాటు అన్ని రకాల విశ్వాసాల ప్రకారం శిక్షణ పొందిన హిత బోధకులను  లేదా నాయకులను ఆయా కేంద్రలను సందర్శించేలా చేయాలని ఆదేశించింది.

వలస కార్మికుల భయాన్ని మరియు ఆందోళనను పోలీసు వారు మరియు ఇతర యంత్రాంగం మానవతా దృక్పథంతో అర్థం చేసుకుని ఆయా రాష్ట్ర మరియు కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలు పోలీసులతోపాటు  స్వచ్ఛంద సేవకుల సహకారం, పర్యవేక్షణలో వారి సంరక్షణకు, సంక్షేమానికి పాటుపడాలని తెలిపింది.

సర్వోన్నత న్యాయస్థాన ఆదేశాలతోపాటుగా కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ వారి ఆదేశాలను, మార్గదర్శకాలను కూడా పాటించాలని  కేంద్ర హోం శాఖ అన్ని రాష్ట్ర మరియు కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాలకు వ్రాసిన లేఖలో పేర్కొంది. వలస కార్మికుల్లో మానసిక సంబంధింత సమస్యలు ఏవైనా ఉంటే వాటిని నిర్వహించడానికి తగిన మార్గదర్శకాలను విడుదల చేసింది, ఆ మార్గదర్శకాలను  తెలుసుకోవడానికి https://www.mohfw.gov.in/pdf/RevisedPsychosocialissuesofmigrantsCOVID19.pdf వెబ్సైట్ సందర్శించవచ్చు.


(Release ID: 1613695)