ప్రధాన మంత్రి కార్యాలయం
కోవిడ్ -19 ను ఎదుర్కొనేందుకు భవిష్యత్ వ్యూహరచనపై ముఖ్యమంత్రులతో చర్చించిన ప్రధానమంత్రి
లాక్ డౌన్ ను మరో రెండు వారాలు పొడిగించాలని సూచించిన ముఖ్యమంత్రులు
గతంలో మన మంత్రం ‘జాన్ హై తో జహాన్ హై’, కానీ ఇప్పుడు మన మంత్రం ‘జాన్ భి జహాన్ భి’ : ప‌్రధానమంత్రి
వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ఇప్పటివరకూ తీసుకున్న చర్యల ప్రభావాన్ని నిర్ణయించడానికి రాగల 3-4 రోజులు ఎంతో కీలకమైనవి : ప‌్రధానమంత్రి
వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలను సులభతరం చేయడానికి, ఎపిఎంసి చట్టాలను సవరించడంతో సహా వ్యవసాయం , అనుబంధ రంగాల కోసం నిర్దిష్ట చర్యలను సూచించిన ప్రధానమంత్రి
కోవిడ్ -19 పై పోరాటంలో కీలక ఉపకరణం ఆరోగ్య సేతు యాప్, ముందు ముందు ఇది పర్యటనలకు ఈ -పాస్ గా పనిచేస్తుంది: ప‌్రధాని
ఆరోగ్య రంగంలోని వారిపై జరుగుతున్నదాడులను, ఈశాన్య రాష్ట్రాలు, కాశ్మీర్ యువత పట్ల అనుచిత ప్రవర్తనకు సంబంధించిన ఘటనలను ఖండించిన ప్రధానమంత్రి
దేశంలో అత్యవసర మందుల సరఫరా తగినంతగా ఉందని హామీ ఇచ్చిన ప్రధానమంత్రి,
బ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్వలకు పాల్పడేవారికి గట్టి హెచ్చరికచేసిన ప్రధాని
Posted On:
11 APR 2020 4:39PM by PIB Hyderabad
కోవిడ్ - 19 ను ఎదుర్కొనేందుకు భవిష్యత్ వ్యూహరచనపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి ఈతరహా సమావేశం నిర్వహించడం ఇది మూడవసారి.ఇంతకుముందు ప్రధానమంత్రి 2020 మార్చి 20న, ఏప్రిల్ 2న ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి కృషి కోవిడ్ -19 ప్రభావం తగ్గడానికి తప్పకుండా ఉపయోగపడిందని ప్రధానమంత్రి అభిప్రాయపడ్డారు. అయితే ఎప్పటికప్పుడు పరిస్థితి మారుతున్నందున నిరంతరం అప్రమత్తంగా ఉండడం అత్యంత కీలకమని ప్రధానమంత్రి అన్నారు. కోవిడ్ వైరరస్‌ను అదుపు చేయడంలో ఇప్పటివరకూ తీసుకున్నచర్యల ప్రభావాన్ని నిర్ణయించడంలో రానున్న3-4 వారాలు ఎంతో కీలకమకీలకమైనవని ప్రధానమంత్రి అన్నారు. కోవిడ్ -19 సవాలును ఎదుర్కోవడంలో టీమ్ వర్క్ ఎంతో కీలకమైనదని ప్రధానమంత్రి అన్నారు.
దేశంలో అవసరమైన ఔషధాల సరఫరా తగినంతగా ఉందని ప్రధాని హామీ ఇచ్చారు .కోవిడ్ -19 పై పోరాటంలో ముందుండి పనిచేస్తున్న వారందరికీ అవసరమైన రక్షణ, కీలక పరికరాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టు ప్రధానమంత్రిచెప్పారు. బ్లాక్ మార్కెటింగ్,అక్రమ నిల్వదారులకు ప్రధాని గట్టి హెచ్చరిక చేశారు. వైద్యులు, ఆరోగ్య సిబ్బందిపై దాడుల ఘటనలు, ఈశాన్యరాష్ట్రాలు, జమ్ము కాశ్మీర్ విద్యార్ధుల అనుచితంగా ప్రవర్తించిన ఘటనల పట్ల ప్రధానమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిపట్ల కఠినంగా వ్యవహరించాల్సి ఉందన్నారు. లాక్‌డౌన్ సందర్భంగా నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడకుండా చూడాల్సిన అవసరం ఉందని, సామాజిక దూరం పాటించేలా చూడాలని కోరారు.
లాక్ డౌన్ నుంచి బయటపడేందుకు ఎగ్జిట్ ప్లాన్ గురించి మాట్లాడుతూ ప్రధానమంత్రి, లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగింపుపై రాష్ట్రాల మద్య ఏకాభిప్రాయం ఉన్నట్ట అనిపిస్తోందని ప్రధానమంత్రి అన్నారు. గతంలో ప్రభుత్వ నినాదం‘ జాన్ హై తో జహాన్ హై’ గా ఉండేదని అయితే ఇప్పుడు అది ‘జాన్ భి, జహాన్ భి ’ అని ఆయన అన్నారు.
ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన మౌలిక సదుపాయాలను, టెలిమెడిసిన్ ద్వారా పేషెంట్లకు సేవలు అందించడాన్ని బలోపేతం చేయడం గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. మండీలలో జనం గుంపులుగా చేరకుండా నిరోధించేందుకు వ్యవసాయ ఉత్పత్తుల డైరక్ట్ మార్కెటంగ్‌ను ప్రోత్సహించవచ్చని సూచించారు. ఇందుకు వెంటనే ఎపిఎంసి చట్టాలను సంస్కరించాలని ఆయన సూచించారు. ఇలాంటి చర్యలు తమ ఉత్పత్తులను ఇంటివద్దే అమ్మడానికి రైతులకు ఉపకరిస్తాయి.
ఆరోగ్యసేతు యాప్‌ను ఎక్కువమంది డౌన్ లోడ్ చేసుకునే విధంగా దానికి ప్రాచుర్యం కల్పించడం గురించి కూడా ప్రధానమంత్రి మాట్లాడారు.
వైరస్ ఎవరినుంచ ఎలా వ్యాప్తి చెందుతున్నదో తెలుసుకోవడంలో దక్షిణ కొరియా , సింగపూర్‌లు ఎలా విజయం సాధించాయో ఆయన ప్రస్తావించారు. ఆ అనుభవాల ఆధారంగా, మనదేశం కోవిడ్ -19 మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడటానికి ఈ యాప్ ద్వారా తనదైన ప్రయత్నం చేసింది. ఇది వైరస్ వ్యాప్తి నిరోధ యత్నంలో కీలక ఉపకరణం కాగలదని ప్రధానమంత్రి అన్నారు.
ముందు ముందు ఈ యాప్ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణించడానికి ఈ -పాస్ గా ఉపయోగపడే వీలుంది.
ఆర్థిక సవాళ్లగురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, స్వావలంబన సాధించడానికి , దేశాన్ని ఆర్థిక పవర్ హౌస్ గా మార్చడానికి ఈ సంక్షోభం ఒక అవకాశమని అన్నారు.
ముఖ్యమంత్రులు, తమ తమ రాష్ట్రాలలో నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసుల గురించి, ప్రజలు సామాజిక దూరం పాటించేలా చేయడానికి తీసుకున్న చర్యల గురించి , ఆరోగ్య మౌలికసదుపాయాల పెంపు , వలసదారుల ఇబ్బందులను తొలగించడం, నిత్యావసర సరకుల సరఫరా కొనసాగింపు తదితర అంశాలపై తమ స్పందనను తెలియజేశారు. లాక్‌డౌన్ ను మరో రెండు వారాలు పొడిగించాలని ముఖ్యమంత్రులు సూచించారు. కోవిడ్ మహమ్మారిపై పోరాటానికి తమ వనరులను పెంచడానికి ఆర్థిక, ద్రవ్యపరమైన సహాయాన్ని అందిచాల్సిందిగా వారు కేంద్రాన్ని కోరారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర హోంమంత్రి , రక్షణ మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి, కేంద్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ, కేబినెట్ సెక్రటరీ, కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
******
(Release ID: 1613373)
Visitor Counter : 294
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam