సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

కేంద్ర అడ్మినిస్ర్టేటివ్ ట్రిబ్యునల్ పత్రికా ప్రకటన

Posted On: 11 APR 2020 11:04AM by PIB Hyderabad

కేసుల పరిష్కారాన్ని కోరుతూ ట్రిబ్యునల్ ముందుకు వచ్చిన వారికి సంతృప్తికరంగా ఉండే విధంగా పని చేస్తూ వీలైనన్ని ఎక్కువ కేసులను పరిష్కరించడం కోసం సెంట్రల్ అడ్మినిస్ర్టేటివ్ ట్రిబ్యునల్ ప్రధాన బెంచి, దేశంలోని విభిన్న బెంచిలు కృషి చేస్తున్నాయి. వాస్తవానికి 2020 ఫిబ్రవరి వరకు కేసుల పరిష్కార ప్రక్రియ అద్భుతంగా ఉంది.

కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపించడంతో సామాజిక దూరం నిర్వహించడం లక్ష్యంగా సిటింగ్ లను ఏర్పాటు చేయడం జరిగింది. కాని మార్చి 22వ తేదీ నుంచి ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా అది కూడా అసాధ్యం అయింది. దేశవ్యాప్త లాక్ డౌన్ అమలు జరుగుతున్నందు వల్ల అడ్వకేట్లు గాని, ఉద్యోగులు గాని బెంచిలకు రాలేని పరిస్థితి ఏర్పడడంతో  ట్రిబ్యునల్స్ పని అసాధ్యంగా మారింది. తగినన్ని పరికరాలు అందుబాటులో లేకపోవడం, లాక్ డౌన్ కారణంగా ఆ పరికరాలు సమకూర్చుకోలేని పరిస్థితి నెలకొనడం వల్ల  వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారా విచారణ జరపడం సాధ్యం కావడంలేదు. ముందుగానే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ప్రధాన బెంచి ఏప్రిల్ 2 నుంచి 12 వరకు మినీ వెకేషన్ లో ఉండాల్సివచ్చింది.

2020 ఏప్రిల్ 15 తర్వాత ప్రభుత్వం తీసుకునే చర్యలను బట్టి తదుపరి కార్యాచరణ ఆధారపడి ఉంటుంది. కోర్టుల నిర్వహణకు ఏ మాత్రం అవకాశం ఉన్నా దాన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది.
 



(Release ID: 1613254) Visitor Counter : 188