PIB Headquarters
కోవిడ్-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం
• దేశంలో కోవిడ్-19 తాజా నిర్ధారిత కేసుల సంఖ్య 5,734 కాగా, 166 మరణాలు నమోదయ్యాయి. కాగా, కోలుకున్న/వ్యాధి నయమైనవారు 473 మంది ఇళ్లకు వెళ్లారు.
• దేశంలో ‘కోవిడ్-19పై అత్యవసర ప్రతిస్పందన-ఆరోగ్య వ్యవస్థ సంసిద్ధత ప్యాకేజీ’ కింద రూ.15వేల కోట్లు మంజూరు.
• కోవిడ్-19 ప్రస్తుత స్థితి, తదుపరి నిర్వహణ చర్యలపై మంత్రివర్గ ఉపసంఘం ఉన్నతస్థాయి సమీక్ష
• భారత్-అమెరికాల భాగస్వామ్యం ఎన్నడూ లేనంత పటిష్ఠంగా ఉందని ప్రధానమంత్రి చెప్పారు.
• సహాయం లక్ష్యంగా స్వచ్ఛంద సంస్థలు ఎఫ్‌సీఐనుంచి ఆహారధాన్యాలు కొనేందుకు అనుమతి
• కంపెనీల అసాధారణ సర్వసభ్య సమావేశాల నిర్వహణకు నిబంధనల సడలింపు
Posted On:
09 APR 2020 7:20PM by PIB Hyderabad
(కోవిడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు
పీఐబీ వాస్తవాలను తనిఖీచేసిన అంశాలు ఇందులో లభ్యమవుతాయి)
కోవిడ్-19పై ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నుంచి తాజా సమాచారం
దేశవ్యాప్తంగా కోవిడ్-19పై తాజా సమాచారం ప్రకారం- నిర్ధారిత కేసుల సంఖ్య 5,734 కాగా- 166 మరణాలు నమోదయ్యాయి. వైరస్ బారినపడి కోలుకున్న/పూర్తిగా నయమైన 473 మంది ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వెళ్లారు. కాగా- సామూహిక నియంత్రణ, ఆస్పత్రుల (కోవిడ్-19 రోగుల కోసం ఐసీయూలు-వెంటిలేటర్ల నిర్వహణ) సంసిద్ధతకు సంబంధిత కార్యకలాపాల్లో రాష్ట్ర ఆరోగ్యశాఖలకు సహాయపడటం కోసం ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ ఉన్నతస్థాయి కేంద్ర బహుళ విభాగ ప్రతినిధి బృందాలను ఏర్పాటు చేసింది.
మరిన్ని వివరాలకు :
దేశంలో ‘కోవిడ్-19పై భారత అత్యవసర ప్రతిస్పందన-ఆరోగ్య వ్యవస్థ సంసిద్ధత ప్యాకేజీ’ కింద రూ.15వేల కోట్లు మంజూరు
‘కోవిడ్-19పై భారత అత్యవసర ప్రతిస్పందన-ఆరోగ్య వ్యవస్థ సంసిద్ధత’ కోసం కేంద్ర ప్రభుత్వం గణనీయ స్థాయిలో పెట్టుబడుల కోసం రూ.15,000 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. ఈ నిధుల నుంచి కోవిడ్-19 అత్యవసర ప్రతిస్పందన చర్యల కోసం (రూ.7,774కోట్లు), మిగిలిన మొత్తాన్ని మధ్యంతర కాలపు మద్దతు (1 నుంచి 4సంవత్సరాలు) కోసం సంపూర్ణ స్థాయిలో అందజేస్తుంది.
మరిన్ని వివరాలకు :
కోవిడ్-19 ప్రస్తుత స్థితి, తదుపరి నిర్వహణ చర్యలపై మంత్రివర్గ ఉపసంఘం ఉన్నతస్థాయి సమీక్ష
కోవిడ్-19 నియంత్రణ, నిర్వహణపై మంత్రివర్గ ఉపసంఘం (GoM) ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో కూలంకషంగా చర్చించింది. అలాగే ఇప్పటిదాకా చేపట్టిన చర్యలతోపాటు నిరోధక వ్యూహంలో భాగమైన సామాజిక దూరం అనుసరణ సంబంధిత చర్యలను, మహమ్మారి వ్యాప్తి నిరోధానికి కేంద్ర-రాష్ట్రాలు తీసుకున్న పటిష్ఠ చర్యలపైనా లోతుగా చర్చించింది.
మరిన్ని వివరాలకు :
ఎన్నడూ లేనంత పటిష్టంగా భారత్-అమెరికాల భాగస్వామ్యం: ప్రధానమంత్రి
భారత్-అమెరికాల భాగస్వామ్యం ఎన్నడూ లేనంత పటిష్టంగా ఉందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ స్పష్టం చేశారు. కోవిడ్-19పై పోరులో భాగంగా అమెరికాకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ సరఫరా చేయాలన్న భారత్ నిర్ణయానికి గౌరవనీయ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్‌ద్వారా కృతజ్ఞతలు తెలపడంపై శ్రీ మోదీ ఈ మేరకు స్పందించారు.
మరిన్ని వివరాలకు :
సహాయ కార్యక్రమాల కోసం ఎఫ్‌సీఐ నుంచి నేరుగా ఆహారధాన్యాల కొనుగోలు కోసం స్వచ్ఛంద సంస్థలకు అనుమతి
జాతీయ దిగ్బంధం నేపథ్యంలో వేలాది పేదలకు ఆహార సరఫరాలో స్వచ్ఛంద-ధార్మిక సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అందువల్ల ఈ సంస్థలకు నిరంతర ఆహార ధాన్యాల సరఫరా దిశగా ఎలక్ట్రానిక్ వేలంతో నిమిత్తం లేకుండా నేరుగా బహిరంగ మార్కెట్ విక్రయ పథకం కింద అదే ధరలకు గోధుమలు, బియ్యం తదితరాలను నేరుగా అందించాలని కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐని ఆదేశించింది.
మరిన్ని వివరాలకు:
కంపెనీలు అసాధారణ సర్వసభ్య సమావేశాలను దృశ్య-శ్రవణ లేదా అదేవిధమైన మాధ్యమాల ద్వారా నిర్వహించుకోవడంతోపాటు ఈ-ఓటింగ్/ రిజిస్టర్డ్ ఈ-మెయిల్ ద్వారా సరళ ఓటింగ్ పద్ధతికి కార్పొరేట్ వ్యవహారాల శాఖ అనుమతి
లిస్టెడ్ లేదా 1,000 మంది అంతకన్నా ఎక్కువ వాటాదారులున్న, కంపెనీల చట్టం-2013 కింద ఎలక్ట్రానిక్ ఓటింగ్ సదుపాయం కల్పించాల్సిన కంపెనీలు దృశ్య-శ్రవణ లేదా అదేవిధమైన మాధ్యమాల ద్వారా అసాధారణ సర్వసభ్య సమావేశాలను నిర్వహించుకునేందుకు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ 08.04.2020న జనరల్ సర్క్యులర్ నం.14/2020 ద్వారా అనుమతించింది. ఇతర కంపెనీలు అత్యంత సరళీకృత పద్ధతిలో రిజిస్టర్డ్ ఈ-మెయిల్‌ద్వారా ఓటింగ్ నిర్వహించుకునేందుకు అనుమతించింది.
రైతుల కోసం చేపట్టిన ఉపశమన చర్యలపై సమీక్షకు శ్రీ నరేంద్రసింగ్ తోమర్ అధ్యక్షతన రాష్ట్రాల వ్యవసాయ శాఖ మంత్రుల సమావేశం
కోవిడ్-19 ప్రపంచ మహమ్మారి సవాలు విసిరిన సమయంలోనూ వ్యవసాయ కార్యకలాపాలపై రాష్ట్రాలు చూపిన చొరవను కేంద్ర మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి ప్రశంసించారు. వ్యవసాయ సంబంధ కార్యకలాపాలకు కేంద్రం ఇచ్చిన మినహాయింపులపై క్షేత్రస్థాయి సంస్థలకు అవగాహన కల్పించాలని రాష్ట్రాలను కోరారు. అలాగే వ్యవసాయ-అనుబంధ ఉత్పత్తులు, ఎరువులు, సాగు ఉపకరణాలు, యంత్రపరికరాల రవాణాను అనుమతించాల్సిందిగా సూచించారు.
మరిన్ని వివరాలకు:
పారిశ్రామిక-వాణిజ్య వర్గాల సంఘాలతో కేంద్ర వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ సమావేశం; వారి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని హామీ
కోవిడ్-19 వ్యాప్తి, అనంతర జాతీయ దిగ్బంధం నేపథ్యంలో దేశంలోని పారిశ్రామిక, వాణిజ్య వర్గాలకు క్షేత్రస్థాయిలో ఎదురైన సమస్యలపై అంచనా నిమిత్తం ఆయా సంఘాలతో శ్రీ పీయూష్ గోయల్ ఇవాళ సమావేశమయ్యారు. వారికి సంబంధించిన సౌకర్యాల కల్పనసహా ఎగుమతి/దిగుమతి సంబంధిత సమస్యల పరిష్కారానికి తమ మంత్రిత్వ శాఖ ఇప్పటికే కృషి చేస్తున్నదని తెలిపారు. దీంతోపాటు ఇతరత్రా సమస్యలపైనా సంబంధిత మంత్రిత్వశాఖలతో చర్చిస్తున్నట్లు వెల్లడించారు.
మరిన్ని వివరాలకు:
కోవిడ్ అనంతర పరిస్థితులను విశాల దృక్పథంతో ఎదుర్కొనేలా ఎగుమతిదారులు శక్తియుక్తులను ప్రోదిచేసుకోవాలి: శ్రీ పీయూష్ గోయల్ పిలుపు; మనమంతా బాధ్యతాయుత ప్రపంచ పౌరులమని స్పష్టీకరణ
కేంద్ర వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఇవాళ కోవిడ్-19, జాతీయ దిగ్బంధం నేపథ్యంలో ఎగుమతిదారుల సమస్యలు, క్షేత్రస్థాయి పరిస్థితులపై అంచనా కోసం దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా ఎగుమతిదారు మండళ్ల ప్రతినిధులతో చర్చించారు.
తపాలా జీవిత బీమా, గ్రామీణ తపాలా జీవిత బీమా రుసుముల చెల్లింపు గడువు 2020 జూన్ 30దాకా పొడిగింపు
తపాలా బీమా/గ్రామీణ తపాలా బీమా పాలసీదారులకు వెసులుబాటు కల్పిస్తూ 2020 మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించిన రుసుములను ఎలాంటి జరిమానా లేకుండా 2020 జూన్ 30 దాకా చెల్లింపు గడువును పొడిగిస్తున్నట్లు తపాలాశాఖ పరిధిలోని డైరెక్టరేట్ ఆఫ్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రకటించింది.
మరిన్ని వివరాలకు.:
కోవిడ్-19పై ఫిర్యాదులు-పరిష్కారానికి నవీకృత ‘స్వచ్ఛత యాప్’ను ప్రారంభించిన కేంద్ర గృహనిర్మాణ-పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ
కేంద్ర గృహనిర్మాణ-పట్టణ వ్యవహారాల శాఖ నవీకృత ‘స్వచ్ఛత-మొహువా’ (Swachhata-MoHUA) యాప్‌ను నిన్న ప్రారంభించింది. ప్రస్తుతం స్వచ్ఛభారత్ మిషన్ (అర్బన్) కింద ఈ యాప్‌ను దేశంలో 1.7 కోట్ల మందికిపైగా వాడుతున్నారు. ఈ నేపథ్యంలో పట్టణ పాలక సంస్థలు కోవిడ్-19పై ఫిర్యాదులు స్వీకరించి, పరిష్కరించేలా దీన్ని పూర్తిగా నవీకరించి విడుదల చేశారు.
మరిన్ని వివరాలకు:
ఆరు లక్షల పునరుపయోగ ఫేస్ మాస్కులను, 40,000 లీటర్ల హస్త పరిశుభ్రత ద్రవాన్ని తయారు చేసిన భారత రైల్వే శాఖ
కోవిడ్-19 వ్యాప్తి నిరోధక చర్యల కొనసాగింపులో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య సంరక్షణ కార్యకలాపాలకు భారత రైల్వేశాఖ అన్నివిధలా తనవంతు చేయూతనిస్తోంది. ఈ దిశగా పునరుపయోగానికి వీలున్న ఫేస్ మాస్కులను, భారీస్థాయిలో హస్త పరిశుభ్ర ద్రవాన్ని తమ జోనల్ రైల్వేల పరిధిలోగల ఉత్పత్తి యూనిట్లు, ప్రభుత్వరంగ కంపెనీలలో తయారుచేయిస్తోంది.
మరిన్ని వివరాలకు:
సామాజిక సేవా కర్తవ్యంలో భాగంగా మార్చి 28 నుంచి పేదలకు 8.5 లక్షల ఆహార ప్యాకెట్లు పంపిణీ చేసిన రైల్వేశాఖ
కోవిడ్-19వల్ల జాతీయ దిగ్బంధం విధించాక భారత రైల్వేశాఖ నిరుపేదలకు ఆహార ప్యాకెట్లు పంపిణీ చేయడం ప్రారంభించింది. ఈ మేరకు ఐఆర్‌సీటీసీ ప్రధాన వంటశాలు, ఆర్పీఎఫ్ వనరులు, స్వచ్ఛంద సంస్థల తోడ్పాటుతో అన్నార్తులకు మధ్యాహ్న, రాత్రి భోజన ప్యాకెట్లతోపాటు పేపర్ ప్లేట్లను కూడా సరఫరా చేస్తోంది. ఈ మేరకు పేదలు, అనాథలు, యాచకులు, పిల్లలు, కూలీలు, వలస కార్మికులు, అనూహ్యంగా ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ఇతరులు రైల్వే సౌజన్యంతో ఆకలి తీర్చుకోగలుగుతున్నారు. అంతేకాకుండా రైల్వేస్టేషన్ల సమీపంలో, అక్కడికి కొంత దూరప్రాంతంలో కూడా ఆకలితో వచ్చినవారికి లేదనకుండా అన్నదానం చేస్తోంది.
మరిన్ని వివరాలకు:
ప్రధానమంత్రి – కొరియా రిపబ్లిక్ అధ్యక్షుడి మధ్య టెలిఫోన్ సంభాషణ
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ కొరియా రిపబ్లిక్ అధ్యక్షుడు మాననీయ మూన్-జే-ఇన్‌తో టెలిఫోన్‌లో సంభాషించారు. ప్రపంచ మహమ్మారి కోవిడ్-19 అంతర్జాతీయ ఆరోగ్య వ్యవస్థకు విసిరిన సవాలుతోపాటు ఆర్థిక వ్యవస్థల స్థితిగతులపై ఈ సందర్భంగా దేశాధినేతలిద్దరూ చర్చించారు. అలాగే మహమ్మారి నిరోధం, నియంత్రణకు తమతమ దేశాల్లో అనుసరించిన చర్యలపై సమాచారం ఇచ్చిపుచ్చుకున్నారు.
మరిన్ని వివరాలకు:
ప్రధానమంత్రి – ఉగాండా రిపబ్లిక్ అధ్యక్షుడి మధ్య టెలిఫోన్ సంభాషణ
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఉగాండా రిపబ్లిక్ అధ్యక్షుడు మాననీయ యోవెరి కగుటా ముసేవినీతో టెలిఫోన్‌లో సంభాషించారు. ప్రపంచ మహమ్మారి కోవిడ్-19 అంతర్జాతీయ ఆరోగ్య వ్యవస్థతోపాటు ఆర్థిక వ్యవస్థలకు విసిరిన సవాలుపై ఈ సందర్భంగా దేశాధినేతలిద్దరూ చర్చించారు. ప్రస్తుత ఆరోగ్య సంక్షోభంలో ఆఫ్రికాలోని తమ మిత్రదేశాలకు భారత్ సంఘీభావం ప్రకటిస్తున్నదని ప్రధానమంత్రి తెలిపారు. అలాగే ఉగాండాలో వైరస్ వ్యాప్తి నిరోధానికి అన్నివిధాలా సహాయసహకారాలు అందిస్తామని గౌరవనీయ ముసేవినీకి ప్రధానమంత్రి హామీ ఇచ్చారు.
మరిన్ని వివరాలకు:
కోవిడ్-19పై సమష్టి పోరాటానికి ప్రభుత్వ, ప్రైవేటు, ఇతర సంబంధిత విమానయాన సంస్థల నిర్విరామ చేయూత
కోవిడ్-19 దిగ్బంధం నేపథ్యంలో అత్యవసర వైద్య సరఫరాలుసహా ఐసీఎంఆర్, హెచ్‌ఎల్‌ఎల్, తదితర సంస్థల వస్తు సామగ్రి చేరవేత నిరాఘాటంగా సాగింది. దేశీయ ప్రభుత్వ, ప్రైవేటు విమానయాన సంస్థలు ఎయిరిండియా, ఐఏఎఫ్, పవన్‌హన్స్, ఇండిగో, బ్లూడార్ట్ తదితర విమానాలు మందులతోపాటు ఐసీఎంఆర్, హెచ్‌ఎల్‌ఎల్ రూపొందించిన వస్తు సామగ్రిని రవాణా చేశాయి. ఈ మేరకు 08.04.2020న కూడలి ప్రాంతాల నుంచి శ్రీనగర్, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, భువనేశ్వర్ తదితర ప్రాంతాలకు చేరవేశాయి.
మరిన్ని వివరాలకు:
స్మార్ట్ సిటీలలోని బహిరంగ స్థలాల్లో ఇన్ఫెక్షన్ తొలగింపు
కోవిడ్-19ను ప్రపంచ మహమ్మారిగా ప్రకటించిన నాటినుంచీ భారత్‌లోని నగరాల్లో పరిశుభ్రతకు గణనీయ ప్రాధాన్యం ఇచ్చారు. ప్రత్యేకించి ముప్పు ఎక్కువగా ఉన్నట్లు భావించిన బహిరంగ ప్రదేశాలలో ఇన్ఫెక్షన్ వ్యాప్తి నిరోధానికి పటిష్ఠ చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత మార్చి 25న జాతీయ దిగ్బంధం ప్రకటించింది మొదలు ఈ దిశగా అన్ని నగరాలూ ఉద్యమస్థాయిలో చర్యలు చేపట్టాయి. ఆ మేరకు రైల్వే/బస్సు స్టేషన్లు, వీధులు మార్కెట్లు, ఆస్పత్రుల పరిసరాలు, బ్యాంకులు తదితర బహిరంగ ప్రదేశాల్లో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యమిచ్చాయి.
మరిన్ని వివరాలకు:
జేఈఈ (మెయిన్) 2020 ఆన్‌లైన్ దరఖాస్తులో పరీక్ష కేంద్ర నగరాల ఎంపికను సరిచేసుకునే అవకాశం పొడిగించిన జాతీయ పరీక్షల ప్రాధికార సంస్థ
కోవిడ్-19 పరిస్థితుల నేపథ్యంలో జేఈఈ (మెయిన్)2020కి హాజరయ్యే అభ్యర్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, వారి ఆన్‌లైన్ దరఖాస్తులలో పరీక్ష కేంద్రాల ఎంపికను సరిచేసుకునే అవకాశం పొడిగించాల్సిందిగా జాతీయ పరీక్షల ప్రాధికార సంస్థ (NTA)ను హెచ్‌ఆర్‌డి మంత్రి ఆదేశించారు. తదనుగుణంగా ఎన్‌టీఏ విద్యార్థులకు ఆ వెసులుబాటు కల్పించింది.
మరిన్ని వివరాలకు:
కోవిడ్-19 నిర్వహణకోసం మానవ వనరుల అభివృద్ధి శాఖ పరిధిలోని ‘దీక్ష’ వేదిక కింద ‘సమీకృత ప్రభుత్వ ఆన్‌లైన్ శిక్షణ’ (ఐగాట్) పోర్టల్ ప్రారంభం
కోవిడ్-19పై పోరులో భాగంగా సేవలందిస్తున్న డాక్టర్లు, నర్సులు, పారామెడికల్- సాంకేతిక సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, ఏఎన్ఎంలు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పౌర రక్షణాధికారులు, వివిధ పోలీసు సంస్థలు, ఎన్‌సీసీ సభ్యులు, నెహ్రూ యువ కేంద్ర సంఘటన్, జాతీయ సామాజిక సేవా పథకం కార్యకర్తలు, భారత రెడ్‌క్రాస్ సోసైటీ ప్రతినిధులు, భారత్ స్కౌట్స్-గైడ్స్ స్వచ్ఛంద కార్యకర్తలతోపాటు ఇతరుల కోసం ‘ఐగాట్’ కింద శిక్షణ కోర్సులు ప్రారంభించబడ్డాయి.
మరిన్ని వివరాలకు:
కోవిడ్ -19తో పోరులో ముందు వరుసనగల వారికి ‘ఐగాట్’ ఈ లెర్నింగ్ వేదిక ద్వారా సాధికారత కల్పించనున్న కేంద్ర సిబ్బంది-శిక్షణ వ్యవహారాల శాఖ
కోవిడ్-19పై ముందు వరుసన నిలిచి పోరాడుతున్న వారందరికీ ఒక శిక్షణ వేదిక (https://igot.gov.in)ను కేంద్ర సిబ్బంది-శిక్షణ వ్యవహారాల శాఖ సిద్ధం చేసింది. ఈ మేరకు వారికి శిక్షణ ఇవ్వడంతోపాటు ప్రపంచ మహమ్మారిని ఎదుర్కొనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందజేస్తుంది. అలాగే రెండో శ్రేణిలో మహమ్మారిపై యుద్ధం చేస్తున్నవారికీ కోవిడ్-19 శిక్షణద్వారా రాబోయే ముప్పును ఎదుర్కొనగల సంసిద్ధతను భారత్ సాధించగలదు.
దేశంలో ముఖ్యమైన అన్ని కేంద్రాలను జోడిస్తూ 58 మార్గాల్లో ప్రకటిత సమయాల్లో 109 పార్శిల్ రైళ్లను నడపనున్న భారత రైల్వేశాఖ
దేశవ్యాప్తంగా సరఫరా శృంఖలానికి ఉత్తేజమిచ్చే విధంగా భారత రైల్వేశాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నిత్యావసరాలు, ఇతరాల రవాణా కోసం ప్రకటిత సమయాల్లో పార్శిల్ రైళ్లను నడపనుంది. దీనివల్ల సామాన్యులకే కాకుండా పరిశ్రమ, వ్యవసాయ రంగాలకూ అవసరమైన కీలక వస్తువులు అందుబాటులోకి వస్తాయి.
కోవిడ్-19 దిగ్బంధంతో డిజిటల్ విద్యాభ్యాస ప్రక్రియకు భారీ ఊపు
పాఠశాలలుసహా ఉన్నత విద్యాసంస్థలన్నీ వివిధ రకాల ఆన్‌లైన్ తరగతుల నిర్వహణ ప్రక్రియను ప్రారంభించాయి. ఆ మేరకు వనరుల లభ్యతను బట్టి విద్యార్థులకు అధ్యయన సరంజామాను సమకూరుస్తున్నాయి. తదనుగుణంగా స్కైప్, జూమ్, గూగుల్ క్లాస్‌రూమ్, హ్యాంగవుట్, పియాషా తదితర మాధ్యమాలద్వారా తరగతుల నిర్వహణ సాగుతోంది. మరోవైపు బోధకులు పాఠ్యాంశాలను యూట్యూబ్, వాట్సాప్ తదితరాలద్వారా అప్‌లోడ్ చేస్తున్నారు. అలాగే స్వయం, ఎన్‌పీటీఈఎల్ లింకుద్వారా జర్నల్స్‌ను అందుబాటులోకి తెస్తున్నారు.
కోవిడ్-19 నేపథ్యంలో ఊరట కల్పించేందుకు పలు చర్యలు తీసుకున్న ఈఎస్‌ఐసీ
కోవిడ్-19 ప్రపంచ మహమ్మారి ఫలితంగా దేశం పెను సవాలును ఎదుర్కొంటోంది. దీంతో సామాజిక దూరం పాటించే దిశగా దేశం మొత్తం దిగ్బంధితమైంది. ఈ నేపథ్యంలో తమ భాగస్వాములకు, చందాదారులకు ఊరట కల్పించేందుకు ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) పలురకాల చర్యలు చేపట్టింది.
గిరిజనులు సురక్షితంగా అటవీ ఉత్పత్తుల సేకరణ కొనసాగించడంలో తోడ్పడే విధంగా స్వయం సహాయ బృందాలకు యూనిసెఫ్ సహకారంతో డిజిటల్ ప్రచార కార్యక్రమం ప్రారంభించనున్న ట్రైఫెడ్
గిరిజనులు సురక్షితంగా అటవీ ఉత్పత్తుల సేకరణను కొనసాగించేలా చూసే దిశగా యూనిసెఫ్ సహకారంతో ట్రైఫెడ్ డిజిటల్ సమాచార ప్రదాన వ్యూహాన్ని సిద్ధం చేయనుంది. దీని సాయంతో ఈ పనిలో నిమగ్రమైన స్వయం సహాయ బృందాలకు సామాజిక దూరం ప్రాముఖ్యంపై డిజిటల్ మార్గంలో అవగాహన కల్పించనుంది.
మరిన్ని వివరాలకు:
కోవిడ్-19 వ్యాధిగ్రస్థ శ్వాసకోశ స్రావాలను సురక్షితంగా తొలగించగల అత్యాధునిక పీల్చుడు పదార్థాన్ని రూపొందించిన ఎస్‌సీటీఐఎంఎస్‌టీ (SCTIMST)
ఈ పీల్చుడు పదార్థానికి “చిత్ర అక్రిలోసోర్బ్ సెక్రెషన్ సోలిడిఫికేషన్ సిస్టమ్”గా SCTIMST నామకరణం చేసింది. ఇది ద్రవరూప శ్వాసకోశ స్రావాలు, ఇతర శరీర స్రావాలను అమిత వేగంగా పీల్చుకుని, ఘనీభవించేలా చేయడమేగాక ఇన్ఫెక్షన్లను కూడా తుడిచిపెట్టేస్తుంది.
పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం
- అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కోవిడ్ రోగులు, లక్షణాలు కనిపించని నిర్ధారితులు, క్వారంటైన్‌లో ఉన్నవారి కోసం ‘కోవిడ్‌కేర్’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది.
- అసోంలో కోవిడ్-19 సంక్షోభం నడుమ హయ్యర్ సెకండరీ ప్రథమ సంవత్సర పరీక్షలు నిర్వహించరాదని, విద్యార్థులందర్నీ రెండో సంవత్సరానికి ప్రమోట్ చేయాలని అసోం హయ్యర్ సెకండరీ విద్యామండలి నిర్ణయించింది.
- మణిపూర్‌లో ఇంట్లోనే ఉండటం, పరిశుభ్రతతోపాటు సామాజిక దూరం పాటించడంపై అవగాహన కల్పించే వీడియోను రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ ఆవిష్కరించారు.
- మిజోరం వెలుపలినుంచి రాష్ట్రంలోని రవాణా చేసిన కూరగాయలను ఇకపై రాష్ట్ర కోవిడ్-19 వైద్య కార్యకలాపాల బృందాలు తనిఖీ చేస్తాయి.
- నాగాలాండ్‌లో 34 ఏకాంత చికిత్స కేంద్రాలు, 43 క్వారంటైన్ కేంద్రాల ఏర్పాటుద్వారా కోవిడ్-19పై పోరును ప్రభుత్వం ముమ్మరం చేసింది. అలాగే 84 ప్రభుత్వ, 52 ప్రైవేటు అంబులెన్స్ వాహనాలను సిద్ధంగా ఉంచింది.
- సిక్కింలో కోవిడ్-19 నిర్ధారణకు ప్రయోగశాల ఏర్పాటును వేగిరం చేయాల్సిందిగా రాష్ట్ర గవర్నర్ ప్రభుత్వాన్ని ఆదేశించారు.
- త్రిపురలో ఏకైక కోవిడ్-19 రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు.
- కేరళలో రెండు రోజులుగా కొత్త కరోనా కేసులకన్నా కోలుకుంటున్న కేసులు అధికంగా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో వ్యాధి నిర్ధారణ అయిన రోగులకు ప్లాస్మా చికిత్స అందించే అవకాశాల పరిశీలనకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఐసీఎంఆర్ అనుమతించింది. కాగా ముంబైలో ఇద్దరు మలయాళీ నర్సులకు వ్యాధి సోకింది. నిన్నటిదాకా నమోదైన మొత్తం కేసులు 345.
- తమిళనాడులో మొత్తం కేసుల సంఖ్య 738కి చేరింది. కాగా, దిగ్బంధం నేపథ్యంలో ప్రజలకు నిత్యావసరాల సరఫరాలో ఇబ్బందులు తొలగించేందుకు సంచార కూరగాయల, కిరాణా సరకుల విక్రయం చేపట్టాలని గ్రేటర్ చెన్నై కార్పొరేషన్, వాణిజ్య సంస్థల సంఘం నిర్ణయించాయి.
- తెలంగాణలో కోవిడ్-19పై పోరాటం చేస్తున్న ఆరోగ్య సంరక్షణ సిబ్బంది కోసం బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్), హైదరాబాద్ పరిశోధకులు పునరుపయోగ 3డీ ఫేస్ షీల్డ్‌ను రూపొందించారు. కాగా, రాష్ట్రంలోని నిజామాబాద్‌లో మరో 8 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 461కి చేరింది.
- ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కేసుల సంఖ్య 348కి చేరింది. కాగా, క్వారంటైన్‌లో గలవారికి చికిత్సతోపాటు రోగనిరోధకత పెంపు దిశగా పౌష్టికాహార సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలూ చేపట్టింది. కాగా, ఎన్-95 మాస్కులు, వ్యక్తిగత రక్షణ సామగ్రి ఇవ్వలేదంటూ అనంతపూర్‌లో జూనియర్ డాక్టర్లు నిరసన తెలిపారు. అంతకుముందు ఇక్కడి ఆస్పత్రిలోఇద్దరు డాక్టర్లు, మరో ఇద్దరు నర్సులకు ఇన్ఫెక్షన్ సోకింది.
(Release ID: 1612760)
Visitor Counter : 262
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam