ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 పై తాజా వివరాలు

Posted On: 09 APR 2020 7:16PM by PIB Hyderabad

దేశంలో కోవిడ్-19 నివారణనియంత్రణ మరియు నిర్వహణ కోసం భారత ప్రభుత్వం వివిధ రాష్ట్రాలు  / కేంద్రపాలిత ప్రాంతాలతో కలిసి అనేక చర్యలు తీసుకుంటోంది.   వీటిని క్రమం తప్పకుండా ఉన్నత స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు

కోవిడ్-19 పై డాక్టర్ హర్ష వర్ధన్ అధ్యక్షతన మంత్రుల బృందం (జి.ఓ.ఎం.) సమావేశం ఈ రోజు నిర్మాణ్ భవన్ లో జరిగింది.  కోవిడ్-19 వ్యాప్తి నివారణ, యాజమాన్య చర్యలపై మంత్రుల బృందం విస్తృతంగా చర్చించింది.    పి.పి. ఈ.లు, ఎన్-95 మాస్కులు, వెంటిలేటర్లు తగినంతగా అందుబాటులో ఉండడంపై కూడా మంత్రుల బృందం చర్చించింది. పి.పి.ఈ.లను దేశీయంగా తయారుచేయడానికి 30 మంది ఉత్పత్తిదారులును గుర్తించినట్లు మంత్రుల బృందం తెలియజేసింది. వారికి 1.7 కోట్ల పి.పి.ఈ. లకు ఆర్డర్ ఇవ్వగా, సరఫరా ఇప్పటికే ప్రారంభమైందనీ మంత్రుల బృందం తెలిపింది. వెంటిలేటర్ల కోసం కూడా 49,000 ఆర్దర్లు ఇవ్వడం జరిగింది దేశవ్యాప్తంగా పరీక్షల నిర్వహణ వ్యూహం, పరీక్షా పరికరాల లభ్యత పై కూడా మంత్రుల బృందం సమీక్షించింది. వైరస్ వ్యాప్తి ఎక్కువ ఉన్న ప్రాంతాల నిర్వహణ వ్యూహాన్ని కూడా ఈ సందర్భంగా సమీక్షించారు

వైద్యుల సూచనల మేరకు హైడ్రో క్లోరోక్విన్  (హెచ్.సి.క్యూ.) వినియోగించాలని మంత్రుల బృందం ఆదేశించింది.  అయితే, గుండె సంబంధమైన వైదులు ఉన్నవారికి ఇది హాని చేస్తుంది కాబట్టి వారికి వీటిని వాడకూడదని కూడా తెలియజేసింది.  దేశంలో హైడ్రో క్లోరోక్విన్ నిల్వలు సమృద్ధిగా ఉండేటట్లు చూసుకోవాలని కూడా మంత్రుల బృందం సూచించింది.  

ఆయా ప్రాంతాలలో వైరస్ వ్యాప్తి నిరోధానికీఆసుపత్రుల సంసిద్ధత (కోవిడ్-19 రోగులకు ఐ.సి.యు. & వెంటిలేటర్ యాజమాన్యం) వంటి కార్యక్రమాల నిర్వహణ కోసం రాష్ట్రాలకు, రాష్ట్ర ఆరోగ్య విభాగాలకు సహాయం అందించడానికి వీలుగా ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి బహుముఖ నిపుణుల కేంద్ర బృందాలను నియమించింది.  ఈ బృందాలను బీహార్, రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పంపడం జరిగింది 

వైరస్ పరిణామాన్నీ, నోవెల్ కరోనా వైరస్ మొత్తం జన్యు శ్రేణి ని అర్ధం చేసుకునే పనిని హైదరాబాద్ లోని  సెంటర్ ఫర్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సి.ఎస్.ఐ.ఆర్. లాబ్స్) మరియు సెంటర్ ఫర్ సెల్ల్యూలార్ & మోలెక్యూలర్ బయాలజీ (సి.సి.ఎం.బీ. లాబ్స్) తో పాటు న్యూఢిల్లీ లోని ఇన్ స్టిట్యూట్ అఫ్ జెనోమిక్స్ & ఇంటిగ్రేటివ్ బయాలజీ (ఐ.జి.ఐ.బి.) కలిసి చేపట్టాయి. 

కోవిడ్-19 నిర్వహణ కోసం అనేక జిల్లాలు పలు వినూత్న ఆవిష్కరణ చర్యలు అమలు చేస్తున్నాయి.  అందులో  కొన్ని ఉత్తమ చర్యలు ఇలా ఉన్నాయి

o    కర్నాల్ జిల్లా : 

§   ఒక కుటుంబాన్ని దత్తత తీసుకునే కార్యక్రమం :  కర్నాల్ లోని కుటుంబాలు, పరిశ్రమలు, ప్రవాస భారతీయులు మొదలైన వారు జిల్లా వ్యాప్తంగా 13,000 పేద కుటుంబాల యోగ క్షేమాలను చూసుకోడానికి గాను సుమారు 64 లక్షల రూపాయలు విరాళంగా అందజేశారు. 

§   వ్యాధికి గురైన బృందాలకు రోజుకు 90,000 భోజనాలు పంపిణీ చేయడానికి కృషి జరుగుతోంది. 

§      స్వచ్చందంగా గృహ నిర్బంధంలో ఉన్న వారి వివరాలు సేకరించడానికి కర్నాల్ లైవ్ ట్రాకర్" అనే యాప్ ను, కూరగాయలు / పండ్లు టోకు వ్యాపారస్తులకు / పాడి పరిశ్రమ వర్గాలకు ఉపయోగపడే విధంగా, స్థానికంగా నిత్యావసరాలు సరఫరాకు వీలు కలిగే విధంగా " నీడ్ ఆన్ వీల్స్" (ఎం.ఓ.డబ్ల్యూ.-నౌ) అనే యాప్ ను స్థానిక జిల్లా యంత్రాంగం  అందుబాటులోకి తెచ్చింది

o    లక్నో జిల్లా :

§    హోటళ్లను క్వారంటైన్ కేంద్రాలుగా మార్చేందుకు కృషి కొనసాగుతోంది. 

 

ఇంతవరకు, 5,734 కేసులను ధృవీకరించారు. 166 మరణాలు నమోదయ్యాయి.   473 మంది చికిత్స అనంతరం కోలుకుని ఆసుపత్రుల నుండి విడుదల అయ్యారు

కోవిడ్-19 కు సంబంధించిన సాంకేతిక సమస్యలుమార్గదర్శకాలుసలహాలుసూచనలపై ప్రామాణికమైనతాజా సమాచారం కోసం  వెబ్ సైట్ ను క్రమం తప్పకుండా సందర్శించండి : 

    : https://www.mohfw.gov.in/.

కోవిడ్-19 కు సంబంధించిన సాంకేతిక సమస్యలకు పరిష్కారాలను దిగువ పేర్కొన్న  మెయిల్ ను సంప్రదించడం  ద్వారా తెలుసుకోవచ్చు : 

                    technicalquery.covid19[at]gov[dot]in 

ఇతర సందేహాలుఅనుమానాలకు పరిష్కారాలను దిగువ పేర్కొన్న  మెయిల్ ను సంప్రదించడం  ద్వారా తెలుసుకోవచ్చు :  
                    ncov2019[at]gov[dot]in .

కోవిడ్-19 పై ఎటువంటి అనుమానాలుసమస్యలుసమాచారానికైనాఆరోగ్యంకుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన ఉచిత  హెల్ప్ లైన్ నెంబర్ :    +91-11-23978046  లేదా  1075   ను సంప్రదించవచ్చు. 

వివిధ రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల కు చెందిన కోవిడ్-19 హెల్ప్ లైన్ నెంబర్ల జాబితా మరియు ఇతర సమాచారం కోసం  వెబ్ సైట్ ని చూడండి : 

https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf .

*****


(Release ID: 1612746) Visitor Counter : 228