సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 పై అవగాహన కల్పించడానికి పెన్షనర్లతో మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెబ్‌నార్
- పింఛనుదారులకు విలువైన సూచనలను అందజేసిన ఎయిమ్స్ అగ్ర వైద్యులు
Posted On:
09 APR 2020 4:15PM by PIB Hyderabad
కోవిడ్-19 వ్యాప్తి, సంబంధిత సమస్యలపై అవగాహన కల్పించేందుకు గాను పెన్షన్ అండ్ పెన్షనర్స్ సంక్షేమ శాఖ (డీవోపీపీడబ్ల్యూ) గురువారం వెబ్‌నార్‌ను ఏర్పాటు చేసింది. ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), పెన్షన్లు, అణు ఇంధనం అంతరిక్షం, పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్స్, ప్రధానమంత్రి కార్యాలయ శాఖల సహాయ మంత్రి జితేంద్ర సింగ్ మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. దేశ వ్యాప్తంగా 22 నగరాల నుంచి దాదాపు 100 పెన్షనర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా, ఎయిమ్స్ జెరియాట్రిక్ మెడిసిన్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రసున్ ఛటర్జీలతో ఆన్‌లైన్‌లో సంభాషించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు మరియు పరిష్కార మార్గాలను గురించి వివరించారు. దీనికి తోడు కోవిడ్ నేపథ్యంలో పెన్షనర్లు చేయాల్సిన, చేయకూడని పనులను గురించి కూడా నిపుణులు వివరించి చెప్పారు. వెబ్‌నార్లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన చాలా మంది పెన్షనర్లు లేవనెత్తిన వివిధ సందేహాలకు డాక్టర్ రణదీప్ గులేరియా, డాక్టర్ ప్రసున్ ఛటర్జీలు విస్తృత పరిష్కారాలను సూచించారు.
వృద్ధులపై కరోనా ప్రభావం అధికం..
వెబ్‌నార్లో భాగంగా మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పింఛనుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారి వ్యాప్తిలో వృద్ధుల మరణాలు ఎక్కువగా నమోదవుతూ వస్తున్నాయని వివరించారు. యువతలో కోవిడ్ అనారోగ్యం ఎక్కువగా కనిపిస్తోందని తెలిపారు. బలహీనమైన రోగనిరోధక శక్తి కారణంగా వృద్ధులు కోవిడ్‌కు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉందిని పేర్కొన్నారు. ఈ మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడటానికి మేటి వ్యక్తిగత శుభ్రత పద్ధతులు పాటించడం ఎంతో ముఖ్యమని సూచించారు. కోవిడ్ 19 పై సంబంధిత తాజా సమాచారాన్ని అందించే ఆరోగ్యం సేథు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ యాప్ కారణంగా కోవిడ్ నుంచి కాపాడుకొనేందుకు వీలుంటుందని తెలిపారు.
కోవిడ్‌తో పోరాడుతున్న వైద్యులు కరోనా యోధులు..
కరోనా వైరస్‌ను కట్టడి చేసి ప్రజలను కాపాండేందుకు సర్వ శక్తులనొడ్డి పోరాడుతున్న వైద్యులను మంత్రి కరోనా యోధులుగా మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రశంసించారు. కోవిడ్ నేపథ్యంలో ప్రజలను కాపాడుకొనేందుకు, దేశ వాసులకు అవసరమైన అన్ని నిత్యవసర వస్తువుల సరఫరా సజావుగా సాగేందుకు గాను భారత ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఆయన పింఛనుదారులకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమం డీవోపీపీడబ్య్లూ శాఖకు చెందిన డీఎస్ రుచీర్ మిట్టల్ వందన సమర్పణతో ఈ కార్యక్రమం ముగిసింది.
(Release ID: 1612670)
Visitor Counter : 264
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam