గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
కోవిడ్-19పై ఫిర్యాదులు-పరిష్కారానికి నవీకృత ‘స్వచ్ఛత యాప్’ను
ప్రారంభించిన కేంద్ర గృహనిర్మాణ-పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ
Posted On:
09 APR 2020 1:08PM by PIB Hyderabad
కేంద్ర గృహనిర్మాణ-పట్టణ వ్యవహారాల శాఖ నిన్న నవీకరించిన ‘స్వచ్ఛత-మొహువా’ (Swachhata-MoHUA) యాప్‌ను ప్రారంభించింది. ఈ మేరకు మంత్రి శ్రీ దుర్గాశంకర్ మిశ్రా అధ్యక్షతన అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు, నగరాల ప్రతినిధులతో దృశ్య-శ్రవణ మాధ్యమ సమావేశం సందర్భంగా ప్రకటించారు. ప్రస్తుత యాప్‌ను దేశంలో 1.7 కోట్ల మందికిపైగా వాడుతున్న నేపథ్యంలో పట్టణ పాలక సంస్థలు కోవిడ్-19పై ఫిర్యాదులు స్వీకరించి, పరిష్కరించేలా దీన్ని పూర్తిగా నవీకరించి విడుదల చేశారు. అయితే, ఇందులోని ఇతర అంశాలన్నీ యథాతథంగా ఉంటాయని, కోవిడ్-19పై 9 కేటగిరీలను అదనంగా చేర్చామని మంత్రి శ్రీ దుర్గాశంకర్ మిశ్రా సమావేశంలో వెల్లడించారు. అవేమిటంటే:
-
కోవిడ్-19 కాలంలో ఫాగింగ్/పారిశుధ్యం కోసం అభ్యర్థన
-
కోవిడ్-19 కాలంలో క్వారంటైన్ నిబంధన ఉల్లంఘన
-
కోవిడ్-19 కాలంలో దిగ్బంధం నిబంధన ఉల్లంఘన
-
కోవిడ్-19 అనుమానిత కేసుల సమాచార ప్రదానం
-
కోవిడ్-19 కాలంలో ఆహార సరఫరా కోసం అభ్యర్థన
-
కోవిడ్-19 కాలంలో ఆశ్రయం కోసం అభ్యర్థన
-
కోవిడ్-19 కాలంలో మందుల సరఫరా కోసం అభ్యర్థన
-
కోవిడ్-19 రోగుల తరలింపునకు సహాయం కోసం అభ్యర్థన
-
కోవిడ్-19 క్వారంటైన్ ప్రాంతంనుంచి వ్యర్థాల తరలింపునకు అభ్యర్థన
నవీకృత స్వచ్ఛత యాప్‌ను ప్రస్తుతం ఎంపికచేసిన రాష్ట్రాలు, నగరాలకు పరిమితం చేశామని, వినియోగంపై సమీక్ష తర్వాత దేశవ్యాప్తంగా వాడకాన్ని విస్తృతం చేస్తామని మంత్రి తెలిపారు.
అనుబంధం ‘ఎ’- ‘స్వచ్ఛత-మొహువా’ యాప్‌లో కోవిడ్-19 కేటగిరీలపై ప్రశ్నలు-జవాబులు
వ.స॥
|
ప్రశ్నలు
|
సమాధానాలు
|
1
|
‘స్వచ్ఛత-మొహువా’లో కోవిడ్-19 ఫిర్యాదుల పరిష్కర్తలెవరు?
|
పట్టణ పాలన సంస్థలు- నేరుగా పరిష్కారం లేదా సంబంధిత విభాగాలకు అప్పగించడం.
|
2
|
ఈ కేటగిరీలు స్వచ్ఛత సర్వేక్షణ్/ జీఎఫ్‌సి/ఓడీఎఫ్‌లలో భాగమా?
|
కాదు... కోవిడ్-19 కింద ఫిర్యాదులు, పరిష్కారాలు స్వచ్ఛ సర్వేక్షణ్, జీఎఫ్‌సీ/ఓడీఎఫ్ విధానాల పరిధిలోకి రావు.
|
3
|
ఈ యాప్‌లో ప్రస్తుత అంశాలన్నీ యథాతథంగా ఉంటాయా?
|
కొత్తగా వచ్చిన కోవిడ్-19 కేటగిరీసహా పాత అంశాలన్ని యథాతథంగా కొనసాగుతాయి.
|
4
|
ఫిర్యాదుల పర్యవేక్షణ ఎలా?
|
స్వచ్ఛత యాప్‌లో, www.swachh.cityలో పర్యవేక్షించవచ్చు.
|
5
|
ఫాగింగ్, పారిశుధ్యాలను వేర్వేరుగా విభజించే వీలుందా?
|
కేటగిరీ మారదు. అయితే, ‘మరింత సమాచారం’లో ఫిర్యాదీలు వివరణ ఇవ్వవచ్చు/వారిని పురపాలిక వాకబు చేయొచ్చు.
|
6
|
కోవిడ్-19 వ్యర్థాల అవ్యవస్థీకృత తొలగింపుపై కేటగిరీ చేర్చవచ్చా?
|
వీలు లేదు. కానీ, ఈ అంశాన్ని ‘క్వారంటైన్ ప్రాంత వ్యర్థాల తొలగింపునకు అభ్యర్థన’ కేటగిరీ కింద ప్రస్తావించవచ్చు.
|
7
|
సామాజిక దూరం ఉల్లంఘనపై ప్రత్యేక కేటగిరీ చేర్చవచ్చా?
|
వీలు లేదు. దీన్ని ‘కోవిడ్-19 దిగ్బంధం ఉల్లంఘన’ కేటగిరీ కింద ప్రస్తావించవచ్చు.
|
8
|
తీవ్ర ముప్పున్నచోట మాస్కు ధరించకపోతే చేర్చవచ్చా?
|
వీలు లేదు. దీన్ని ‘కోవిడ్-19 దిగ్బంధం ఉల్లంఘన’ కేటగిరీ కింద ప్రస్తావించవచ్చు.
|
9
|
ఇన్ఫెక్షన్ ప్రక్షాళన/పారిశుధ్యాన్ని ప్రత్యేక కేటగిరీగా చేర్చవచ్చా?
|
వీలులేదు. దీన్ని ‘కోవిడ్-19 కాలంలో ఫాగింగ్/పారిశుధ్యం కోసం అభ్యర్థన’ కింద ప్రస్తావించవచ్చు.
|
10
|
దుర్వినియోగం ముప్పున్నందున ఆహార అభ్యర్థన తొలగించొచ్చుగా!
|
కోవిడ్-19 కాలంలో ఇది అత్యంత కీలకం. పేద పౌరులకు ఆహార సరఫరా బాధ్యత పట్టణ స్థానిక సంస్థలపైనే ఉంది.
|
11
|
క్వారంటైన్, దిగ్బంధాన్ని పోలీసు/ జిల్లా యంత్రాంగం చూడవచ్చుగా!
|
సంబంధిత ప్రాధికార సంస్థకు పట్టణ సంస్థ నివేదించవచ్చు. దానికి జవాబును స్వచ్ఛ యాప్‌లో ప్రదర్శించవచ్చు.
|
12
|
యాప్‌లో సాంకేతిక సమస్యలపై సహాయ కేంద్రం ఏదైనా ఉందా?
|
సందేహాలుంటేswachhbharat@janaagraha.orgకు మెయిల్ పంపండి. అనుష్క అరోరా, జనాగ్రహ్: 96255 14474కు ఫోన్ చేయొచ్చు... అపరిష్కృత అంశాలపై ఫిర్యాదుల కోసం:
సుమిత్ అరోరా, జనాగ్రహ్: 98183, ప్రబల్ భరద్వాజ్,
నేషనల్ పీఎంయూ, ఎస్‌బీఎం (యు): 78386 06896
|
(Release ID: 1612561)
Visitor Counter : 247