ఆర్థిక మంత్రిత్వ శాఖ

రు.5 లక్షలు వరకు నిలిపివేసి ఉన్నఆదాయపు పన్ను తిరిగి చెల్లింపులను వెంటనే విడుదల చేయనున్న ఆదాయపు పన్ను శాఖ; లాభపడనున్న సుమారు 14 లక్షల పన్ను చెల్లింపుదారులు

Posted On: 08 APR 2020 6:16PM by PIB Hyderabad

ఎంఎస్ఎంఇతో కలుపుకుని సుమారు  లక్ష వ్యాపార సంస్థలకు లబ్ది చేకూర్చేందుకు అన్ని జిఎస్టి మరియు పన్ను చెల్లింపులు కూడా విడుదల

మొత్తం రు.18,000 కోట్ల రిఫండ్ నిధి వెంటనే మంజూరు

కొవిడ్-19 వలన తలెత్తిన పరిస్థితుల దృష్ట్యా వ్యాపారులు మరియు వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కోసం రు.5 లక్షల వరకు పెండింగు(నిలిపివేయబడి)లో ఉన్న అన్ని ఆదాయపు పన్ను పున:చెల్లింపులను విడుదల చేయాలని ఆ శాఖ నిర్ణయించింది. ఈ నిర్ణయం వలన సుమారు 14 లక్షల పన్నుచెల్లింపుదారులకు లబ్ది చేకూరనుంది.

ఈ నిర్ణయంతోపాటు   సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా వ్యాపారస్తులతో కలుపుకుని సుమారు 1 లక్ష వ్యాపార సంస్థల పెండింగులో ఉన్న అన్ని జిఎస్టి మరియు కస్టం పున:చెల్లింపులను వెంటనే చెల్లించాలనే నిర్ణయం కూడా జరిగింది. దీనికి సంబంధించిన మొత్తం సుమారు రు.18,000 కోట్ల నిధిని వెంటనే మంజూరు చేయనున్నారు.  



(Release ID: 1612330) Visitor Counter : 258