పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
జోర్హాట్, లెంగ్‌పుయి, దీమాపూర్, ఇంఫాల్, ఇతర ఈశాన్య ప్రాంతాలకు వైద్య వస్తువులను రవాణా చేస్తున్న లైఫ్ లైన్ ఉడాన్ విమానాలు
పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ రోజు వారీ చింతన్, మంథన్ సమావేశాల ద్వారా ఆపరేషన్ల ముందస్తు ప్రణాళిక, సమీక్ష
152 లైఫ్ లైన్ ఉడాన్ విమానాల ద్వారా దేశ వ్యాప్తంగా 200 టన్నుల వైద్య సరకు రవాణా
Posted On:
07 APR 2020 5:03PM by PIB Hyderabad
పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆన్‌లైన్ సమావేశాలు, వర్చువల్ వార్ రూమ్ ద్వారా ముందస్తు ప్రణాళికను నిర్వహిస్తోంది. తద్వారా సరఫరా డిమాండ్ సమతుల్యం పాటించడంలో ఏ అవకాశం కూడా జారవిడుచుకోకుండా చూస్తూ కోవిడ్-19కి వ్యతిరేకంగా పోరాటంలో విమానయాన రంగంలోని వివిధ వనరులను మెరుగ్గా వినియోగించుకుంటోంది.
రోజు వారీ ప్రణాళికతో పాటు మునుపటి రోజు పురోగతిని సమీక్షించడానికి పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు చింతన్ సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఇంకా, మధ్యాహ్నం 3 గంటలకు మంథన్ సమావేశం ఆ రోజు ప్రణాళిక అమలును సమీక్షిస్తూ ఏ దశలోనైనా మార్పులు చేర్పులు ఆవశ్యకతను బేరీజు వేసుకుంటుంది. ఈ సమావేశంలో, వనరుల అవసరం, పంపిణీని అంచనా వేయడానికి మున్ముందు అనుసరించాల్సిన వ్యూహంపై ప్రణాళిక రచన జరుగుతుంది.
పౌర విమానయాన శాఖ లైఫ్ లైన్ ఉడాన్ కార్యక్రమం కింద కొండ ప్రాంతాలతో సహా మారుమూల ప్రాంతాలకు సైతం వైద్య అవసరాల వస్తువులను చేరవేసేందుకు దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 152 సరుకు రవాణా విమానాలు నడిపారు. ఎయిర్ ఇండియా, అలయన్స్ ఎయిర్, భారత వైమానిక దళం, ప్రైవేట్ విమానాల సహాయంతో ఈ లాక్ డౌన్ కాలంలో 200 టన్నులకు పైగా వైద్య వస్తువులను గమ్యాలకు చేరవేశారు.
6 ఏప్రిల్ 2020 తేదీన, లైఫ్ లైన్ ఉడాన్ విమానాలు- ఐసిఎంఆర్ కిట్లు, హెచ్‌ఎల్‌ఎల్ సరుకులు, ఇతర నిత్యావసర సరుకులను ఈశాన్య ప్రాంతాలకు, మధ్య భారత్, తూర్పు రాష్ట్రాలకు తీసుకువెళ్ళాయి. వివరాలు క్రింద ఉన్నాయి:
హాల్ - దిమాపూర్-గువహతి ఐసిఎంఆర్ కిట్ల రవాణా (50 కిలోలు) గువహతి కోసం, రెడ్ క్రాస్ (800 కిలోలు) తో కలిపి అసోంకి సరకు రవాణా, మేఘాలయ సరుకు (672 కిలోలు), మణిపూర్, నాగాలాండ్ కి సరుకు రవాణా, డిబ్రుగర్ కి ఐసిఎంఆర్ సరుకు, మిజోరాం (300 కిలోలు), రాంచీ సరుకు (500 కిలోలు) మరియు పాట్నాకు ఐసిఎంఆర్ కిట్లు (50 కిలోలు).
లైఫ్ లైన్ 2 అలియన్స్ ఎయిర్ (ఎటిఆర్):
ఢిల్లీ-వారణాసి-రాయ్‌పూర్-హైదరాబాద్- ఢిల్లీ ఐసిఎంఆర్ కిట్లు (50 కిలోలు) వారణాసికి, ఐసిఎంఆర్ కిట్లు (50 కిలోలు) రాయ్‌పూర్‌కు, ఐసిఎంఆర్ కిట్లు (50 కిలోలు) హైదరాబాద్‌కు, ఐసిఎంఆర్ కిట్లు (50 కిలోలు) విజయవాడకు తీసుకువెళ్లారు. అలాగే హైదరాబాద్ కు 1600 కిలోల రవాణా జరిగింది.
లైఫ్ లైన్ 3 ఎయిర్ ఇండియా (ఎ 320) :ముంబై-బెంగళూరు-చెన్నై-ముంబై జౌళి మంత్రిత్వ శాఖ కి చెందిన సరుకు, బెంగళూరుకు హెచ్‌ఎల్‌ఎల్ సరుకు, చెన్నైకి హెచ్‌ఎల్‌ఎల్ సరుకు రవాణా అయింది.
లైఫ్ లైన్ 4: స్పైస్ జెట్ ఎస్జి (7061) ఢిల్లీ-చెన్నై ఐసిఎంఆర్ సరుకు చెన్నైకి
లైఫ్ లైన్ 5: ఎఐ (ఎ 320) ఢిల్లీ -డెహ్రాడూన్ ఐసిఎంఆర్ సరకు డెహ్రాడూన్ కి.
తేదీల వారీగా :
వరుస సంఖ్యా
|
తేదీ
|
ఎయిర్ ఇండియా
|
అలయన్స్
|
ఐఏఎఫ్
|
ఇండిగో
|
స్పైస్ జెట్
|
మొత్తం ఆపరేట్ చేసిన విమానాలు
|
1
|
26.3.2020
|
02
|
--
|
-
|
-
|
02
|
04
|
2
|
27.3.2020
|
04
|
09
|
01
|
-
|
--
|
14
|
3
|
28.3.2020
|
04
|
08
|
-
|
06
|
--
|
18
|
4
|
29.3.2020
|
04
|
10
|
06
|
--
|
--
|
20
|
5
|
30.3.2020
|
04
|
-
|
03
|
--
|
--
|
07
|
6
|
31.3.2020
|
09
|
02
|
01
|
|
--
|
12
|
7
|
01.4.2020
|
03
|
03
|
04
|
--
|
-
|
10
|
8
|
02.4.2020
|
04
|
05
|
03
|
--
|
--
|
12
|
9
|
03.4.2020
|
08
|
--
|
02
|
--
|
--
|
10
|
10
|
04.4.2020
|
04
|
03
|
02
|
--
|
--
|
09
|
11
|
05.4.2020
|
--
|
--
|
16
|
--
|
--
|
16
|
12
|
06.4.2020
|
03
|
04
|
13
|
|
|
20
|
|
మొత్తం విమానాలు
|
49
|
44
|
51
|
06
|
02
|
152
|
* లడఖ్, కార్గిల్, దిమాపూర్, ఇంఫాల్, గౌహతి, చెన్నై, అహ్మదాబాద్, పాట్నా, జోర్హాట్, లెంగ్‌పుయి, మైసూరు, హైదరాబాద్, రాంచీ, జమ్మూ, శ్రీనగర్, చండీగర్, పోర్ట్ బ్లెయిర్ కోసం ఎయిర్ ఇండియా, ఐఎఎఫ్ సహకరించాయి.
* గువహతి, డిబ్రుగర్, అగర్తాలా, ఐజ్వాల్, దీమాపూర్, ఇంఫాల్, జోర్హాట్, లెంగ్‌పుయి, మైసూరు, కోయంబత్తూర్, త్రివేండ్రం, భువనేశ్వర్, రాయ్‌పూర్, రాంచీ, శ్రీనగర్, పోర్ట్ బ్లెయిర్, పాట్నా, కొచ్చిన్, విజయవాడ, అహ్మదాబాద్, జమ్మూ, కార్గిల్, లడఖ్, ఛండీగర్, గోవా కి కూడా సరుకు రవాణా చేసారు.
మొత్తం కిలోమీటర్లు
|
1,32,029
|
06.04.2020 తేదీన రవాణా చేసిన సరుకు
|
15.54 టన్నులు
|
06.04.2020 వరకు రవాణా చేసిన సరుకు
|
184.66 + 15.54 = 200.20 టన్నులు
|
అంతర్జాతీయం:
షాంఘై, ఢిల్లీ మధ్య విమానయానం ఏర్పాటయింది. ఎయిర్ ఇండియా మొదటి కార్గో ఫ్లైట్ 4 ఏప్రిల్ 2020 న 21 టన్నుల వైద్య పరికరాలను తీసుకువచ్చింది. మరో సరుకుల భాగం హాంకాంగ్‌కు పంపిస్తున్నారు. అవసరానికి అనుగుణంగా కీలకమైన వైద్య పరికరాల తేవడం కోసం ఎయిర్ ఇండియా చైనాకు ప్రత్యేక షెడ్యూల్ కార్గో విమానాలను నడుపుతుంది.
ప్రైవేట్ ఆపరేటర్లు :
దేశీయ కార్గో ఆపరేటర్లు; బ్లూ డార్ట్, స్పైస్‌జెట్, ఇండిగో వ్యాపార ప్రాతిపదికన కార్గో విమానాలను నడుపుతున్నాయి. స్పైస్ జెట్ 24 మార్చి - 6 ఏప్రిల్ 2020 మధ్య 2,58,210 కిలోమీటర్ల దూరాన్ని నడిపి 1530.13 టన్నుల సరుకును 189 కార్గో విమానాల ద్వారా రవాణా చేసింది. వీటిలో 53 అంతర్జాతీయ కార్గో విమానాలున్నాయి. బ్లూ డార్ట్ 58 దేశీయ కార్గో విమానాలను 5,51,14 కిలోమీటర్ల దూరం, 862.2 టన్నుల సరుకును 25 మార్చి - 6 ఏప్రిల్ 2020 రవాణా చేసింది. ఇండిగో 3 - 4 ఏప్రిల్ 2020 న 810 కార్గో విమానాలను 6103 కిలోమీటర్ల దూరం నడిపింది. 3.14 టన్నుల సరుకు తీసుకువెళ్ళింది.
******
(Release ID: 1612082)
Visitor Counter : 239
Read this release in:
Tamil
,
Hindi
,
English
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada