మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

కోవిడ్‌-19 వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో కేంద్ర హెచ్‌ఆర్‌డీ మంత్రి సలహా మేరకు.

విద్యార్థుల మానసిక ఆరోగ్యం, శ్రేయస్సు నిమిత్తం యూజీసీ సూచ‌న‌లు జారీ

Posted On: 06 APR 2020 3:21PM by PIB Hyderabad

కోవిడ్‌-19 వ్యాప్తి నేప‌థ్యంలో దేశ వ్యాప్త విశ్వ‌విద్యాల‌యాల్లో విద్యార్థుల మానసిక ఆరోగ్యం, శ్రేయస్సు నిమిత్తం అవసరమైన అన్ని చర్యలు చేప‌ట్టాల‌ని కేంద్ర మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ తన మంత్రిత్వ శాఖ పరిధిలోని స్వయం ప్రతిపత్తి గ‌ల‌ సంస్థల అధిపతులను ఆదేశించారు. ఈ నేప‌థ్యంలో కోవిడ్ వ్యాప్తి నెల‌కొని ఉన్న ప్ర‌స్తుత త‌రుణంలోనూ ఆ త‌రువాత కూడా దేశ విద్యార్థి సమాజంలోని మానసిక ఆరోగ్యం మరియు మానసిక-సామాజిక సమస్యల ప‌రిష్కారానికి వారి శ్రేయస్సు కోసం అవ‌స‌ర‌మైన కింది చ‌ర్య‌ల‌ను చేప‌ట్టాల‌ని యూనివ‌ర్సిటీ గ్రాంట్స్ క‌మిష‌న్ (యూజీసీ) అన్ని విశ్వవిద్యాలయాలు మరియు కళాశాలలను కోరిందిః
1. విశ్వవిద్యాలయాలు / కళాశాలలలోని విద్యార్థులకు మానసిక ఆరోగ్యం క‌ల్పించ‌డం, మానసిక సామాజిక ఆందోళనలను దూరం చేసే విధంగా విద్యార్థుల శ్రేయస్సు కోసం హెల్ప్‌లైన్ల‌ను ఏర్పాటు చేయాలి. అనుభ‌వ‌జ్ఞులైన కౌన్సిలర్లు మరియు గుర్తించబడిన ఇతర అధ్యాపక సభ్యులు విద్యార్థులను క్రమం తప్పకుండా పర్యవేక్షించేలా త‌గిన ఏర్పాట్లు చేయాలి.

2. విద్యార్థులకు క్ర‌మం త‌ప్ప‌కుండా మెంటరింగ్ నిర్వ‌హించ‌డం, విజ్ఞప్తులు / లేఖల వంటి చ‌ర్య‌ల‌తో ఎప్ప‌టిక‌ప్ప‌డు సంప్ర‌దింపులు చేయ‌డం ద్వారా విశ్వవిద్యాలయాలు / కళాశాలలు ప్రశాంతంగా మరియు ఒత్తిడి లేకుండా ఉండేలా చ‌ర్య‌లు చేప‌ట్ట‌వ‌చ్చు. దీనికి తోడు టెలిఫోన్లు, ఈ-మెయిల్స్, డిజిటల్ మరియు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కూడా దీనిని సాధించవచ్చు.
3.  హాస్టల్ వార్డెన్లు / సీనియర్ ఫ్యాకల్టీ నేతృత్వంలో విద్యార్థులకు కోవిడ్‌-19 సహాయక బృందాలను ఏర్పాటు చేయాలి. వీరు అవ‌స‌రంలో ఉన్న వారికి స‌హాయ‌ప‌డేలా వారి సంబధితులు స్నేహితులు క్లాస్‌మేట్‌లను గుర్తించాలి. దీని వ‌ల్ల తక్షణ సాయం ఏదైనా అవ‌స‌ర‌మైన‌ప్పుడు సంబంధితుల‌కు వెంట‌నే తోడ్పాటును అందించేందుకు వీలు ప‌డుతుంది.

4. క్యాంప‌స్ నందు ఉంటున్న‌ విద్యార్థుల మాన‌సిక ఆరోగ్యానికి సంబంధించి స‌ల‌హాలు, తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లకు సంబంధించి ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వారు రూపొందించిన వీడియో లింక్ https://www.mohfw.gov.in ను మీ విశ్వవిద్యాలయం / కళాశాల వెబ్‌సైట్‌లో జోడించండి. దీనికి తోడు ఇదే లింక్‌ను విద్యార్థులు మరియు అధ్యాపకులతో ఈ-మెయిల్, ఫేస్‌బుక్, వాట్సాప్ త‌దిత‌ర‌ సోషల్ మీడియా, ట్విట్ట‌ర్‌ల‌లో పంచుకోండి. కోవిడ్ నేప‌థ్యంలో క్యాంప‌స్‌లో ఉంటున్న వారు మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ఆచరణాత్మక చిట్కాల నిమ‌త్తం https://www.youtube.com/watch?v=uHB3WJsLJ 8s&feature=youtube వీడియోను వీక్షించ‌వ‌చ్చు. కోవిడ్‌-19 నేప‌థ్యంలో మైండింగ్ అవ‌ర్ మైండ్స్ ద్వారా వీక్షించ‌వ‌చ్చు.

బిహేవియ‌ర‌ల్ ఆరోగ్యంః బిహేవియ‌ర‌ల్ (మాన‌సిక ప్ర‌వ‌ర్త‌న‌) ఆరోగ్య విష‌య‌మై స‌ల‌హాలు సూచన‌లు అందించేందుకు గాను సైకియో-సోషల్ టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ - 0804611007ను అందుబాటులోకి తెచ్చారు. కింది చర్యలు క్రమం తప్పకుండా పర్యవేక్షించేందుకు, ఇదే విష‌య‌మై తీసుకొనే చ‌ర్య‌ల‌ను గురించిన స‌మాచారాన్ని ugc.ac.in/uamp పోర్ట‌ల్‌లో యూనివ‌ర్సిటీ యాక్టివిటీ మానిట‌రింగ్ పోర్ట‌ల్‌లో స‌మ‌ర్పించ‌వ‌చ్చ‌ని యూజీసీ తెలిపింది.(Release ID: 1611662) Visitor Counter : 227